ETV Bharat / bharat

ఈ నెల 14 నుంచి సుప్రీంకోర్టులో భౌతిక విచారణలు

author img

By

Published : Feb 8, 2022, 7:53 AM IST

Supreme Court Physical Hearing: సుప్రీంకోర్టులో ఈ నెల 14 నుంచి భౌతిక విచారణలు పునఃప్రారంభం కానున్నాయి. కరోనా కేసులు తగ్గిన నేపథ్యంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల కమిటీతో సంప్రదింపుల అనంతరం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

supreme court physical hearing
supreme court physical hearing

Supreme Court Physical Hearing: కొవిడ్‌-19 ఉద్ధృతి తగ్గిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఈ నెల 14 నుంచి భౌతిక విచారణలు పునఃప్రారంభం కానున్నాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల కమిటీతో సంప్రదింపుల అనంతరం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వి రమణ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వచ్చేవారం నుంచి బుధ, గురువారాల్లో భౌతిక విచారణలు చేపట్టనున్నారు.

సోమ, శుక్రవారాల్లో విచారణలు ఆన్‌లైన్‌లో సాగుతాయి. మంగళవారం కూడా భౌతిక విచారణ చేపడతారు. కక్షిదారుల తరఫున అడ్వకేట్స్‌ ఆన్‌ రికార్డ్స్‌ (ఏవోఆర్‌) ముందుగా దరఖాస్తు చేసుకుంటే ఆన్‌లైన్‌ విచారణకు అనుమతిస్తారు. ఈ మేరకు ప్రామాణిక నిర్వహణ పద్ధతుల్ని సవరిస్తూ సుప్రీంకోర్టు రిజిస్ట్రీ సర్క్యులర్‌ జారీ చేసింది. ఏ తరహా విచారణలకు ఎంతమందిని అనుమతించేదీ దీనిలో తెలిపింది.

ఇదీ చూడండి: మణికొండ జాగీర్‌లో 1,654 ఎకరాలు ప్రభుత్వానివే: సుప్రీం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.