ETV Bharat / bharat

మహారాష్ట్రలో కఠిన లాక్​డౌన్​కు కేబినెట్ సిఫార్సు

author img

By

Published : Apr 20, 2021, 8:19 PM IST

మహారాష్ట్రలో కరోనా విజృంభణను కట్టడి చేసేందుకు కఠినమైన లాక్​డౌన్​ను విధించాలని కేబినేట్ సూచించినట్లు ఆ రాష్ట్ర మంత్రి రాజేశ్ తోపే తెలిపారు. దీనిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే బుధవారం ప్రకటన చేసే అవకాశం ఉందన్నారు.

rajesh tope
రాజేశ్ తోపే

మహారాష్ట్రలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న క్రమంలో 'కఠినమైన లాక్​డౌన్​' విధించాలని కేబినేట్ సూచించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే తెలిపారు. దీనిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే బుధవారం ప్రకటన జారీ చేసే అవకాశం ఉందని వివరించారు.

పదోతరగతి పరీక్షలను సైతం రద్దు చేయాలని కేబినేట్​ నిర్ణయించినట్లు ఆ రాష్ట్ర మంత్రులు రాజేశ్ తోపే, ఏక్​నాథ్ షిండే పేర్కొన్నారు.

"రాష్ట్రంలో కొవిడ్-19ను కట్టడి చేసేందుకు కఠినతరమైన లాక్​డౌన్​ విధించాలని కేబినేట్ సూచించింది. పదోతరగతి పరీక్షలను సైతం రద్దు చేయాలని కేబినేట్ నిర్ణయం తీసుకుంది. దీనిపై ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే బుధవారం అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది."

-రాజేశ్ తోపే, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి

మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తోంది. గత రెండు వారాలుగా రోజుకు 50వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.

ఇదీ చదవండి : టీకా తయారీ సంస్థల ప్రతినిధులతో ప్రధాని భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.