ETV Bharat / bharat

మూసేవాలా హత్య కేసు సూత్రధారి అరెస్ట్.. కాలిఫోర్నియాలో చిక్కిన గోల్డీ బ్రార్​!

author img

By

Published : Dec 2, 2022, 9:41 AM IST

Updated : Dec 2, 2022, 2:52 PM IST

సిద్దూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన సూత్రధారి గోల్డీ బ్రార్​ను పోలీసులు అరెస్టు చేశారు. అమెరికా కాలిఫోర్నియాలో అతడిని పట్టుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పంజాబ్​ లూధియానా కోర్టు పేలుళ్ల కేసు నిందితుడు, ఉగ్రవాది హర్​ప్రీత్​ సింగ్​ను అరెస్ట్ చేసింది జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్​ఐఏ).

sidhu moose wala murder
sidhu moose wala murder

ప్రముఖ పంజాబీ సింగర్​ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన సూత్రధారి గోల్డీ బ్రార్​ పోలీసులకు చిక్కాడు. అమెరికా కాలిఫోర్నియాలో ఉన్న అతడిని పట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే కాలిఫోర్నియా పోలీసులు మాత్రం ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. బ్రార్​ను నవంబర్​ 20కి ముందే అరెస్ట్ చేసి భారత ఇంటిలిజెన్స్ వర్గాలకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతకుముందు ఉన్న 2 కేసుల్లో అతడిపై రెడ్​ కార్నర్​ నోటీసులు జారీ అయ్యాయి. కెనడాకు పారిపోయిన గోల్డీ.. అనంతరం ఇద్దరు న్యాయవాదుల సహాయంతో అక్కడి నుంచి కాలిఫోర్నియాకు మకాం మార్చాడు.

'త్వరలోనే భారత్​కు తీసుకువస్తాం'
మూసేవాలా హత్య కేసులో ప్రధాన సూత్రధారి గోల్డీ బ్రార్​ను కచ్చితంగా భారత్​కు తీసుకుస్తామని స్పష్టం చేశారు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్​ మాన్​. కాలిఫోర్నియా పోలీసులు.. భారత ప్రభుత్వాన్ని, తమను సంప్రదించారని చెప్పారు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని.. అతి త్వరలోనే బ్రార్​ను తీసుకువస్తామన్నారు మాన్​.

లూథియానా పేలుళ్ల సూత్రధారి అరెస్ట్
మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్​, పంజాబ్​ లూధియానా కోర్టు పేలుళ్ల కేసు నిందితుడు హర్​ప్రీత్​ సింగ్​ను అరెస్ట్ చేసింది జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్​ఐఏ). మలేసియా నుంచి వచ్చిన అతడిని దిల్లీ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నట్లు ఎన్​ఐఏ శుక్రవారం వెల్లడించింది.

sidhu moose wala murder
పేలుళ్ల కేసు నిందితులు

లూథియానా పేలుళ్ల కేసు తొలుత స్థానిక పోలీస్ స్టేషన్​లో నమోదైంది. అనతరం జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ చేపట్టింది. పాకిస్థాన్​కు చెందిన ఉగ్రవాది, ప్రధాన సూత్రధారి లఖ్​బిర్​ సింగ్​​ రోడ్​తో హర్​ప్రీత్​ సింగ్​కు సంబంధాలున్నట్లు తేల్చింది. అతడి సూచనల మేరకే లూథియానా కోర్టులో పేలుళ్లకు కుట్ర పన్నినట్లు నిర్ధరించింది.
2021లో జరిగిన ఈ పేలుళ్లలో ఒకరు మరణించగా.. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్న హర్​ప్రీత్ సింగ్​పై రూ. 10 లక్షల రివార్డు ఉన్నట్లు ఎన్​ఐఏ తెలిపింది.

ఇవీ చదవండి: సిద్ధూ హత్య కేసు నిందితుల ఎన్​కౌంటర్​.. ఇద్దరు మృతి

బిష్ణోయ్​ తరలింపునకు రెండు బుల్లెట్​ ఫ్రూఫ్ కార్లు, 50 మంది పోలీసులు..

Last Updated :Dec 2, 2022, 2:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.