ETV Bharat / bharat

నీట్​ పాస్​ కాలేదని ఉరి వేసుకున్న విద్యార్థి.. బాధతో తండ్రి కూడా ఆత్మహత్య.. ముఖ్యమంత్రి కీలక నిర్ణయం

author img

By

Published : Aug 14, 2023, 3:55 PM IST

tamil-nadu-neet-issue-cm-stalin-comment-on-neet-19-year-old-aspirant-commits-suicide-failed-in-the-neet-exam-father-also
తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్​కే స్టాలిన్

Tamil Nadu Neet Issue : నీట్​ పరీక్ష పాస్ కాలేదని 19 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు మరణాన్ని తట్టుకోలేని అతడి తండ్రి కూడా మరుసటి రోజే బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తమిళనాడు ప్రజల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. దీంతో నీట్​ అభ్యర్థులను ఉద్దేశిస్తూ.. తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్​కే స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Tamil Nadu Neet Issue : రెండు సార్లు నీట్​ పరీక్ష రాసిన ఉత్తీర్ణత సాధించలేకపోయాయని తమిళనాడుకు చెందిన జగదీశ్వరన్(19) అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు మరణాన్ని తట్టుకోలేక అతడి తండ్రి.. సెల్వశేఖర్ కుడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. కొడుకు శనివారం ఆత్మహత్య చేసుకోగా.. తండ్రి ఆదివారం ప్రాణాలు తీసుకున్నాడు. రాజధాని చెన్నైలోని క్రోమ్‌పేటలో ఉన్న తమ ఇంట్లోనే వీరు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ రెండు మరణాలు తమిళనాడు ప్రజల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. నీట్​ పరీక్షను మరోసారి చర్చనీయాంశంగా మార్చాయి.

తండ్రీకొడుకుల మృతిపై విచారం వ్యక్తం చేసిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్​కే స్టాలిన్.. నీట్​లో పరీక్షలో ఉత్తీర్ణత కాకపోతే అభ్యర్థులెవ్వరూ ఆత్మహత్య చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో మంచి జీవితం ఉంటుందని.. ఆత్మవిశ్వాసంతో ఉండాలని విద్యార్థులకు సూచించారు. ధైర్యంగా జీవించి.. ఇతరులను కూడా బతకనివ్వండని వారిని కోరారు. మరికొద్ది నెలల్లో రాజకీయ మార్పులు జరిగితే.. నీట్‌ అడ్డంకులు తొలగిపోతాయని స్టాలిన్​ ఆశాభావం వ్యక్తం చేశారు.

తమిళనాడు రాష్ట్ర గవర్నర్​ ఆర్​ఎన్​ రవిని ఉద్దేశిస్తూ.. బిల్లుపై సంతకం చేయని వారందరూ అదృశ్యమవుతారన్నారు స్టాలిన్​. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన 'యాంటీ నీట్​ బిల్'ను.. ఆర్​ఎన్​ రవి వ్యతిరేకించడాన్ని స్టాలిన్​ గుర్తు చేశారు. నీట్​లో ఉత్తీర్ణత కాలేదని జగదీశ్వరన్ ఆత్మహత్య చేసుకోవడం, అతని తండ్రి కూడా బలవన్మరణానికి పాల్పడటంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి సానుభూతి ప్రకటించారు. జగదీశ్వరన్, అతని తండ్రి మృతి తనను కలచివేసిందని ఆయన పేర్కొన్నారు.

"జగదీశ్వరన్​ను.. అతడి తల్లిదండ్రులు డాక్టర్​గా చూడాలనుకున్నారు. కానీ జగదీశ్వరన్ ప్రాణాలు తీసుకున్నాడు. ఇది చాలా బాధకరమైన విషయం. అభ్యర్థులెవ్వరూ ఇలాంటి ఘటనలకు పాల్పడవద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీ ఎదుగుదలకు అడ్డంకిగా ఉన్న నీట్​ రద్దు అవుతుంది. ఆ దిశగా ప్రభుత్వం చొరవ తీసుకుంటోంది." అని స్టాలిన్​ వెల్లడించారు.

తమిళనాడు విద్యార్థులకు నీట్​ నుంచి మినహాయింపు ఇవ్వాలనే డిమాండ్​తో అసెంబ్లీ చేసిన మొదటి తీర్మానాన్ని.. గవర్నర్​ తిప్పి పంపారని స్టాలిన్​ గుర్తు చేశారు. అనంతరం రెండో సారి తీర్మానం చేసి రాష్ట్రపతి సమ్మతి కోసం పంపినట్లు ఆయన పేర్కొన్నారు. బిల్లును పక్కన పెట్టడమే గవర్నర్ ఆర్​ఎన్​ రవి అభిప్రాయంగా తెలుస్తోందన్నారు. నీట్​ పరీక్ష చాలా ఖర్చుతో కూడుకున్నదని.. దాన్ని ధనవంతులు మాత్రమే భరించగలరని స్టాలిన్ అభిప్రాయపడ్డారు. అంత డబ్బు ఖర్చుపెట్టి చదువుకోలేని వారు.. నీట్​ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోతున్నారని పేర్కొన్నారు. ఒకవేళ ఉత్తీర్ణత పొందిన డబ్బున్న వారే.. వైద్య కళాశాల చేరగలుగుతున్నారని వెల్లడించారు.

అందుకే ప్రభుత్వ పాఠశాలలో చదివిన పేద విద్యార్థుల కోసం.. వైద్య కళాశాలల్లో 7.5 శాతం రిజర్వేషన్​లను తమిళనాడు ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు స్టాలిన్​. కానీ గవర్నర్​ దాన్ని అర్థం చేసుకోకుండా తిరస్కరిస్తున్నారని మండిపడ్డారు. ​ కోచింగ్​ సెంటర్ల చేతిలో గవర్నర్ కీలుబొమ్మగా మారారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

  • Tamil Nadu CM MK Stalin says his government will boycott the 'At Home' reception hosted by Tamil Nadu Governor RN Ravi on Independence Day pic.twitter.com/N2i4v7AHuz

    — ANI (@ANI) August 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'ఎట్​ హోం కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నాం'.. స్టాలిన్
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తమిళనాడు గవర్నర్​ అధ్వర్యంలో జరిగే.. 'ఎట్​ హోం' కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేశారు. స్టాలిన్​ కూడా ఆ కార్యక్రమానికి తాము హాజరు కావట్లేదని తేల్చిచెప్పారు.

హిమాచల్​లో వరద బీభత్సం.. కొట్టుకుపోయిన ఇళ్లు.. ఒకే కుటుంబంలో ఏడుగురు మృతి

శివాలయంపై విరిగిపడిన కొండచరియలు.. శిథిలాల కింద 25 మంది భక్తులు!.. 9మృతదేహాలు లభ్యం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.