ETV Bharat / bharat

Sanatan Dharma Row Supreme Court : సనాతన ధర్మం వ్యాఖ్యలపై స్టాలిన్, ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 22, 2023, 12:52 PM IST

Updated : Sep 22, 2023, 3:07 PM IST

Sanatan Dharma Row Supreme Court : సనాతన ధర్మాన్ని నిర్మూలించాలన్న వ్యాఖ్యలకు సంబంధించి సుప్రీంకోర్టు.. తమిళనాడు ప్రభుత్వం, ఆ రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు నోటీసులు జారీ చేసింది. విద్వేష వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌పై ఎఫ్​ఐఆర్​ దాఖలు చేసేందుకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ త్రివేదితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇలాంటి కేసుల్లో సుప్రీంకోర్టు గతంలో ఎఫ్​ఐఆర్​ సహా అనేక ఆదేశాలు జారీ చేసినట్లు పిటిషనర్‌ తెలిపారు.

Sanatan Dharma Row Supreme Court
Sanatan Dharma Row Supreme Court

Sanatan Dharma Row Supreme Court : సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో తమిళనాడు ప్రభుత్వానికి, మంత్రి ఉదయనిధి స్టాలిన్​ సహా ముగ్గురు ఎంపీలకు​ సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. మంత్రిపై ఎఫ్​ఐఆర్ దాఖలు చేసేందుకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్​పై తమ వాదన ఏంటో తెలియజేయాలని తమిళనాడు సర్కార్​ను, ఉదయనిధిని ఆదేశించింది.

తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్​.. సనాతన ధర్మంపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని.. ఆయనపై ఎఫ్​ఐఆర్ నమోదు చేసేందుకు ఆదేశాలని ఇవ్వాలని కోరుతూ సుప్రీం కోర్టులో జగన్నాథ్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. అనుచిత వ్యాఖ్యల విషయంలో సుప్రీంకోర్టు అనేక సార్లు కలగజేసుకుని ఆదేశాలు జారీ చేసిందని.. మంత్రి ఉదయనిధిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశాలివ్వాలని పిటిషనర్​ కోరారు. ఈ నేపథ్యంలో మంత్రి ఉదయనిధితో పాటు తమిళనాడు సర్కార్​, ఎంపీలు ఏ రాజా, తిరుమావళవన్, వెంకటేశన్, తమిళనాడు డీజీపీ, గ్రేటర్ చెన్నై పోలీస్ కమిషనర్, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్ బాబుకు కూడా జస్టిస్ అనిరుద్ధ బోస్​, జస్టిస్​ త్రివేదితో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం నోటీసులు జారీ చేసింది.

  • Supreme Court also issues notice to MP A Raja, MP Thirumavalavan, MP Su Venkatesan, Tamil Nadu DGP, Greater Chennai Police Commissioner, Union Home Ministry, Minister for Hindu Religious & Charitable Endowment Department PK Sekar Babu, Chairman of Tamil Nadu State Minorities…

    — ANI (@ANI) September 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అంతకుముందు.. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది శేషాద్రి నాయుడు ధర్మాసనం ఎదుట వాదనలు వినిపించారు. ఈ మతం మంచిది కాదని.. మరో మతం మంచిదని చెప్పాలని పాఠశాల విద్యార్థులను మంత్రి కోరారని ఆరోపించారు. 'వ్యక్తులు వేరొకరి మతవిశ్వాసానికి వ్యతిరేకంగా ఇలాంటి ప్రకటనలు చేసినప్పుడు కోర్టు దృష్టికి వచ్చాయి. ఈ సారి స్వయంగా ఓ మంత్రి.. విద్యార్థుల ఎదుట ఓ మతం మంచిదని కాదని చెప్పారు' అని శేషాద్రి నాయుడు అన్నారు.

న్యాయస్థానం నుంచి మీరు ఏమి కోరుతున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది శేషాద్రి నాయుడిని సుప్రీం ద్విసభ్య ధర్మాసనం ప్రశ్నించింది. మంత్రి ఉదయనిధి అటువంటి ప్రకటనలు చేయకుండా నిరోధించాలని.. ఆయనపై ఎఫ్​ఐఆర్ నమోదు చేసేందుకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నానని శేషాద్రి నాయుడు బదులిచ్చారు. 'మేం నోటీసులు జారీ చేస్తున్నాం.. ఎఫ్‌ఐఆర్‌ నమోదు కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించడం ద్వారా మీరు న్యాయస్థానాన్ని పోలీస్‌స్టేషన్‌గా మారుస్తున్నారు. మీరు హైకోర్టుకు వెళ్లి ఉండాల్సింది' అని ధర్మాసనం పేర్కొంది. సనాతన ధర్మంపై వ్యాఖ్యలు చేసిన వ్యక్తి మంత్రిగా ఉన్నందు వల్ల ఎవరూ ఎఫ్​ఐఆర్ నమోదు చేయలేదని.. అందుకే తాము సుప్రీంకోర్టును ఆశ్రయించామని తెలిపారు న్యాయవాది.

డీఎంకే కౌంటర్..
సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలకు గాను తమిళనాడు ప్రభుత్వానికి, మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేయడంపై స్పందించారు డీఎంకే నేత టీకేఎస్ ఇళంగోవన్. 'సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ క్రమంలో మంత్రిని, ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు వివరణ కోరింది. సనాతన ధర్మం అంటే ఏంటో వివరించమని మేము వారిని (కేంద్ర ప్రభుత్వం) అడుగుతాం. సనాతన ధర్మం నాగరిక సమాజంలో సమానత్వం గురించి మాట్లాడుతుందా? లేదా పాత అనాగరిక పద్ధతి గురించి మాట్లాడుతుందా? ' అని అన్నారు.

  • #WATCH | On Supreme Court issuing notice to Tamil Nadu government and DMK leader Udhayanidhi Stalin for his remarks on 'Sanatan Dharma', DMK leader TKS Elangovan says, "There was a petition filed and they are seeking the clarification. Let the clarification go... The matter is… https://t.co/Is7imXLILS pic.twitter.com/nbMbYWwUTi

    — ANI (@ANI) September 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కొద్ది రోజుల క్రితం.. తమిళనాడు క్రీడాశాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్‌.. సనాతన ధర్మాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. సనాతన ధర్మాన్ని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలను బ్రాహ్మణ, హిందూ సంఘాలతోపాటు బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. చెన్నైలో జరిగిన తమిళనాడు ప్రగతిశీల రచయితలు, కళాకారుల సంఘం సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉదయనిధి స్టాలిన్‌.. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించటం కాకుండా దాని నిర్మూలన కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

PM Modi on Sanatana Dharma : 'సనాతన ధర్మం నిర్మూలనకు ఇండియా కూటమి కుట్ర! రేపు దాడులు కూడా చేస్తారేమో'

Sanatana Dharma Remark Row : 'స్టాలిన్​పై కఠిన చర్యలు తీసుకోవాలి'.. సుప్రీంకోర్టుకు 262 మంది ప్రముఖుల లేఖ

Udhayanidhi Stalin Statement : సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు.. వారసత్వ గర్వమేనన్న అమిత్ షా

Last Updated : Sep 22, 2023, 3:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.