ETV Bharat / bharat

పదో తరగతి అర్హతతో 26,146 SSC జాబ్స్​- అప్లైకు 3 రోజులే ఛాన్స్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 28, 2023, 11:59 AM IST

SSC Constable Jobs 2023 : కేవలం పదో తరగతి అర్హతతో పోలీసు ఉద్యోగాల్లో స్థిరపడాలనుకుంటున్నారా? అయితే ఈ సువర్ణవకాశం మీకోసమే. స్టాఫ్​ సెలక్షన్ కమిషన్​ 26,146 పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్​ను విడుదల చేసింది. మరి ఈ కొలువులకు దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన అర్హతలు, ఏజ్​ లిమిట్​, ఫీజు, జీతభత్యాలు తదితర పూర్తి వివరాలు మీ కోసం.

SSC Constable Recruitment Notification 2023
SSC Constable Jobs 2023

SSC Constable Jobs 2023 : స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) 26,146 కానిస్టేబుల్/ రైఫిల్‌మ్యాన్ (గ్రౌండ్‌ డ్యూటీ) పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా కేంద్ర సాయుధ బలగాలైన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌(బీఎస్‌ఎఫ్‌), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్‌), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్‌), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ), సశస్త్ర సీమ బల్ (ఎస్‌ఎస్‌బీ), సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (ఎస్‌ఎస్‌ఎఫ్‌)లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులు; అస్సాం రైఫిల్స్ (ఏఆర్‌)లో రైఫిల్‌మ్యాన్ (జనరల్ డ్యూటీ) భద్రతా దళాల్లోని పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు గడువులోగా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు
SSC GD Constable Posts List : కానిస్టేబుల్(జనరల్ డ్యూటీ)/ రైఫిల్‌మ్యాన్(జనరల్ డ్యూటీ)- మొత్తం 26,146 పోస్టులు

పార్ట్- 1 పోస్టులు :

SSC Job Vacancy 2023 :

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌(బీఎస్‌ఎఫ్‌)- 6,174 పోస్టులు

  • పురుషులు- 5,211
  • మహిళలు- 963

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్‌ఎఫ్‌)- 11,025 పోస్టులు

  • పురుషులు- 9,913
  • మహిళలు- 1,112

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్‌)- 3,337 పోస్టులు

  • పురుషులు- 3,266
  • మహిళలు- 71

సశస్త్ర సీమ బల్(ఎస్‌ఎస్‌బీ)- 635 పోస్టులు

  • పురుషులు- 593
  • మహిళలు- 42

ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ)- 3,189 పోస్టులు

  • పురుషులు- 2,694
  • మహిళలు- 495

అస్సాం రైఫిల్స్(ఏఆర్‌)- 1,490 పోస్టులు

  • పురుషులు- 1,448
  • మహిళలు- 42

సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్(ఎస్‌ఎస్‌ఎఫ్‌)- 296 పోస్టులు

  • పురుషులు- 222
  • మహిళలు- 74

విద్యార్హతలు
SSC Jobs 2023 Qualification : పదో తరగతి పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. పురుష అభ్యర్థుల ఎత్తు 170 సెం.మీ.లకు, మహిళా అభ్యర్థులకు 157 సెం.మీ.లకు తగ్గకూడదు.

వయోపరిమితి

SSC Jobs 2023 Age Limit :

  • 2024 జనవరం 01 నాటికి అభ్యర్థుల వయసు 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • అభ్యర్థులు 2001 జనవరి 02 కంటే ముందు, 2006 జనవరి 01 తర్వాత జన్మించి ఉండకూడదు.
  • ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు వయోపరిమితి సడలింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుము

SSC Jobs 2023 Application Fees :

  • మహిళలు, ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనిక అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు కల్పించారు.
  • మిగతా కేటగిరీలకు చెందిన అభ్యర్థులు రూ.100 అప్లికేషన్​ ఫీజుగా చెల్లించాలి.

ఎంపిక ప్రక్రియ

SSC Jobs 2023 Selection Process :

  • కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్(సీబీఈ)​
  • ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్​
  • ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్​
  • వైద్య పరీక్షలు
  • ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం

SSC Jobs 2023 Exam Pattern :

  • ప్రశ్నపత్రం 80 మార్కులకు ఉంటుంది.
  • ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు ఉంటాయి.
  • పరీక్ష వ్యవధి 60 నిమిషాలు.
  • నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంది.
  • జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌, జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ జనరల్‌ అవేర్‌నెస్‌, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌, ఇంగ్లిష్‌/ హిందీ అంశాలనుంచి ప్రశ్నలుంటాయి.

పరీక్ష తేదీ
SSC Jobs 2023 Exam Date : 2024 ఫిబ్రవరి-మార్చి మధ్యలో కంప్యూటర్ ఆధారిత రాతపరీక్షను నిర్వహించే అవకాశం ఉంది.

ఈ భాషల్లో ఎగ్జామ్​
SSC Jobs 2023 Exam Languages : తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌ సహా మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో పరీక్ష ఉంటుంది.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు
SSC Jobs 2023 Exam Centers : చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.

జీత భత్యాలు
SSC Constable Jobs Salary : ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు రూ.21,700 నుంచి రూ.69,100 మధ్య వేతనం చెల్లిస్తారు.

ముఖ్యమైన తేదీలు

SSC Constable Jobs 2023 Important Dates :

  • దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ- 2023 డిసెంబర్​ 31
  • ఫీజు చెల్లింపునకు చివరి తేదీ- 2024 జనవరి 01
  • దరఖాస్తు సవరణ తేదీలు- 2024 జనవరి 04 నుంచి 06

టెన్త్, డిగ్రీ అర్హతతో ఎయిర్​పోర్ట్​లో 119 అసిస్టెంట్​ జాబ్స్​

ఇంటర్​ అర్హతతో త్రివిధ దళాల్లో 400 ఉద్యోగాలు ​- దరఖాస్తుకు మరికొన్ని రోజులే ఛాన్స్!​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.