ETV Bharat / bharat

'ఆరోగ్య భారత్​కు నాలుగు సూత్రాలు'

author img

By

Published : Feb 23, 2021, 11:24 AM IST

Updated : Feb 23, 2021, 11:56 AM IST

భారత ఆరోగ్య రంగంపై ప్రపంచానికి ఉన్న విశ్వాసం ఇప్పుడు సరికొత్త శిఖరాలకు చేరిందని మోదీ అన్నారు. వార్షిక బడ్జెట్​లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు అద్భుతమని కొనియాడారు. భవిష్యత్తులో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధతో ఉండాలని కరోనా సంక్షోభం గుణపాఠం నేర్పిందన్నారు. బడ్జెట్​లో ఆరోగ్య రంగానికి కేటాయింపుల అమలుపై వెబినార్​లో ఈ వ్యాఖ్యలు చేశారు.

Today, the world's trust in India's health sector is at a new high: modi
'ఆరోగ్య భారత్​కు నాలుగు సూత్రాలు'

వార్షిక బడ్జెట్​లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు అద్భుతమని కొనియాడారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రజారోగ్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉందనేందుకు ఇది నిదర్శనమన్నారు.

బడ్జెట్​లో ఆరోగ్య రంగానికి కేటాయింపుల అమలుపై వెబినార్​లో ప్రసంగించారు మోదీ. భవిష్యత్తులో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధతో ఉండాలని కరోనా సంక్షోభం గుణపాఠం నేర్పిందన్నారు.

భారత ఆరోగ్య రంగంపై ప్రపంచానికి ఉన్న విశ్వాసం ఇప్పుడు సరికొత్త శిఖరాలకు చేరిందని మోదీ పేర్కొన్నారు. దేశీయ వ్యాక్సిన్లకు డిమాండ్ పెరుగుతున్న దృష్ట్యా సన్నద్ధంగా ఉండాలన్నారు.

భారత్​ను ఆరోగ్యంగా ఉంచేందుకు ప్రభుత్వం నాలుగింటిపై దృష్టి సారించింది. రోగాలను నియంత్రించడం, వెల్​నెస్​ను ప్రోత్సహించడం, ఆరోగ్య వసతులు మెరుగుపరిచి అందరికీ అందుబాటులో ఉంచడం, ఆరోగ్య నిపుణుల నాణ్యత, మరిమాణం పెంచడం. ఆ దిశగా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఆరోగ్య రంగంలో కేంద్రం పెట్టుబడులు మాత్రమే పెట్టడం లేదు. మారుమూల గ్రామాల్లోనూ ఆరోగ్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూస్తోంది. ఆరోగ్య రంగంలో పెట్టుబడుల ద్వారా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి.

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

Last Updated : Feb 23, 2021, 11:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.