ETV Bharat / bharat

టూల్​కిట్ కేసు: మూడు రోజుల కస్టడీకి దిశ రవి

author img

By

Published : Feb 19, 2021, 5:16 PM IST

టూల్​కిట్​ కేసులో దిశ రవికి పటియాలా హౌస్​ కోర్టు.. మూడు రోజుల కస్టడీ విధించింది. సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని కోర్టుకు పోలీసులు తెలపగా.. న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.

Toolkit case: Disha Ravi sent to three-day judicial custody
మూడు రోజుల జ్యూడిషియల్​ కస్టడీకి దిశ రవి

టూల్‌కిట్‌ వ్యవహారంలో అరెస్టైన పర్యావరణ కార్యకర్త దిశా రవికి.. పటియాలా హౌస్ కోర్టు మూడు రోజుల కస్టడీ విధించింది. గణతంత్ర దినోత్సవం రోజు హింసకు దారితీసేందుకు కారణమైన టూల్‌కిట్‌ను రూపొందించారన్న ఆరోపణలతో దిశను దిల్లీ పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసులో గత వారం బెంగళూరులో అరెస్టైన దిశ.. కుట్ర, దేశద్రోహం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశముందని కోర్టుకు దిల్లీ పోలీసులు.. తెలపగా కోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

రైతుల ఆందోళనకు మద్దతుగా స్వీడన్‌కు చెందిన పర్యావరణ కార్యకర్త గ్రేటా థన్‌బర్గ్‌ ట్వీట్‌ చేస్తూ.. ఓ టూల్‌కిట్‌ను జోడించారు. జనవరి 26న రైతుల ఉద్యమానికి సంబంధించి ఓ కార్యాచరణను ఈ టూల్‌కిట్‌లో పొందుపర్చారనే ఆరోపణలతో దిశా రవి అరెస్టయ్యారు.

ఇదీ చదవండి:పర్యావరణం నుంచి 'దేశద్రోహం' వరకు.. ఎవరీ దిశ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.