ETV Bharat / bharat

ఈ మొక్క పంచదార కంటే 30రెట్లు తీపి.. మధుమేహం ఉన్నా తినేయొచ్చు

author img

By

Published : Dec 25, 2021, 1:42 PM IST

Sweet basil
స్వీట్​ తులసి సాగు చేస్తున్న రైతు

Sweet basil uses: పంచదార.. నిత్య జీవితంలో ఒక భాగమైపోయింది. ఇంట్లో ఏ స్వీట్​ చేయాలన్నా తప్పనిసరి. అయితే.. ఎక్కువగా తీసుకుంటే ప్రమాదమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మధుమేహులు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ సమస్యకు సేంద్రీయ పరిష్కారం స్వీట్​ తులసి. కేరళలో ఓ రైతు ఈ మొక్కలను సాగు చేస్తున్నారు. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.

స్వీట్​ తులసి

Sweet basil uses: ఈ ఒక్క ఆకు.. పంచదారతో పోలిస్తే 30 రెట్లు తియ్యగా ఉంటుంది. మధుమేహ రోగులకు ఎంతో సురక్షితం. అదే స్వీట్​ తులసి. అద్భుత లక్షణాలు కలిగిన ఈ మొక్క ఇప్పుడు కేరళలో అత్యంత ప్రాచుర్యం పొందింది. కన్నూర్​ జిల్లాకు చెందిన ఓ రైతు దీనిని సాగు చేస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి మొక్కల కోసం ఆర్డర్లు వస్తున్నాయంటే.. దాని ప్రాముఖ్యం అర్థం చేసుకోవచ్చు.

Sweet basil
తీపి తులసి మొక్క

జిల్లాలోని పరియారమ్​ గ్రామానికి చెందిన కేవీ షాజీ.. కొద్ది రోజుల క్రితం ఈ మొక్కలోని ఔషధ గుణాలను తెలుసుకుని ఆకర్షితుడయ్యారు. దానిని సాగు చేయాలని నిర్ణయించుకున్నారు. త్రివేండ్రం నుంచి కొన్ని మొక్కలను తీసుకొచ్చి.. తన భూమిలో పెంచడం ప్రారంభించారు. రక్తంలోని చక్కెర స్థాయిని, బీపీని నియంత్రించే మంచి గుణాలు ఈ స్వీట్ తులసిలో ఉన్నాయని చెబుతున్నారు షాజీ.

Sweet basil
రైతు కేవీ షాజీ

మొక్క నాటిన తర్వాత మూడు నెలలకు పూలు పూస్తాయి. ఆ తర్వాత వాటి ఆకులను తొలగిస్తారు. వాటిని ఎండబెట్టి వాడుకునేందుకు వీలుగా పొడిగా మారుస్తారు. పొడిని నిలువ చేసుకుని నేరుగా అవసరమైన ఆహార పదార్థాల్లో చక్కెర తరహాలో వాడుకోవచ్చు. లేదా.. ఆ పొడిని 5 నుంచి 7 నిమిషాల పాటు మరిగిస్తే.. అందులోని తియ్యదనం నీటిలో కలుస్తుంది. ఆ నీటిని మిఠాయిలు వంటివి చేసేందుకు వినియోగించవచ్చు.

Sweet basil
స్వీట్​ తులసి మొక్కల పెంపకం

ఒక మొక్క ఐదేళ్ల వరకు పెరుగుతుందని చెబుతున్నారు షాజీ. మూడు మొక్కలను రూ.250కి విక్రయిస్తున్నామని, ప్రస్తుతం కొరియర్​ ద్వారా డెలివరీ చేస్తున్నామని చెప్పారు. ఆన్​లైన్​ డెలివరీ కోసం ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి: మధుమేహానికి మెంతులతో రక్ష!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.