ETV Bharat / bharat

సెయిల్​లో భారీగా ఉద్యోగాలు.. నెలకు రూ.2లక్షల జీతం! దరఖాస్తుకు వారమే ఛాన్స్

author img

By

Published : Apr 8, 2023, 7:25 PM IST

sail recruitment 2023
sail recruitment 2023

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కోసం ఎదురుచూస్తున్న ఆశావాహులకు గుడ్​న్యూస్​. సెయిల్​​ 244 పోస్టులుకు గాను నోటిఫికేషన్​ విడుదల చేసింది. నెలవారీ జీతం రూ.2,20,000. మరి ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేసుకోవాలి, దానికి కావలసిన పూర్తి వివరాలు మీకోసం..

నిరుద్యోగులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న ఝార్ఖండ్​ రాష్ట్రంలోని స్టీల్​ అథారిటీ ఆఫ్​ ఇండియా(సెయిల్​)లో వివిధ పోస్టులకు భారీ నోటిఫికేషన్​ విడుదలైంది. బొకారో స్టీల్​ ప్లాంట్​లో 244 ఉద్యోగాలకు కేంద్రం నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు సెయిల్ అధికారిక వెబ్​సైట్​ ద్వారా.. వారి అర్హతకు తగిన పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అయితే సెయిల్ ఏఏ పోస్టులకు దరఖాస్తు కోరుతుందో.. దానికి కావాల్సిన విద్యార్హతలు, వయస్సు, ఎలా అప్లై చేసుకోవాలి, ముఖ్యమైన తేదీలు వంటి మరిన్ని వివరాలు మీకోసం..

మొత్తం పోస్టుల సంఖ్య: 244

ఎక్సిక్యూటీవ్​ కేడర్ పోస్టులు:
కన్సల్టెంట్​, గ్రేడ్​- E​3: 10 పోస్టులు
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ, మెడికల్ కౌన్సిలన్​ ఆఫ్ ఇండియా నుంచి పీజీ/డీఎన్​బీ ఉత్తీర్ణత పొందాలి. వయస్సు 41 సంవత్సరాలలోపు ఉండాలి. జీతం రూ.80,000 నుంచి 2,20,000 మధ్య ఉంటుంది.

మెడికల్​ ఆఫీషర్(ఎంఓ), గ్రేడ్​- E​1: 10 పోస్టులు
గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్​ డిగ్రీ అర్హత సాధించాలి. వయస్సు 34 సంవత్సరాలలోపు ఉండాలి. జీతం రూ.50,000 నుంచి 1,60,000 మధ్య ఉంటుంది.

మెడికల్​ ఆఫీసర్​(ఓహెచ్​ఎస్​), గ్రేడ్​- E​1: 03 పోస్టులు
ఎంబీబీఎస్​ డిగ్రీతో పాటుగా ఇండస్ట్రియల్​ హెల్త్​లో డిప్లొమా. వయస్సు 34 సంవత్సరాలలోపు ఉండాలి. జీతం రూ.50,000 నుంచి రూ.1,60,000 మధ్య ఉంటుంది.

మేనేజ్​మెంట్​ ట్రైనీ- టెక్​(ఎన్విరాన్మెంటల్​), గ్రేడ్​- E​1: 04 పోస్టులు
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎన్విరాన్మెంటల్ సైన్స్​లో బీఈ/బీటెక్​ ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు 28 సంవత్సరాలలోపు ఉండాలి. జీతం రూ.50,000 నుంచి రూ.1,60,000 మధ్య ఉంటుంది.

అసిస్టెంట్​ మేనేజర్​(సేఫ్టీ), గ్రేడ్​- E​1: 03 పోస్టులు
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ/బీటెక్​. వయస్సు 28 సంవత్సరాలలోపు ఉండాలి. జీతం రూ.50,000 నుంచి రూ.1,60,000 మధ్య ఉంటుంది.

నాన్​- ఎగ్జిక్యూటివ్ కేడర్​ పోస్టులు

ఆపరేటర్​ కమ్​ టెక్నీషియన్​ ట్రైనీ, గ్రేడ్​- S3: 87 పోస్టులు
సంబంధిత విభాగంలో మూడేళ్ల ఇంజనీరింగ్​ డిప్లొమా ఉత్తీర్ణత సాధించాలి. వయుస్సు 28 సంవత్సరాలకు మించకూడదు. జీతం రూ.26,600 నుంచి రూ.38,920 మధ్య ఉంటుంది.

మైనింగ్​ ఫోర్​మెన్​, గ్రేడ్​- S3: 09 పోస్టులు
సంబంధిత విభాగంలో మూడేళ్ల ఇంజినీరింగ్​ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు మైన్స్​ ఫోర్​మెన్​ సర్టిఫికేట్ ఉండాలి. వయుస్సు 28 సంవత్సరాలకు మించకూడదు. జీతం రూ.26,600 నుంచి రూ.38,920 మధ్య ఉంటుంది.

సర్వేయర్​, గ్రేడ్​- S3: 06 పోస్టులు
సంబంధిత విభాగంలో మూడేళ్ల ఇంజనీరింగ్​ డిప్లొమా ఉత్తీర్ణత సాధించాలి. వయుస్సు 28 సంవత్సరాలకు మించకూడదు. జీతం రూ.26,600 నుంచి రూ.38,920 మధ్య ఉంటుంది.

మైనింగ్​ మేట్​, గ్రేడ్​- S1: 20 పోస్టులు
పదో తరగతితో పాటుగా డీజీఎమ్​ఎస్​, ఎమ్​ఎమ్​ఆర్​ అందించిన మైనింగ్​ మేట్​ సర్టిఫికేట్​ ఉండాలి. వయుస్సు 28 సంవత్సరాలకు మించకూడదు. జీతం రూ.25,070 నుంచి రూ.35,070 మధ్య ఉంటుంది.

అటెండెంట్ కమ్​ టెక్నీషియన్​ ట్రైనీ(హెచ్​ఎమ్​వీ), గ్రేడ్​- S1: 34 పోస్టులు
అభ్యర్థులు పదో తరగతి పాసై.. హెవీ మోటార్​ వెహికల్​ డ్రైవింగ్​ లైసెన్స్ కలిగి ఉండాలి. వయుస్సు 28 సంవత్సరాలకు మించకూడదు. జీతం రూ.25,070 నుంచి రూ.35,070 మధ్య ఉంటుంది.

మైనింగ్​ సిర్ధార్​, గ్రేడ్​- S1: 08 పోస్టులు
పదో తరగతితో పాటుగా డీజీఎమ్​ఎస్​, ఎమ్​ఎమ్​ఆర్​ అందించిన మైనింగ్​ సిర్ధార్​ సర్టిఫికేట్​ ఉండాలి. దీంతో పాటు ఫస్ట్​ ఎయిడ్​ సర్టిఫికేట్​ కూడా అవసరం. వయుస్సు 28 సంవత్సరాలకు మించకూడదు. జీతం రూ.25,070 నుంచి రూ.35,070 మధ్య ఉంటుంది.

అటెండెంట్​ కమ్​ టెక్నీషియన్​ ట్రైనీ-ఎలక్ట్రీషియన్​, గ్రేడ్​- S1: 50 పోస్టులు
పదో తరగతితో పాటుగా ఎలక్రికల్ విభాగంలో ఐటీఐ చేసి ఉండాలి. వయుస్సు 28 సంవత్సరాలకు మించకూడదు. జీతం రూ.25,070 నుంచి రూ.35,070 మధ్య ఉంటుంది.

దరఖాస్తు విధానం:
ఆన్​లైన్​లో మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తారు. సెయిల్​ అధికారిక వెబ్​సైట్​ ద్వారా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
ఆన్​లైన్​ చేయడానికి చివరి తేదీ:
ఏప్రిల్ 15లోగా అభ్యర్థులు సెయిల్​ అధికారిక వెబ్​సైట్​లో అప్లై చేసుకోవాలి. అభ్యుర్థులు తమకు అందుబాటులో ఉండే మొబైల్​ నంబర్​ను ఉపయోగించి రిజిస్టర్​ చేసుకోవాలి. పరీక్ష తేదీకి సంబంధించిన వివరాలు వారు రిజిస్టర్​ చేసిన చేసిన ఫోన్ నంబర్​కు మాత్రమే వస్తాయి.

ఎంపిక విధానం:
పోస్టును బట్టి రాత పరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్/ ట్రేడ్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
అడ్మిట్ కార్డ్/ కాల్ లెటర్ డౌన్‌లోడ్:
మే-జూన్ 2023.
రాత పరీక్ష/ ఇంటర్వ్యూ తేదీలు:
మే-జూన్ 2023 మధ్య ఉంటుంది .

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.