ETV Bharat / bharat

TDP Leaders Responded to TDP Party Funds: చంద్రబాబు బయటకు రాకుండా అడ్డుకునేందుకే.. వైసీపీ ప్రభుత్వ కొత్త ఎత్తులు..

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 7, 2023, 9:02 AM IST

TDP_Leaders_Responded_to_TDP_Party_Funds
TDP_Leaders_Responded_to_TDP_Party_Funds

TDP Leaders Responded to TDP Party Funds: తెలుగుదేశం పార్టీ విరాళాలపై అధికార పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలపై.. టీడీపీ నేతలు స్పందించారు. చంద్రబాబును జైలు నుంచి బయటకు రాకుండా అడ్డుకునేందుకే ప్రభుత్వం మరో అంశాన్ని తెరమీదకి తీసుకువస్తోందని మండిపడ్డారు.

TDP Leaders Responded to TDP Party Funds: చంద్రబాబు బయటకు రాకుండా అడ్డుకునేందుకే.. వైసీపీ ప్రభుత్వ కొత్త ఎత్తులు..

TDP Leaders Responded to TDP Party Funds: చంద్రబాబు బెయిల్ అడ్డుకునేందుకు ప్రభుత్వం కొత్త ఎత్తులు వేయడంపై తెలుగుదేశం పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. దేశంలోనే అత్యంత ధనిక ప్రాంతీయ పార్టీ వైసీపీ, ధనిక ముఖ్యమంత్రిగా పేరుగాంచిన జగన్.. తెలుగుదేశం పార్టీ విరాళాలపై ఆరోపణలు చేయడం తగదని టీడీపీ నేతలు అన్నారు. క్విడ్‌ప్రోకో రాష్ట్రానికి పరిచయం చేసిందే జగనన్న తెలుగుదేశం నేతలు.. వైసీపీకీ మేఘా, జిందాల్‌, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సంస్థల నుంచి కోట్లాది రూపాయల ఎలా వచ్చాయో తెలపాలన్నారు.

చంద్రబాబు బెయిల్‌పై బయటకు రాకుండా చేయాలన్న కుట్రతో సీఐడీ రోజుకొక అంశాన్ని తెరపైకి తెస్తోందని తెలుగుదేశం పార్టీ మండిపడింది. న్యాయస్థానానాలే తప్పుదోవ పట్టించేలా స్కిల్‌ ప్రాజెక్ట్ నిధులు తెలుగుదేశం పార్టీకి మళ్లీంచారంటూ తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీకి సభ్యత్వాల ద్వారా వచ్చిన సొమ్ము, విరాళాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల ద్వారా వచ్చే ఆదాయ వివరాలు ఎప్పటికప్పుడు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు, ఆదాయపన్ను శాఖలకు తెలియజేస్తున్నామన్నారు.

Clarification on Telugu Desam Party Funds: తమ పార్టీకి నిధులు ఎలా వచ్చాయో తెలిపిన టీడీపీ నేతలు.. వైసీపీకి సూటి ప్రశ్న

దేశంలోనే అత్యంత భారీగా విరాళాలు పొందుతున్న ప్రాంతీయ పార్టీల్లో వైసీపీ అగ్రస్థానంలో ఉందని, జాతీయ పార్టీలతో పోల్చితే ఐదో స్థానంలో ఉందని వారు ఆరోపించారు. ఆ పార్టీకి అంతంత నిధులు ఎలా వచ్చాయో సీఎం జగన్ చెప్పాలంటూ వారు నిలదీశారు. వివిధ సంస్థలకు కాంట్రాక్ట్‌లు, ప్రాజెక్ట్‌లు అప్పగించి ప్రతిఫలంగా వైసీపీ పార్టీకి విరాళాలు ఇప్పించుకున్నారని తెలుగుదేశం నేతలు ఆరోపించారు.

విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ 2018-19 సంవత్సరంలో 11 కోట్ల ఎలక్టోరల్‌ బాండ్లను వైసీపీకి విరాళంగా అందించారని దానికి ప్రతిఫలంగానే విశాఖను లూటీ చేయమని ఆయనకు రాసిచ్చారా అంటూ ధ్వజమెత్తారు. అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లిలో హెటెరో సంస్థకు సంబంధించిన భూ వివాదాన్ని పరిష్కరించినందుకు 10 కోట్లు తీసుకున్నారా అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే శంకర్రావు కోటీ 35 లక్షల విరాళంగా ఇచ్చారనే ఇసుక దందాకు అనుమతించారా అని నిలదీశారు.

Lokesh Comments: చంద్రబాబు ఏనాడు తప్పు చేయరు.. న్యాయం ఆలస్యం కావచ్చేమో కానీ మావైపే ఉంటుంది: లోకేశ్​

"నువ్వు పొలవరం ప్రాజెక్టును.. ఆ మెగా ఇంజనీరింగ్​కు కేటాయించడం ద్వారా తిరిగి 22 కోట్ల రూపాయలు అందుకున్నావా. దీనికి వైసీపీ, జగన్​మోహన్​ రెడ్డి సమాధానం చెప్పాలి. స్టీల్​ ఫ్యాక్టరీని జిందాల్​ కంపేనికి కట్టబెట్డడం ద్వారా.. 13 కోట్ల రూపాయలు అందుకున్నావు." -నిమ్మల రామానాయుడు, టీడీపీ సీనియర్ నేత

2016-17లో తెలుగుదేశానికి పార్టీ సభ్యత్వ రుసుము, విరాళాలు, ఇతర మార్గాల్లో వచ్చిన మొత్తం ఆదాయం 72.92 కోట్లు కాగా..అందులో సభ్యత్వ రుసుము ద్వారా వచ్చిందే 60.75 కోట్లని పట్టాభి తెలిపారు. వివిధ రకాల వ్యక్తులు, సంస్థల నుంచి డొనేషన్ల రూపంలో వచ్చింది 6.85 కోట్లు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ, అద్దెలు, ఇతరత్రా వచ్చిన ఆదాయం మరో 5.31 కోట్లు ఉందన్నారు. మా పార్టీకి వచ్చిన ఆదాయం వివరాలు ఇంత స్పష్టంగా ఉంటే.. షెల్‌ కంపెనీల ద్వారా 27 కోట్లు వచ్చాయంటూ ఈ ప్రభుత్వం న్యాయస్థానాల్లో దుర్మార్గంగా ఆరోపిస్తోందని తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Facts on Skill Development: 'ఆరోపణలు నిరూపించలేక.. విరాళాలతో ముడిపెడతారా..' స్కిల్ కేసు వాస్తవాలతో టీడీపీ పుస్తకం

"2016-2017 తెలుగుదేశం పార్టీ ఫైనాన్షియల్​ స్టేట్​మెంట్​లో.. కంపేనేల నుంచి డోనేషన్ష్​ ప్రత్యేకంగా 27 లక్షలు. 27 కోట్లని వైసీపీ పార్టీ నాయకులు సృష్టిస్తున్నారు. చంద్రాబాబు ఖాతాల్లోకి డబ్బు వెళ్లిపోయిందని.. ఇన్ని రోజులు కథలు చెప్పుతూ వచ్చారు. అది రుజువు చేయాలేకపోయే సరికి.. వాళ్ల దగ్గర ఏమి ఆధారాలు లేకపోయేసరికి.. న్యాయస్థానం ఎక్కడ చంద్రబాబుకు బెయిల్​ మంజూరు చేస్తుందోనని కుట్ర పన్నారు." -పట్టాభి, టీడీపీ అధికార ప్రతినిధి

తెలుగుదేశం పార్టీ ఆధాయ వివరాలు ఇంత పక్కాగా ఉంటే.. ప్రభుత్వ న్యాయవాది కోర్టులో అబద్ధాలు చెబుతున్నారని తెలుగుదేశం నేతలు మండిపడ్డారు.

Balakrishna Interesting Comments: 'తెలంగాణలో టీడీపీ లేదన్న వారికి మేమేంటో చూపిస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.