ETV Bharat / bharat

కన్నడనాట కరోనా విలయం- మహారాష్ట్రలో మృత్యుఘోష

author img

By

Published : May 4, 2021, 10:08 PM IST

కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో కరోనా విలయం కొనసాగుతోంది. కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నా వైరస్‌ వ్యాప్తి ఆగడం లేదు. మహారాష్ట్రలో కేసులు, మరణాలు మళ్లీ పెరిగాయి. యూపీలో రోజువారీ మరణాలు తొలిసారి 350 మార్కును దాటాయి.

Karnataka Covid-19 Update
మహారాష్ట్ర కరోనా కేసులు

మహారాష్ట్రలో కొత్త కేసుల సంఖ్య తగ్గింది. అయినప్పటికీ.. మరణాలు మాత్రం భారీగానే నమోదయ్యాయి. తాజాగా 51,880 కేసులు నమోదవగా.. 891 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజే 65,934 మంది కోలుకోవడం విశేషం.

కర్ణాటకలోనూ కొవిడ్​ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఒక్కరోజే 44,631 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 292 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 24 మందికిపైగా వైరస్​ను జయించారు. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 17 లక్షలకు చేరువైంది.

వివిధ రాష్ట్రాల్లో కేసులు, మరణాల వివరాలు..

  • కేరళలో తాజాగా 37,190 మందికి పాజిటివ్​గా తేలింది. మరో 118 మంది చనిపోయారు.
  • తమిళనాడులో ఒక్కరోజే 21,228 మందికి వైరస్ సోకగా.. మరో 144 మంది మృతి చెందారు.
  • రాజస్థాన్​లో కొత్తగా 16,984 కేసులు నమోదవగా.. మరో 154 మంది మరణించారు.
  • ఉత్తర్​ప్రదేశ్​లో తొలిసారిగా 350పైగా కొవిడ్​ మరణాలు నమోదయ్యాయి. మరో 12,500 మంది కరోనా బారినపడ్డారు.
  • బంగాల్​లో మరో 17,639 మంది పాజిటివ్​గా తేలగా.. మరో 107 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి: సామాజిక ఉద్యమకారుడు ట్రాఫిక్​ రామస్వామి కన్నుమూత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.