ETV Bharat / bharat

నేటి నుంచి 'టీకా ఉత్సవ్'- అర్హులందరికీ వ్యాక్సిన్​

author img

By

Published : Apr 11, 2021, 5:15 AM IST

Updated : Apr 11, 2021, 10:16 AM IST

దేశవ్యాప్తంగా నేటి నుంచి నాలుగు రోజుల పాటు టీకా ఉత్సవ్ జరగనుంది. అర్హులైన వారందరికీ వ్యాక్సిన్ అందించడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ సూచన మేరకు ఈ కార్యక్రమాన్ని అన్ని రాష్ట్రాలు నిర్వహిస్తున్నాయి.

'Tika Utsav' from Sunday; aim to vaccinate maximum eligible people
రేపటి నుంచి 'టీకా ఉత్సవ్'​: మోదీ

కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసే దిశగా దేశవ్యాప్తంగా నేటి నుంచి టీకా ఉత్సవ్ కార్యక్రమం ప్రారంభం కానుంది. అర్హులైన వారిలో ఎక్కువ మందికి టీకా అందించడమే లక్ష్యంగా.. ఇవాళ్టి నుంచి నాలుగురోజులపాటు ఈ ఉత్సవం కొనసాగనుంది.

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్ననేపథ్యంలో అన్నిరాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఇటీవల వర్చువల్‌గా సమావేశమైన ప్రధాని.. టీకాల పంపిణీని వేగవంతం చేసేందుకు 11నుంచి 14 వ తేదీ వరకూ టీకా ఉత్సవ్ కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. ప్రధాని సూచనల మేరకు టీకా ఉత్సవ్ చేపట్టేందుకు అన్ని రాష్ట్రాలు సిద్ధమయ్యాయి.

మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమై 83 రోజులు కాగా.. ఇప్పటివరకు 10 కోట్ల టీకా డోసులను పంపిణీ చేశారు. 10 కోట్ల డోసుల పంపిణీకి అగ్రరాజ్యం అమెరికాకు 89 రోజులు పడితే చైనాకు 102 రోజులు పట్టింది.

ఇదీ చూడండి: లైవ్​: సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌

Last Updated : Apr 11, 2021, 10:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.