ETV Bharat / bharat

SBI PO Recruitment : ఎస్​బీఐ భారీ నోటిఫికేషన్​.. 2000 పీవో పోస్టుల భర్తీ.. దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 8, 2023, 10:31 AM IST

SBI PO Recruitment In Telugu : స్టేట్​ బ్యాంక్​ ఆఫ్ ఇండియా 2000 ప్రొబేషనరీ ఆఫీసర్​ (PO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్​ 27లోపు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్హత, వయోపరిమితి, ఫీజు, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు మీ కోసం..

SBI PO Recruitment 2023 FOR 2000 POSTS
SBI PO Notification 2023 FOR 2000 POSTS

SBI PO Recruitment : బ్యాంకింగ్​ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్​ న్యూస్​. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్​.. స్టేట్​ బ్యాంక్ ఆఫ్​ ఇండియా (SBI) 2000 ప్రొబేషనరీ ఆఫీసర్​ (PO) పోస్టుల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్​ 27లోపు ఆన్​లైన్​లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

ప్రొబేషనరీ ఆఫీసర్​ పోస్టుల వివరాలు
SBI PO Jobs Category Wise :

  • యూఆర్​ - 810 పోస్టులు
  • ఓబీసీ - 540 పోస్టులు
  • ఎస్సీ - 300 పోస్టులు
  • ఎస్టీ - 150 పోస్టులు
  • ఈడబ్ల్యూఎస్​ - 200 పోస్టులు
  • మొత్తం - 2000 పోస్టులు

విద్యార్హతలు
SBI PO Qualification : అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యాసంస్థ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి
SBI PO Age Limit : 2023 ఏప్రిల్​ 1 నాటికి అభ్యర్థుల వయస్సు 21 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి.

దరఖాస్తు రుసుము
SBI PO Fee : పీజీ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.750 చెల్లించాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.

ఎంపిక విధానం
SBI PO Selection Process : అభ్యర్థులను వివిధ దశల వడపోత విధానం ద్వారా ఎంపిక చేస్తారు.

  • ఫేజ్​ 1 - ప్రిలిమినరీ పరీక్ష
  • ఫేజ్​ 2 - మెయిన్​ ఎగ్జామినేషన్​
  • ఫేజ్​ 3 - సైకోమెట్రిక్​ టెస్ట్​

వీటిలో క్వాలిఫై అయిన అభ్యర్థులకు గ్రూప్​ ఎక్సర్​సైజ్​, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్​ వెరిఫికేషన్​, మెడికల్ ఎగ్జామినేషన్​ నిర్వహించి, అందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులను పీవో పోస్టులకు ఎంపిక చేస్తారు.

జీతభత్యాలు
SBI PO Salary : ప్రొబేషనరీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు బేసిక్​ శాలరీగా రూ.41,960 వరకు అందిస్తారు.

  • ఏపీలోని.. ప్రీ-ఎగ్జామినేషన్​ ట్రైనింగ్ సెంటర్స్​/ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్​ సెంటర్స్​ : శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, విజయవాడ, రాజమహేంద్రవరం, కాకినాడ, ఏలూరు, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, చిత్తూరు, చీరాల, కడప, కర్నూలు, తిరుపతి
  • తెలంగాణలోని.. ప్రీ-ఎగ్జామినేషన్​ ట్రైనింగ్ సెంటర్స్​/ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్స్​ : ఖమ్మం, వరంగల్​, కరీంనగర్​, హైదరాబాద్​
  • తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పరీక్ష కేంద్రాలు : విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కర్నూలు, హైదరాబాద్​

ముఖ్యమైన తేదీలు
SBI PO Important Dates :

  • ఆన్​లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభ తేదీ : 2023 సెప్టెంబర్​ 7
  • ఆన్​లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2023 సెప్టెంబర్​ 27

పీవో పరీక్ష - ముఖ్యమైన తేదీలు
SBI PO Exam Dates 2023 :

  • ప్రిలిమినరీ ఎగ్జామ్ కాల్​ లెటర్స్​ డౌన్​లోడ్ : 2023 అక్టోబర్​
  • ఫేజ్​ 1 ఆన్​లైన్​ ప్రిలిమినరీ పరీక్ష : 2023 నవంబర్​
  • ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల ప్రకటన : 2023 నవంబర్​/ డిసెంబర్​
  • మెయిన్​ ఎగ్జామ్​ కాల్​ లెటర్ డౌన్​లోడ్​ : 2023 నవంబర్​/ డిసెంబర్​
  • స్టేజ్​ 2 ఆన్​లైన్​ మెయిన్స్​ పరీక్ష : 2023 డిసెంబర్​/ 2024 జనవరి
  • మెయిన్​ ఎగ్జామ్స్​ రిజల్ట్స్​ : 2023 డిసెంబర్​/ 2024 జనవరి
  • ఫేజ్​ 3 కాల్​ లెటర్​ డౌన్​లోడ్​ : 2024 జనవరి/ ఫిబ్రవరి
  • ఫేజ్​ 3 సైకో మెట్రిక్ ఎగ్జామ్ : 2024 జనవరి/ ఫిబ్రవరి
  • ఇంటర్వ్యూ, గ్రూప్​ ఎక్సర్​సైజ్​ తేదీలు : 2024 జనవరి/ ఫిబ్రవరి
  • పీవో తుది ఫలితాల ప్రకటన : 2024 ఫిబ్రవరి/ మార్చి

ఈ బ్యాంకింగ్ జాబ్స్​ పూర్తి వివరాల కోసం ఎస్​బీఐ పీవో అధికారిక నోటిఫికేషన్​ను చూడండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.