ETV Bharat / bharat

LIVE UPDATES: నారా లోకేష్‌తో సమావేశమైన సిద్ధార్థ లూథ్రా

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 13, 2023, 11:25 AM IST

Updated : Sep 13, 2023, 6:17 PM IST

TDP_Leaders_Protest_on_Chandrababu_Arrest
TDP_Leaders_Protest_on_Chandrababu_Arrest

18:16 September 13

జగన్‌ పాలన.. కిమ్ పరిపాలనను తలపిస్తోంది: పీతల సుజాత

  • జగన్‌ పాలన.. కిమ్ పరిపాలనను తలపిస్తోంది: పీతల సుజాత
  • చంద్రబాబుపై కేసులు పెట్టి మంత్రులు పైశాచిక ఆనందం పొందుతున్నారు: సుజాత
  • వైకాపా ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైంది: పీతల సుజాత

17:20 September 13

నారా లోకేష్‌తో సమావేశమైన సిద్ధార్థ లూథ్రా

  • రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబును కలిసిన సిద్ధార్థ లూథ్రా
  • ములాఖత్ అనంతరం నారా లోకేష్‌తో సమావేశమైన సిద్ధార్థ లూథ్రా
  • చంద్రబాబుతో సమావేశమైన వివరాలతో పాటు లీగల్ పరంగా తీసుకోవాల్సిన అంశాలపై చర్చ
  • చంద్రబాబు కుటుంబ సభ్యులతో పాటు పార్టీ ముఖ్య నేతలతో సిద్ధార్థ లూథ్రా చర్చలు

17:07 September 13

జగన్ ఒక్క రూపాయి అయినా చంద్రబాబు కు వచ్చినట్లు చూపగలడా ?: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

  • సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు
  • రాష్ట్రంలో ని 40 స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల్లో చేసిన ఖర్చు చూపేందుకు మేం సిద్ధం
  • అఖిలపక్షం తో కలిసి వైకాపా నేతలు వస్తే, 40కేంద్రాలు చూపిస్తాం, 2.13 లక్షల మంది శిక్షణ ఇచ్చిన వివరాలతో పాటు ఉద్యోగాలు పొందిన 74వేల మంది వివరాలు ఇస్తాం
  • నిజమో కాదో తేల్చుకుందాం రండి
  • 40 కేంద్రాల ఏర్పాటు ఖర్చు నిజమైతే చంద్రబాబు కు నడిరోడ్డు మీద క్షమాపణ చెప్పండి
  • 371కోట్ల చంద్రబాబు తినేస్తే... కేంద్రాల ఏర్పాటు ఖర్చు మంత్రుల తాతల సొత్తు తెచ్చి పెట్టారా ?
  • డిజైన్ టెక్ ఎండీ వికాస్ కన్వెల్కర్ రూ.371 కోట్లు ఎక్కడ ఖర్చు చేశామో ఆధారాలు బయట పెట్టారు
  • ఇక అవినీతి కి ఆస్కారం ఎక్కడిది
  • దీనిపై విచారించుకోమని కూడా వికాస్ సవాల్ చేశారు
  • రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉంటే జగన్ కంపెనీల్లోకి వేల కోట్ల నిధులు పారాయన్న సాక్ష్యం ఉంది
  • జగన్ ఒక్క రూపాయి అయినా చంద్రబాబు కు వచ్చినట్లు చూపగలడా ?

16:48 September 13

టీడీపీ కేంద్ర కార్యాలయంలో బాబుతో నేను పేరిట ప్లెక్సీ ఏర్పాటు.

  • టీడీపీ కేంద్ర కార్యాలయంలో బాబుతో నేను పేరిట ప్లెక్సీ ఏర్పాటు.
  • ఫ్లెక్సీ పై సంతకాలు చేసిన అచ్చెన్నాయుడు, యనమల, పయ్యావుల, నక్కా,ధూళిపాళ్ల, పంచుమర్తి తదితరులు.

16:32 September 13

ఆధారాలు లేకుండా చంద్రబాబును ఎలా అరెస్టు చేస్తారు‌?: మాజీమంత్రి బండారు

  • విశాఖ: ఆధారాలు లేకుండా చంద్రబాబును ఎలా అరెస్టు చేస్తారు‌?: బండారు
  • అవినీతి జరిగితే అధికారులను అరెస్టు చేయరా?: మాజీమంత్రి బండారు
  • ప్రభుత్వాధికారి అయి వుండి అదనపు అడ్వకేట్ జనరల్ టీవి చర్చలోకి ఎలా వస్తారు.
  • విప్రో సిబ్బంది ముందుకు వచ్చి చంద్రబాబుకు మద్దతుగా వచ్చారు.
  • పార్టీలకు అతీతంగా చంద్రబాబు అరెస్ట్ ను ఖండించారు.
  • మాలో నిజాయితీ వుంది..మీ దగ్గర ఆధారాలు లేవు.
  • సీమెన్స్ సంస్ధ నుంచి కేసు పెట్టించగలరా.విజయసాయి రెడ్డి నీతికబుర్లు ఆడుతున్నారు..
  • విశాఖలో నీవు దోచుకున్న భూములు, కుంభకోణాలు ఎవరికి తెలియవు..

16:16 September 13

రాజమహేంద్రవరం జైలులో చంద్రబాబును కలిసిన సిద్ధార్థ లూథ్రా

రాజమహేంద్రవరం జైలులో చంద్రబాబును కలిసిన సిద్ధార్థ లూథ్రా

కోర్టులో జరిగిన పరిణామాలను చంద్రబాబుకు వివరించిన లూథ్రా

15:26 September 13

చంద్రబాబుపై అక్రమ కేసులకు నిరసనగా... హైదరాబాద్‌ విప్రో సర్కిల్‌ వద్ద ఐటీ ఉద్యోగుల ఆందోళన

  • చంద్రబాబుపై అక్రమ కేసులకు నిరసనగా ఐటీ ఉద్యోగుల ఆందోళన
  • హైదరాబాద్‌ విప్రో సర్కిల్‌ వద్ద భారీగా ఐటీ ఉద్యోగుల ఆందోళన
  • 'అయామ్‌ విత్‌ సీబీఎన్‌' ప్లకార్డులతో ఐటీ ఉద్యోగుల నిరసన
  • 'సైకో పోవాలి-సైకిల్‌ రావాలి' అంటూ ఐటీ ఉద్యోగుల నినాదాలు
  • భావోద్వేగంతో కన్నీటి పర్యంతమైన ఐటీ మహిళా ఉద్యోగులు

15:13 September 13

రాజమహేంద్రరం జైలుకు రానున్న చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా

  • రాజమహేంద్రరం జైలుకు రానున్న చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా
  • మరో గంటలో సెంట్రల్ జైలు వద్దకు వచ్చే అవకాశం
  • ములాకాత్ ద్వారా చంద్రాబబును కలవనున్న సిద్ధార్థ లూథ్రా

15:11 September 13

రేపు చంద్రబాబును కలవనున్న పవన్‌ కల్యాణ్‌

  • రేపు చంద్రబాబును కలవనున్న పవన్‌ కల్యాణ్‌
  • రేపు రాజమహేంద్రవరం జైలులో చంద్రబాబును కలవనున్న పవన్‌

15:06 September 13

నారా లోకేష్‌కు ఫోన్ చేసి ధైర్యం చెప్పిన సూపర్‌స్టార్ రజనీకాంత్

  • నారా లోకేష్‌కు ఫోన్ చేసి ధైర్యం చెప్పిన సూపర్‌స్టార్ రజనీకాంత్
  • నా మిత్రుడు చంద్రబాబు గొప్ప పోరాట యోధుడు: సూపర్‌స్టార్ రజనీకాంత్‌
  • చేసిన అభివృద్ధి, సంక్షేమమే చంద్రబాబుకు రక్ష: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌
  • చంద్రబాబు ప్రజాసంక్షేమం కోసం నిరంతరం పరితపించే వ్యక్తి: రజనీకాంత్‌
  • తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు చంద్రబాబును ఏమీ చేయలేవు: రజనీకాంత్‌
  • నా ఆత్మీయ మిత్రుడు చంద్రబాబు ఎప్పుడూ తప్పు చేయరు: రజనీకాంత్‌
  • చేసిన మంచి పనులు, నిస్వార్థమైన ప్రజా సేవ, ఆయనను క్షేమంగా బయటకు తీసుకొస్తాయని పేర్కొన్నారు.

15:01 September 13

వేమూరులో రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న మాజీ మంత్రి నక్కా ఆనందబాబు

  • బాపట్ల: వేమూరులో రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
  • చంద్రబాబుపై రాజకీయ కక్ష సాధింపులు పరాకాష్టకి చేరాయి: నక్కా ఆనందబాబు
  • పైశాచిక ఆనందం కోసం చంద్రబాబును వేధిస్తున్నారు: నక్కా ఆనందబాబు
  • రాబోయే రోజుల్లో వైకాపా నాయకులు మూల్యం చెల్లించుకోక తప్పదు: నక్కా

14:18 September 13

నేటి సూక్తి అంటూ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ట్వీట్

  • నేటి సూక్తి అంటూ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ట్వీట్
  • గురుగోవింద్ సింగ్ సూక్తులు ప్రస్తావిస్తూ సిద్ధార్థ లూథ్రా ట్వీట్
  • అన్ని ప్రయత్నాలు చేసినా.. న్యాయం కనుచూపుమేర లేకుంటే ఇక కత్తి పట్టడమే: లూథ్రా
  • పోరాటానికి ఇదే సరైన విధానమంటూ సిద్ధార్థ లూథ్రా ట్వీట్‌

13:49 September 13

స్కిల్ డెవలప్‌మెంట్‌ వంటి మంచి కార్యక్రమానికి అవినీతిని ఆపాదించడం దుర్మార్గం: కన్నా లక్ష్మీనారాయణ

  • సత్తెనపల్లిలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ
  • తప్పుడు పత్రాలు, అసత్య ఆరోపణలతో చంద్రబాబుపై కేసు బనాయించారు: కన్నా
  • స్కిల్ డెవలప్‌మెంట్‌ వంటి మంచి కార్యక్రమానికి అవినీతిని ఆపాదించడం దుర్మార్గం: కన్నా
  • జగన్‌ అవినీతి రాజకీయాలపై ప్రజా ఉద్యమం, వీధి పోరాటాలు చేస్తాం: కన్నా
  • ప్రజలను చైతన్యవంతులను చేసి అరాచక ప్రభుత్వాన్ని సాగనంపుతాం: కన్నా

13:27 September 13

ఎలాగైనా కేసు విచారణ ఆలస్యం చేయాలనుకుంటున్నారు: రఘురామకృష్ణరాజు

  • ఎలాగైనా కేసు విచారణ ఆలస్యం చేయాలనుకుంటున్నారు: రఘురామకృష్ణరాజు
  • సరైన ఆధారాలు లేకపోవడం వల్లే విచారణ ఆలస్యం కావాలనుకుంటున్నారు: రఘురామకృష్ణరాజు
  • ఆరోపణల్లో పస లేనందునే కావాలనే ఆలస్యానికి ప్రయత్నిస్తున్నారు: రఘురామకృష్ణరాజు
  • మా పార్టీకి భవిష్యత్తు లేకుండా సర్వనాశనం చేశారు: రఘురామకృష్ణరాజు
  • సభ్యత్వం ఉంది కాబట్టి నేను కూడా బాధపడుతున్నా: రఘురామకృష్ణరాజు
  • సీఎంగా చేసుకున్నందుకు చాలా బాధపడుతున్నామని మా పార్టీ వాళ్లే చెబుతున్నారు: రఘురామకృష్ణరాజు
  • చంద్రబాబును అభిమానించే వ్యక్తులు సంయమనం పాటించాలని కోరుతున్నా: రఘురామకృష్ణరాజు
  • ఎన్ని పీటీ వారెంట్లు వేసినా వారం, ఇంకో పదిరోజులు ఉంచగలరేమో?: రఘురామకృష్ణరాజు
  • జైలులో చంద్రబాబుకు ఎలాంటి ఆపద రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది: రఘురామకృష్ణరాజు

13:14 September 13

ఏపీ పరిణామాలు దిల్లీ పెద్దలకు కనబడట్లేదా?: అయ్యన్నపాత్రుడు

  • ఏపీ పరిణామాలు దిల్లీ పెద్దలకు కనబడట్లేదా?: అయ్యన్నపాత్రుడు
  • చంద్రబాబు అరెస్టులో దిల్లీ పెద్దల పాత్ర ఉన్నందుకే మాట్లాడట్లేదా?: అయ్యన్న
  • కేంద్ర పెద్దల మౌనం దేనికి సంకేతం?: అయ్యన్నపాత్రుడు
  • కేంద్రం ఇచ్చే నిధులు తినేస్తున్న జగన్ చర్యలు మీకు కనిపించట్లేదా?: అయ్యన్న
  • రాష్ట్రంలో వ్యవస్థలన్నీ దిగజారి పనిచేస్తున్నాయి: అయ్యన్నపాత్రుడు
  • 40ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంత దౌర్భాగ్యం ఎప్పుడూ చూడలేదు: అయ్యన్న

13:11 September 13

తెదేపా నేతల గృహనిర్బంధం పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

  • తెదేపా నేతల గృహనిర్బంధం పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
  • ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుందన్న పిటిషనర్
  • గృహనిర్బంధం చట్టవ్యతిరేకమైన చర్యని తెలిపిన న్యాయవాది బాలాజీ
  • సుప్రీంకోర్టు నిబంధనలు ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని న్యాయవాది బాలాజీ వాదనలు
  • అధికార పార్టీ కార్యక్రమాలకు అనుమతులిస్తూ.. ప్రతిపక్షాలకు నిరాకరిస్తోందని వాదనలు
  • కౌంటర్ ధాఖలుకు రెండు వారాలు సమయం కోరిన ప్రభుత్వం
  • సీఎస్‌, డీజీపీ, హోంశాఖ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ
  • తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా
  • పిటిషన్ దాఖలు చేసిన వినుకొండ తెదేపా మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు

13:02 September 13

ఉమ్మడి కర్నూలు జిల్లాలో తెదేపా రిలే నిరాహార దీక్షలు

  • ఉమ్మడి కర్నూలు జిల్లాలో తెదేపా రిలే నిరాహార దీక్షలు
  • కర్నూలు నిరాహారదీక్షలో పాల్గొన్న కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, బీటీ నాయుడు
  • ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం నిరాహార దీక్షలో పాల్గొన్న గౌరు చరిత
  • ఎమ్మిగనూరు నిరాహార దీక్షలో పాల్గొన్న బీవీ జయనాగేశ్వర్‌రెడ్డి
  • ఆళ్లగడ్డలో రిలే నిరాహార దీక్షలో కూర్చున్న భూమా అఖిలప్రియ
  • ఆత్మకూరులో నిరాహారదీక్షల్లో కూర్చున్న బుడ్డా రాజశేఖర్‌రెడ్డి

12:59 September 13

సత్తెనపల్లిలో రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ

  • సత్తెనపల్లిలో రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ

12:53 September 13

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రబాబుకు మద్దతుగా నిరాహార దీక్షలు

  • ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రబాబుకు మద్దతుగా నిరాహార దీక్షలు
  • తిరుపతిలో నిరాహారదీక్షలో పాల్గొన్న సుగుణమ్మ, నరసింహ యాదవ్
  • చంద్రగిరిలో రిలే నిరాహారదీక్షలో పాల్గొన్న పులివర్తి నాని
  • కుప్పంలో రిలే నిరాహారదీక్షలో పాల్గొన్న గౌనిగారి శ్రీనివాసులు

12:50 September 13

పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో తెదేపా రిలే నిరాహార దీక్షలు

  • పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో తెదేపా రిలే నిరాహార దీక్షలు
  • తెదేపా కార్యాలయంలో దీక్షలు ప్రారంభించిన మాజీమంత్రి ప్రత్తిపాటి
  • చంద్రబాబు అరెస్టు తర్వాత వైకాపా నేతలు వణికిపోతున్నారు: ప్రత్తిపాటి
  • తాడేపల్లి నుంచి తరిమికొట్టే రోజు ఎంతోదూరంలో లేదని అర్థమైంది: ప్రత్తిపాటి
  • కొంతమంది మాజీ, ప్రస్తుత అధికారులతో కలిసి కట్టుకథ అల్లారు: ప్రత్తిపాటి
  • చంద్రబాబుపై ఆరోపణలను ప్రజలు ఇసుమంతైనా నమ్మట్లేదు: ప్రత్తిపాటి

12:44 September 13

ప్రశ్నించిన వారందరినీ అరెస్టు చేసుకుంటూ వెళ్తారా?: పయ్యావుల

  • ప్రశ్నించిన వారందరినీ అరెస్టు చేసుకుంటూ వెళ్తారా?: పయ్యావుల
  • ఇలానే చేసుకుంటూ పోతే రెండు సీట్లకే పరిమితమవుతారు: పయ్యావుల
  • ప్రాథమిక ఆధారాలు లేకుండా కేసు నమోదు చేసి అరెస్టు చేస్తారా?: పయ్యావుల
  • వైకాపా ప్రభుత్వం వచ్చాక 2021లోనే సీమెన్స్‌ అద్భుత పనితీరు ప్రదర్శించిందని సర్టిఫికెట్‌ ఇచ్చారు కదా?: పయ్యావుల
  • ఒప్పందం ప్రకారం సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ అన్ని అందాయని ఒకవైపు చెబుతున్నారు కదా?: పయ్యావుల
  • నిధులు పక్కదారి పట్టాయంటున్నారు... ఇంతవరకు నిరూపించలేకపోయారు: పయ్యావుల
  • కేవలం అవినీతి మరకను చంద్రబాబుకు అంటించాలనేదే జగన్‌ కుట్ర: పయ్యావుల
  • అక్రమ కేసులకు తెదేపా భయపడదు?: పయ్యావుల కేశవ్‌
  • రేపు రాజకీయ రణక్షేత్రంలో తెదేపా పదింతల శక్తితో ఎదుర్కొంటుంది: పయ్యావుల
  • ప్రభుత్వం, సీమెన్స్‌, డిజైన్‌టెక్‌ ఒప్పందం చేసుకున్నాయి: పయ్యావుల
  • సీమెన్స్‌ కూడా ఎలాంటి ఫిర్యాదు చేయలేదే?: పయ్యావుల
  • సీమెన్స్‌ సంస్థను ప్రతివాదిగా ఎందుకు చేర్చలేదు: పయ్యావుల
  • ఒక్క రూపాయి అయినా పక్కదారి పట్టిందని నిరూపించగలరా?: పయ్యావుల
  • నాలుగేళ్లలో ఏ ఒక్కరోజైనా నోటీసు ఇవ్వలేదు: పయ్యావుల కేశవ్‌
  • ప్రజా వ్యతిరేకతను దృష్టి మళ్లించేందుకే జగన్‌ ప్రయత్నాలు: పయ్యావుల
  • కోర్టులో సమాధానం చెప్పలేకపోతున్నారు: పయ్యావుల కేశవ్‌
  • ఒప్పందం చేసుకున్న సీమెన్స్‌ను కోర్టు పరిధిలోకి ఎందుకు తీసుకురావట్లేదు: పయ్యావుల
  • ఆరోపణ చేసి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారు: పయ్యావుల
  • ఓటమి భయంతోనే తెదేపాపై దుష్ప్రచారం మొదలుపెట్టారు: పయ్యావుల
  • నిజాలు వెలుగులోకి వస్తాయనే సీమెన్స్‌ను పక్కన పెడుతున్నారు: పయ్యావుల

12:07 September 13

పరిటాల సునీత రిలే నిరాహార దీక్షలకు సీపీఐ, జనసేన సంఘీభావం

  • అనంతపురం: పరిటాల సునీత రిలే నిరాహార దీక్షలకు సీపీఐ, జనసేన సంఘీభావం
  • అనంతపురం గ్రామీణం బళ్లారి రోడ్‌లో మాజీ మంత్రి పరిటాల సునీత దీక్ష
  • అనంతపురం: దీక్షలో పాల్గొన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్

12:06 September 13

పుట్టపర్తి ఆర్డీవో కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్ష

  • శ్రీసత్యసాయి జిల్లా: పుట్టపర్తి ఆర్డీవో కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్ష
  • రిలే దీక్ష చేపట్టిన మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, తెదేపా నాయకులు

12:03 September 13

ప్రభుత్వం వారం రోజులు సమయం కోరడం సాగదీత ధోరణే: కనకమేడల

  • ప్రభుత్వం వారం రోజులు సమయం కోరడం సాగదీత ధోరణే: కనకమేడల
  • కోర్టులో విచారణ ఎదుర్కోలేక డొంకతిరుగుడుగా వ్యవహరిస్తున్నారు: కనకమేడల
  • ఎన్నికలు ఎదుర్కోలేక చేసే పిరికిపంద చర్యలివి: కనకమేడల రవీంద్రకుమార్
  • న్యాయప్రక్రియను కూడా అడ్డుకోవాలని జగన్‌ చూస్తున్నారు: కనకమేడల
  • చేసిన తప్పులు నుంచి జగన్‌ తప్పించుకోలేరు: కనకమేడల రవీంద్రకుమార్
  • ప్రజాస్వామ్యాన్ని ఈ ప్రభుత్వం అపహాస్యం చేస్తోంది: కనకమేడల
  • కక్షసాధింపు కోసం ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారు: కనకమేడల
  • దేశ రాజకీయాల్లో ఈ తరహా వ్యక్తిగత కక్షసాధింపు చర్యలు ఇప్పటివరకూ లేవు: కనకమేడల

11:39 September 13

చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ఈనెల 19కి వాయిదా

  • చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ఈనెల 19కి వాయిదా
  • ఈనెల 18 లోపు కౌంటర్‌ వేయాలని సీఐడీని ఆదేశించిన హైకోర్టు
  • చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలుకు సమయం కావాలని కోరిన సీఐడీ
  • కౌంటర్‌ దాఖలుకు సమయమిచ్చిన హైకోర్టు, విచారణ ఈనెల 19కి వాయిదా

11:39 September 13

ఏసీబీ కోర్టులో సీఐడీ వేసిన కస్టడీ పిటిషన్‌ను ఈనెల 18 వరకు విచారించవద్దన్న హైకోర్టు

  • ఏసీబీ కోర్టులో సీఐడీ వేసిన కస్టడీ పిటిషన్‌ను ఈనెల 18 వరకు విచారించవద్దన్న హైకోర్టు

11:37 September 13

రాజధాని ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసు పిటిషన్‌పై విచారణ ఈనెల 19కి వాయిదా

  • రాజధాని ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసు పిటిషన్‌పై విచారణ ఈనెల 19కి వాయిదా
  • చంద్రబాబు తరఫున హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ వాయిదా
  • సీఐడీ నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ పిటిషన్‌

11:24 September 13

మంగళగిరిలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద రిలే నిరాహారదీక్షలు

  • మంగళగిరిలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద రిలే నిరాహారదీక్షలు
  • 'బాబుతో నేను' పేరుతో టీడీపీ నాయకుల రిలే నిరాహారదీక్షలు
  • రిలే నిరాహారదీక్షకు సంఘీభావం తెలిపిన ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ
  • మంగళగిరి: నల్ల జెండాలు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు

11:24 September 13

రంగారెడ్డి: చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా హయత్‌నగర్‌లో ఆందోళన

  • రంగారెడ్డి: చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా హయత్‌నగర్‌లో ఆందోళన
  • ఎల్బీనగర్‌ టీడీపీ ఇన్‌ఛార్జి కృష్ణ ప్రసాద్‌ ఆధ్వర్యంలో ఆందోళన
  • హయత్‌నగర్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద బైఠాయించి ధర్నా

11:23 September 13

గుంటూరు: తాడికొండలో మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌ దీక్ష

  • గుంటూరు: తాడికొండలో మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌ దీక్ష
  • చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ టీడీపీ నాయకుల రిలే నిరాహార దీక్ష
  • గుంటూరు: తాడికొండ అడ్డరోడ్డు వద్ద దీక్షలో పాల్గొన్న టీడీపీ కార్యకర్తలు

11:23 September 13

చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ప్రారంభం

  • చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ప్రారంభం
  • స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌
  • తనపై నమోదైన కేసు, రిమాండ్‌ ఉత్తర్వులు కొట్టివేయాలని పిటిషన్‌
  • ప్రాథమిక ఆధారాలు లేకున్నా కేసులో ఇరికించారని పిటిషన్‌లో పేర్కొన్న చంద్రబాబు
  • పీసీ యాక్టు 17ఏ నిబంధన పాటించలేదని, అరెస్టు చెల్లదని పిటిషన్‌
  • చట్టవిరుద్ధంగా చేసిన అరెస్టు చెల్లదని.. ఎఫ్‌ఐఆర్‌ కొట్టివేయాలని కోరిన చంద్రబాబు
  • ఏసీబీ కోర్టు విధించిన జ్యుడీషియల్‌ రిమాండ్‌ ఉత్తర్వులు కొట్టివేయాలని పిటిషన్‌
  • ఈ వ్యాజ్యం పరిష్కారమయ్యే వరకు విచారణ నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని పిటిషన్‌
  • తనపై ఏసీబీ కోర్టులో విచారణ నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని కోరిన చంద్రబాబు

11:22 September 13

నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్‌లో టీడీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు

  • నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్‌లో టీడీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు
  • దీక్షలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి

11:22 September 13

విజయనగరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద టీడీపీ నాయకుల రిలే నిరాహారదీక్ష

  • విజయనగరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద టీడీపీ నాయకుల రిలే నిరాహారదీక్ష
  • విజయనగరం: రిలే నిరాహారదీక్షలు భగ్నం చేసేందుకు యత్నిస్తున్న పోలీసులు
  • శిబిరం నుంచి కదిలేది లేదంటూ నేలపై పడుకున్న టీడీపీ నాయకులు
  • విజయనగరం: పోలీసులు, టీడీపీ నాయకులకు మధ్య వాగ్వాదం
  • విజయనగరం: ఆర్టీసీ బస్టాండ్ వద్ద దీక్షా శిబిరాన్ని ఖాళీ చేయించిన పోలీసులు
  • సమీపంలోని మోసానిక్ టెంపుల్ ప్రధాన ద్వారం వద్ద దీక్ష చేస్తున్న టీడీపీ నాయకులు

11:21 September 13

నెల్లూరు: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి రిలే నిరాహార దీక్ష

  • నెల్లూరు: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి రిలే నిరాహార దీక్ష
  • కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కార్యాలయానికి భారీగా చేరుకున్న తెదేపా కార్యకర్తలు
  • కోటంరెడ్డిని ఇటీవల వరుసగా 3 రోజులు గృహనిర్బంధం చేసిన పోలీసులు

11:21 September 13

శ్రీసత్యసాయి జిల్లా: కదిరి మున్సిపల్ కార్యాలయం ఎదుట టీడీపీ రిలే దీక్షలు

  • శ్రీసత్యసాయి జిల్లా: కదిరి మున్సిపల్ కార్యాలయం ఎదుట టీడీపీ రిలే దీక్షలు
  • నల్లబ్యాడ్జీలతో కందికుంట వెంకట ప్రసాద్ రిలే దీక్ష, పాల్గొన్న టీడీపీ కార్యకర్తలు

11:20 September 13

విశాఖ జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద నిరసన దీక్షకు టీడీపీ పిలుపు

  • విశాఖ జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద నిరసన దీక్షకు టీడీపీ పిలుపు
  • విశాఖ: పల్లా శ్రీనివాసరావు సహా పలువురు టీడీపీ నేతల గృహనిర్బంధం
  • ముందస్తుగా పలువురు తెదేపా నేతలను గృహనిర్బంధం చేసిన పోలీసులు
  • విశాఖ: మొగిలిపురంలో గండి బాబ్జిని గృహనిర్బంధం చేసిన పోలీసులు
  • విశాఖ: ముందస్తుగా మరికొందరిని పీఎస్‌కు తీసుకెళ్తున్న పోలీసులు
  • విశాఖ: వెలగపూడి రామకృష్ణబాబు నివాసం, కార్యాలయం వద్ద పోలీసు పహారా

11:20 September 13

గుంటూరు: చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ తెనాలిలో టీడీపీ దీక్షలు

  • గుంటూరు: చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ తెనాలిలో టీడీపీ దీక్షలు
  • మున్సిపల్‌ మార్కెట్‌ ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద దీక్షకు టీడీపీ కార్యకర్తల యత్నం
  • మార్కెట్‌ వద్ద రిలే నిరాహార దీక్షకు అనుమతి నిరాకరించిన పోలీసులు
  • ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఉదయం నుంచి భారీగా మోహరించిన పోలీసులు

11:19 September 13

ప్రొద్దుటూరు టీడీపీ నేత ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తిరుమలకు పాదయాత్ర

  • ప్రొద్దుటూరు టీడీపీ నేత ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తిరుమలకు పాదయాత్ర
  • చంద్రబాబు జైలు నుంచి విడుదల కావాలని ప్రార్థిస్తూ తిరుమలకు పాదయాత్ర
  • ప్రొద్దుటూరు వైఎంఆర్ కాలనీలోని తన నివాసం నుంచి ప్రారంభమైన పాదయాత్ర

11:19 September 13

చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ

  • చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ
  • స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌
  • తనపై నమోదైన కేసు, రిమాండ్‌ ఉత్తర్వులు కొట్టివేయాలని పిటిషన్‌
  • ప్రాథమిక ఆధారాలు లేకున్నా కేసులో ఇరికించారని పిటిషన్‌లో పేర్కొన్న చంద్రబాబు
  • పీసీ యాక్టు 17ఏ నిబంధన పాటించలేదని, అరెస్టు చెల్లదని పిటిషన్‌
  • చట్టవిరుద్ధంగా చేసిన అరెస్టు చెల్లదని.. ఎఫ్‌ఐఆర్‌ కొట్టివేయాలని కోరిన చంద్రబాబు
  • ఏసీబీ కోర్టు విధించిన జ్యుడీషియల్‌ రిమాండ్‌ ఉత్తర్వులు కొట్టివేయాలని పిటిషన్‌
  • ఈ వ్యాజ్యం పరిష్కారమయ్యే వరకు విచారణ నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని పిటిషన్‌
  • తనపై ఏసీబీ కోర్టులో విచారణ నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని కోరిన చంద్రబాబు

11:18 September 13

చంద్రబాబును కస్టడీకి కోరుతూ సీఐడీ వేసిన పిటిషన్‌పై ఇవాళ విచారణ

  • చంద్రబాబును కస్టడీకి కోరుతూ సీఐడీ వేసిన పిటిషన్‌పై ఇవాళ విచారణ
  • సీఐడీ వేసిన కస్టడీ పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టులో నేడు వాదనలు
  • ఐదు రోజుల పాటు తమ కస్టడీకి అనుమతించాలని సీఐడీ పిటిషన్‌

11:18 September 13

రాజధాని ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో దాఖలైన పిటిషన్‌పై నేడు విచారణ

  • రాజధాని ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో దాఖలైన పిటిషన్‌పై నేడు విచారణ
  • చంద్రబాబు తరఫున హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై ఇవాళ విచారణ
  • సీఐడీ నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ పిటిషన్‌
  • రాజధాని నగర బృహత్‌ ప్రణాళిక, ఇన్నర్‌ రింగ్‌రోడ్డు వ్యవహారంపై కేసు
  • ఇన్నర్‌ రింగ్‌రోడ్డు ఎలైన్‌మెంట్‌లో అవకతవకలు జరిగాయని ఫిర్యాదు
  • వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు

11:18 September 13

ఉమ్మడి కృష్ణా జిల్లాలో బంద్‌ సందర్భంగా టీడీపీ నేతలపై కేసులు నమోదు

  • ఉమ్మడి కృష్ణా జిల్లాలో బంద్‌ సందర్భంగా టీడీపీ నేతలపై కేసులు నమోదు
  • గవర్నర్‌పేట్‌ పీఎస్‌లో నెల్లిబండ్ల బాలస్వామి మరో 12 మందిపై కేసు నమోదు
  • సూర్యారావుపేట పీఎస్‌లో గొట్టుముక్కల రఘు, గద్దె అనురాధ మరో 10 మందిపై కేసు
  • నున్న పీఎస్‌లో పరుచూరి ప్రసాద్‌తో పాటు మొత్తం 27 మందిపై కేసు
  • మైలవరంలో బంద్ సందర్భంగా 12 మంది టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదు
  • ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సహా 18 మందిపై కృష్ణలంక పీఎస్‌లో కేసు
  • ఉయ్యూరులో బంద్ సందర్బంగా 13 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు

11:01 September 13

'బాబుతో నేను' పేరుతో నేటి నుంచి ప్రజా చైతన్య కార్యక్రమాలు

  • నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా తెదేపా ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు
  • 'బాబుతో నేను' పేరుతో నేటి నుంచి ప్రజా చైతన్య కార్యక్రమాలు
  • మండల, నియోజకవర్గ, రాష్ట్ర స్థాయిల్లో రిలే దీక్షలు చేయనున్న నేతలు
  • నిరాహారదీక్ష శిబిరాల్లో చంద్రబాబు అరెస్టుపై ప్రజాభిప్రాయ సేకరణ
  • స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో కుట్రలు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ
Last Updated : Sep 13, 2023, 6:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.