ETV Bharat / bharat

జాతీయ స్థాయిలో మద్య నిషేధం కోసం పిల్..​ సుప్రీం ఏమందంటే...

author img

By

Published : Sep 12, 2022, 3:08 PM IST

supreme court
సుప్రీంకోర్టు

Supreme Court Liquor Ban : జాతీయ స్థాయిలో మద్య నిషేధ విధానాన్ని తీసుకువచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన పిటిషన్​పై విచారణకు సుప్రీంకోర్టు విముఖత చూపింది. మరోవైపు దోషులుగా తేలిన వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించే అంశంపై దాఖలైన పిటిషన్​పై విచారించేందుకు సుప్రీం అంగీకారం తెలిపింది. సీఏఏపై దాఖలైన పిటిషన్లపై ఈ నెల 19 నుంచి వాదనలు వింటామని పేర్కొంది.

Supreme Court Liquor Ban : జాతీయ స్థాయిలో మద్య నిషేధ విధానాన్ని తీసుకువచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు విముఖత చూపింది. రాష్ట్రాలు తమంతట తాముగా నియంత్రిస్తున్నందున జాతీయ స్థాయిలో మద్యపాన నిషేధ విధానాన్ని రూపొందించేలా కేంద్రానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యూయూ లలిత్‌ నేతృత్వంలోని ధర్మాసనం పరిశీలించింది. మద్యం విధానం కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది గుర్తు చేశారు. రాష్ట్రాలు తమ సొంత చట్టాలను రూపొందించుకుంటాయని.. కేంద్రం జోక్యం చేసుకోవడం లేదని పిటిషనర్ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.

"మద్యం విధానం.. ప్రభుత్వ ఆదాయ మార్గానికి అనుసంధానమై ఉంది. కొన్ని సందర్భాల్లో ఏదైనా జరిగితే ప్రభుత్వ ఆదాయాన్ని నియంత్రిస్తారు. మద్యం ద్వారా వస్తున్న ఆదాయం.. సామాజిక ప్రయోజనాల కోసం కూడా ఉపయోగపడుతుంది. ఈ అభ్యర్ధన ప్రభుత్వానికి ఒక విధానాన్ని కలిగి ఉండాలని నిర్దేశించడం లాంటిది. ఇది సుప్రీంకోర్టు పరిధిలోకి రాదు. విచారణలో అనేక నివేదికలను ఉదహరించడం, దీనికి కేంద్రం మరోలా స్పందించడం.. ఈ రకమైన విషయాలు మీకు వినోదభరితంగా ఉంటాయి. ఈ విషయంలో జోక్యం చేసుకోవడం సబబు అనిపించడం లేదు. మీకు కావలసినది మీరు చేయవచ్చు.

--సుప్రీంకోర్టు

కేంద్ర ప్రభుత్వం ఏమనుకుంటుందో తెలుసుకోవడం ముఖ్యమని పిటిషనర్ తరపు న్యాయవాది అన్నారు. అందుకు కేంద్రానికి నోటీసులు ఇవ్వాలని కోరారు. దీనికి బదులుగా ధర్మాసనంలోని మరో న్యాయమూర్తి జస్టిస్ రవీంద్ర భట్ ఇలా స్పందించారు. 'అప్పుడు ఏం జరుగుతుంది? ఇది ఎక్కడ ముగుస్తుంది' అని ప్రశ్నించారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఉపసంహరించుకునేందుకు పిటిషనర్​కు సుప్రీంకోర్టు అవకాశం ఇచ్చింది.

దోషుల పోటీపై..
దోషులుగా తేలిన వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించే అంశంపై దాఖలైన పిటిషన్​పై విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. 2016 నుంచి సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది ఈ పిటిషన్‌. దోషులుగా తేలిన నేరస్థులు ఎన్నికల్లో పోటీ చేయడం, రాజకీయ పార్టీ కీలక పదవుల్లోకి రావడంపై జీవితకాల నిషేధం విధించాలని కోరుతూ 2016లో సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. త్వరలోనే పిల్ విచారణకు తేదీని ఖరారు చేస్తామని ధర్మాసనం తెలిపింది. అంతకుముందు తాను, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేపట్టాలని సీజేఐ ధర్మాసనాన్ని కోరారు న్యాయవాది అశ్వని ఉపాధ్యాయ.

సీఏఏ పిటిషన్ల విచారణ..
సీఏఏపై దాఖలైన పిటిషన్లపై విచారణను మరోసారి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈనెల 19 నుంచి విచారణ జరుగుతుందని ధర్మాసనం పేర్కొంది. ఈ కేసులో విచారణకు మొత్తం 220 పిటిషన్లు రానున్నాయి. న్యాయవాదుల డిమాండ్‌ మేరకు విచారణను వాయిదా వేసింది సీజేఐ జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ రవీంద్ర భట్‌తో కూడిన ఉమ్మడి ధర్మాసనం.

ఇవీ చదవండి: అమ్మాయి కోసం గొడవ.. సోదరులపై కత్తితో దాడి.. ఫోన్ దొంగిలించాడని యువకుడిపై దారుణం

దేశవ్యాప్తంగా 60 ప్రదేశాల్లో ఎన్‌ఐఏ దాడులు.. ఆ గ్యాంగ్​స్టర్లే టార్గెట్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.