ETV Bharat / bharat

వెరైటీ పాన్ షాప్​.. 600 రకాలు.. ఒక్కొక్కటి లక్షన్నర

author img

By

Published : Mar 3, 2023, 4:14 PM IST

మహారాష్ట్రలోని ఓ పాన్​ షాప్​లో​ దాదాపు 600 రకాల పాన్​లను అమ్ముతున్నారు. గత ఎనిమిదేళ్లుగా నడుస్తున్న ఈ పాన్​ ​షాప్​.. జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇందులో రూ. 25 నుంచి రూ. లక్షన్నర ధర గల పాన్​లను విక్రయిస్తున్నారు. ఆ కథెేంటో తెలుసుకుందాం రండి..!

six-hundred-paan-variety-available-at-mauli-family-paan-house-in-maharashtra
మౌలి ఫ్యామిలీ పాన్ హౌస్ మహారాష్ట్ర

వెరైటీ పాన్ షాప్​.. 600 రకాలు.. ఒక్కొక్కటి లక్షన్నర

మౌలి ఫ్యామిలీ పాన్‌హౌస్.. ఇది మాములు పాన్​ షాప్​ కాదండోయ్​. ఈ​ షాపులో దాదాపు 600 రకాల పాన్​లు దొరుకుతాయి. ఈ షాప్​లో ఇరవై ఐదు రూపాయల పాన్​ నుంచి.. లక్షన్నర రూపాయల ధరల వరకు పాన్​లు అందుబాటులో ఉంటాయి. మహారాష్ట్రలోని నాశిక్​లో ఉంది ఈ​ మౌలి ఫ్యామిలీ పాన్‌హౌస్. గత ఎనిమిది ఏళ్లుగా ఈ పాన్​ షాపును నిర్వహిస్తున్నాని చెబుతున్నాడు గణేశ్​ దుక్రే అనే యువకుడు.

గణేశ్​ దుక్రే బీఏ డిగ్రీ పూర్తి చేశాడు. అనంతరం కొద్ది రోజులు ఉద్యోగ ప్రయత్నాలు చేశాడు. ఎటువంటి ఉద్యోగం దొరకని కారణంగా తానే సొంతంగా వ్యాపారం చేయాలని నిశ్చయించుకున్నాడు. వెంటనే.. ఓ పాన్ షాపు ప్రారంభించాలని తలిచాడు. అందుకోసం పుణె వెళ్లి ఓ పాన్​ షాప్​లో కొన్ని రోజులు పనిచేశాడు. అక్కడ వివిధ ఆకులు, పాన్​ల గురించి తెలుసుకున్నాడు. అనంతరం నాసిక్​ వచ్చి వ్యాపారం ప్రారంభించాడు. ఈ పాన్‌హౌస్​కు చాలా మంది అభిమానులే ఉన్నారు. నాశిక్​ వచ్చిన పర్యటకులు.. కచ్చితంగా ఈ పాన్ షాపునకు వస్తుంటారు.

six-hundred-paan-variety-available-at-mauli-family-paan-house-in-maharashtra
మౌలి ఫ్యామిలీ పాన్ హౌస్​లోని పాన్​లు

మా దగ్గర మొత్తం 600 రకాల పాన్లు​ దొరుకుతాయి. గుల్కాడ్​ పాన్​, మగాయి పాన్, ఫ్రూట్​ పాన్​, ఐస్​పాన్, ఐస్​క్రీమ్​ పాన్​, జీలీ పాన్​ ఉన్నాయి. లిక్విడ్​ పాన్​ల్లో పాన్​ షేక్​, పాన్​ షాటే, పాన్​ ముజిదే వంటివి ఉన్నాయి. 25 రూపాయల నుంచి లక్షన్నర రూపాయల వరకు ఇక్కడ లభ్యమవుతాయి.

-గణేశ్​ దుక్రే, పాన్​ షాపు యజమాని

"చాలా ఏళ్లుగా నేను ఈ​ మౌలి ఫ్యామిలీ పాన్‌హౌస్​లో పాన్​ తింటున్నాను. భోజనం చేసిన తరువాత ఓ పాన్​ తింటే ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇక్కడ ఆయుర్వేదిక్​ పాన్​, మిటా పాన్​లు ఉంటాయి. నేను ఈ షాప్​లో ఉన్న చాలా పాన్​లు ట్రై చేశాను." అని పాన్​ షాప్​కు రెగ్యులర్​ కస్టమర్​ అక్షయ్​ దేశ్​ముఖ్​ తెలిపారు.

six-hundred-paan-variety-available-at-mauli-family-paan-house-in-maharashtra
మౌలి ఫ్యామిలీ పాన్ హౌస్​లోని పాన్​
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.