ETV Bharat / bharat

'భాజపాకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కూటమి'

author img

By

Published : Mar 29, 2021, 6:06 AM IST

తమిళనాడు తరహాలో జాతీయ స్థాయిలోనూ భాజపాకు వ్యతిరేకంగా ఓ కూటమిని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీని డీఎంకే అధినేత స్టాలిన్ కోరారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తమిళనాడు నుంచి భాజపా కనుమరుగవుతదుందని ఎద్దేవా చేశారు. తమ కూటమే అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు.

Stalin
'రాహుల్​ సారథ్యంలో భాజపాకు వ్యతిరేకంగా కూటమి'

తమిళనాడు తరహాలో భాజపాకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఓ కూటమిని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్​ అగ్ర నేత రాహుల్​ గాంధీని కోరారు డీఎంకే అధినేత స్టాలిన్​. తమిళనాడుపై భాజపా.. సాంస్కృతిక, రసాయనిక దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. సాలెంలో ఎన్నికల ప్రచారంలో స్టాలిన్​ పాల్గొన్నారు. మతవాద, నియంతృత్వ శక్తులతో దేశం సతమతమవుతోందన్న ఆయన.. ఆ బాధల నుంచి విముక్తి కల్పించేది రాహుల్​ మాత్రమేనని కొనియాడారు.

"గత లోక్​సభ ఎన్నికల్లో భాజపాకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో తమిళనాడులో ఉన్నట్లుగా ఎలాంటి కూటమి లేదు. అందుకే.. రాహుల్​ గాంధీ ఆ బాధ్యత తీసుకుని జాతీయ స్థాయిలో త్వరగా ఓ కూటమిని ఏర్పాటు చేయాలి. ఏఐడీఎంకే సాయంతో తమిళనాడులో పట్టు సాధించాలని భాజపా ప్రయత్నిస్తోంది. కానీ, అది ఎన్నటికీ జరగదు."

- స్టాలిన్​, డీఎంకే అధినేత

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత.. రాష్ట్రం నుంచి భాజపా కనుమరుగవుతుందని స్టాలిన్​ విమర్శించారు. తమ నేతృత్వంలోని లౌకికత్వ కూటమి తమిళనాట అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:'అమిత్​ షా-పవార్​ల మధ్య భేటీ జరగనేలేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.