ETV Bharat / bharat

'ప్రజల ప్రవర్తనతోనే థర్డ్​వేవ్​ ముప్పు'

author img

By

Published : Aug 14, 2021, 7:08 AM IST

కరోనా మూడోదశ ప్రజల ప్రవర్తనపైనే ఆధారపడి ఉంటుందన్నారు ఎయిమ్స్​ డైరెక్టర్ రణదీప్​ గులేరియా. రెండోదశ ఇంకా ముగియలేదని.. ప్రజలు కరోనా నిబంధనలను పాటించాలని సూచించారు.

Randeep Guleria
రణదీప్​ గులేరియా

కరోనా రెండో దశ వ్యాప్తి ఇంకా ముగిసిపోలేదని, మూడోదశ ప్రజల ప్రవర్తనపై ఆధారపడి ఉంటుందని దిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా వ్యాఖ్యానించారు. "కొవిడ్​ రెండోదశ ఇంకా అయిపోలేదని ప్రజలు అర్థం చేసుకోవాలని సూచిస్తున్నాను. దేశంలో రోజువారీ కేసులు 40 వేల కంటే ఎక్కువ నమోదవుతున్నాయి. ప్రతిఒక్కరూ కొవిడ్​ నిబంధనలు పాటించాలి. కొవిడ్​ వ్యాప్తి నివారణకు తగిన విధంగా ప్రవర్తిస్తే.. మూడోదశ రాదు​​" అని గులేరియా పేర్కొన్నారు.

కరోనా రెండోదశ ఏప్రిల్‌లో ప్రారంభమైందన్న గులేరియా.. రోజువారీ కేసులు నాలుగు లక్షల దాటడం వల్ల మరణాలు పెరిగాయన్నారు. దీని ప్రభావం ఆగస్టు-సెప్టెంబరులో తీవ్రంగా ఉంటుందని కొంతమంది నిపుణులు హెచ్చరించినప్పటికీ.. మే నెలలో తగ్గుముఖం పట్టిందన్నారు.

"ఒకవేళ మూడోదశ వచ్చినా.. కొవిడ్​​ నిబంధనలను ప్రజలు అనుసరిస్తే అంత ప్రమాదం ఉండదు" అని గులేరియా అన్నారు.

ఇదీ చూడండి: Coronavirus Update: కేరళలో కొత్తగా 20వేల కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.