ETV Bharat / bharat

సిద్ధూ మూసేవాలా హత్య కేసు.. నిందితుడు సచిన్ బిష్ణోయ్​ను భారత్​కు రప్పించిన పోలీసులు

author img

By

Published : Aug 1, 2023, 12:29 PM IST

Updated : Aug 1, 2023, 3:22 PM IST

Sachin Bishnoi Azerbaijan : ప్రముఖ పంజాబీ సింగర్​ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో నిందితుడిగా ఉన్న.. సచిన్​ బిష్ణోయ్​ను అజర్ ​బైజాన్ నుంచి భారత్​కు దిల్లీ స్పెషల్ సెల్​ పోలీసులు రప్పించారు. అనంతరం ఇతడ్ని కోర్టులో హాజరుపరచనున్నారు. 2022 మే 29న సిద్ధూ మూసేవాల హత్యకు గురయ్యారు.

Aachin Bishnoi Extradited
సిద్ధూ మూసేవాలా హత్య కేసు

Sachin Bishnoi Extradited : పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో నిందితుడైన సచిన్ బిష్ణోయ్ అలియాస్ సచిన్ థాపన్‌ను భారత్​కు రప్పించినట్లు దిల్లీ పోలీసులు మంగళవారం తెలిపారు. ఈ కేసులో భాగంగా దిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అధికారులు అజర్‌బైజాన్ రాజధాని బాకు వెళ్లారని స్పెషల్​ సీపీ హెచ్​జీఎస్​ ధాలివాల్​ వివరాలు వెల్లడించారు. సచిన్ బిష్ణోయ్​ను కోర్టులో హాజరుపరిచి.. విచారణ నిమిత్తం రిమాండుకు అప్పగించాలని పోలీసులు అడగనున్నారు.

గతేడాది మే 29న సిద్ధూ మూసేవాలాను కొందరు దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ సచిన్​ బిష్ణోయ్​ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. అనంతరం సచిన్​ కోసం దిల్లీలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సచిన్ అజర్​బైజాన్​లో ఉన్నాడని తెలిసింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ సహాయంతో అతడిని భారత్​కు రప్పించేందుకు దిల్లీ పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు.

అయితే సిద్ధూ హత్య సూత్రధారిగా ఉన్న సచిన్​.. అతడు చనిపోకముందే ఇండియా నుంచి పారిపోయాడు. దీనికోసం సంగం విహార్​ ప్రాంతంలోని తిలక్​రాజ్​ టుటేజాగా పేరు మీద పాస్​పోర్ట్​ సృష్టించాడు. ఆ ఫేక్​ పాస్​పోర్టు తయారుచేసే ఐదుగురిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. అయితే, సిద్ధూ మూసేవాలా కేసుతో పాటు సచిన్​ బిష్ణోయ్​పై నమోదైన ఇతరు కేసులపై కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సచిన్ గతంలో దుబాయ్​కు చెందిన వ్యాపారి నుంచి రూ. 50 కోట్లు ఇవ్వాల్సిందిగా బెదిరించాడు.

Siddu Moose Wala Murder Case : దేశంలో ప్రముఖ గాయకుడిగా ఉన్న సిద్ధూ మూసేవాలా 2022 మే 29న హత్యకు గురయ్యారు. మాన్సా జిల్లాలో జీపులో వెళ్తుండగా దుండగులు ఆయనపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో సిద్ధూ మూసేవాలా మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ కేసులో గ్యాంగ్​స్టర్​ లారెన్స్​ బిష్ణోయ్​, కెనడాకు చెందిన మరో గ్యాంగ్​స్టర్​ గోల్డీ బ్రార్​ నిందితులుగా ఉన్నారు. సిద్ధూ.. 2021 డిసెంబర్​లో కాంగ్రెస్​ పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో పంజాబ్‌లోని మాన్సా నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తుపాకీలు, గ్యాంగ్‌స్టర్లు.. ఇలా హింసను ప్రేరేపించేవి ఎక్కువగా పాటల్లో చూపించే వివాదాస్పద గాయకుడిగా గతంలో ఆయన వార్తల్లో నిలిచారు. ఆయన పాడిన 'బంబిహ బోలే', '47' పాట అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. 'తేరీ మేరీ జోడీ', మోసా జఠ్‌.. వంటి చిత్రాల్లోనూ నటించారు. 2020 జులై కొవిడ్‌ లాక్‌డౌన్‌ విధించినప్పుడు ఫైరింగ్‌ రేంజ్‌లో ఏకే-47 రైఫిల్‌ని ఉపయోగించినందుకు ఆయనపై కేసు నమోదు నమోదైంది.

Last Updated :Aug 1, 2023, 3:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.