ETV Bharat / bharat

దేశవ్యాప్తంగా జోరుగా 'టీకా ఉత్సవ్'

author img

By

Published : Apr 11, 2021, 1:58 PM IST

Updated : Apr 11, 2021, 2:26 PM IST

అర్హులైన వారందరికీ టీకా అందించడమే లక్ష్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన 'టీకా ఉత్సవ్'​ కార్యక్రమం దేశవ్యాప్తంగా జోరుగా సాగుతోంది. టీకా తీసుకునేందుకు వ్యాక్సినేషన్​ కేంద్రాల వద్ద జనం బారులు తీరుతున్నారు. పలు రాష్ట్రాల్లో టీకా పంపిణీ కేంద్రాలను ఆకర్షణీయంగా ముస్తాబు చేశారు.

Tika UtsavTika Utsav celebrations
దేశంలో ఘనంగా 'టీకా ఉత్సవ్' వేడకలు

కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసే దిశగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన 'టీకా ఉత్సవ్' కార్యక్రమం దేశవ్యాప్తంగా జోరుగా సాగుతోంది. వివిధ రాష్ట్రాల్లో ఉన్నతాధికారులు, రాజకీయ నేతలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో టీకా కేంద్రాలను ఆకర్షణీయంగా ముస్తాబు చేశారు అధికారులు. టీకా తీసుకునేందుకు వ్యాక్సినేషన్​ కేంద్రాలకు లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

Tika Utsav
బెంగళూరులోని అటల్​ బిహార్​ వాజ్​పేయి కళాశాలలో టీకా ఉత్సవ్​ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న కర్ణాటక ఆరోగ్య మంత్రి కె.సుధాకర్​
Tika Utsav
బెంగళూరులో 'టీకా ఉత్సవ్'లో భాగంగా వ్యాక్సిన్​ తీసుకుంటున్న యువతి​
Tika UtsavTika Utsav celebrations
దిల్లీలోని దులీ చంద్​ గుప్తా క్లినిక్​లో లబ్ధిదారులు
Tika Utsav
దిల్లీలో టీకా తీసుకుంటున్న లబ్ధిదారులు
Tika Utsav
మహారాష్ట్ర ముంబయిలోని బీకేసీ వ్యాక్సినేషన్​ కేంద్రానికి టీకా కోసం విచ్చేస్తున్న వృద్ధులు
Tika Utsav
ముంబయిలో వారాంతపు లాక్​డౌన్ కొనసాగుతున్న వేళ టీకా కోసం వస్తున్న వృద్ధుడు
Tika UtsavTika Utsav celebrations
ఒడిశా పట్నాలోని గార్డినర్​ ఆసుపత్రిలో టీకా ఉత్సవ్​ వేడుకలు
Tika Utsav
పట్నాలో టీకా వేయించుకుంటున్న వృద్ధుడు
Tika Utsav
'టీకా ఉత్సవ్​'లో భాగంగా వ్యాక్సిన్ తీసుకుంటున్న మణిపుర్​ ముఖ్యమంత్రి ఎన్​.బిరెన్​ సింగ్​
Tika Utsav
కేరళ తిరవనంతపురంలోని ఓ వ్యాక్సినేషన్​ కేంద్రం వద్ద లబ్ధిదారులు
Tika Utsav
కేరళ తిరువనంతపురంలో టీకా ఉత్సవ్​ కార్యక్రమం
Tika Utsav
ఝార్ఖండ్​ రాంచీలోని అశోక్​ నగర్​లోని కేంద్రం వద్ద టీకా పంపిణీ కోసం క్యూలో నిల్చున్న లబ్ధిదారులు

కరోనా టీకా తీసుకోవడంలో ఇతరులకు సాయం అందించాలని ప్రజలను కోరారు ప్రధాని మోదీ. కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న రెండో పెద్ద యుద్ధమే ఈ కార్యక్రమం అని అభివర్ణించారు.

Tika Utsav
సైకత శిల్పంతో టీకా ఉత్సవ్​పై అవగాహన

అర్హులైన వారందరికీ టీకా అందించడమే లక్ష్యంగా.. ఇవాళ్టి నుంచి నాలుగురోజులపాటు(ఏప్రిల్​ 11 నుంచి 14 వరకు) టీకా ఉత్సవ్​ కార్యక్రమం కొనసాగనుంది.

ఇదీ చూడండి:'పరిస్థితి తీవ్రం.. ఇళ్లలోంచి బయటకు రావొద్దు'

Last Updated : Apr 11, 2021, 2:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.