ETV Bharat / bharat

Raksha Bandhan Festival 2023 : రాఖీ పండుగ ఏ రోజు.. ఆగస్టు 30.. 31?

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 26, 2023, 2:48 PM IST

Updated : Aug 26, 2023, 5:14 PM IST

What Is Rakhi Festival: భారతీయులందరూ రక్షా బంధన్ వేడుకలను జరుపుకునే సమయం ఆసన్నమైంది. ఈ ఏడాది రాఖీ రోజున తోబుట్టువులంతా వారి అన్నాతముళ్లకు ఎలాంటి రాఖీలు కట్టాలనే విషయమై పలు రకాలుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే, ఈ ఏడాది రాఖీ పండుగ విషయంలో ఓ సమస్య వచ్చింది. ఏ రోజున జరుపుకోవాలి..? ఆగస్టు 30వ తేదీనా..? లేక 31 తేదీనా..? అన్నదే ఆ సందిగ్ధతకు కారణం. ఈ స్టోరీలో ఆ విషయాన్ని తెలుసుకుందాం.

Updates
Rakhi Festival

What Is Shuba Muhurtam And Rituals?: అన్నా-చెల్లెళ్లు, అక్కా-తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా జరుపుకొనే పండుగ రక్షా బంధన్‌. ఈ పండుగ రోజున అక్కాచెల్లెళ్లు.. వారి సోదరులు తమకు జీవితాంతం అన్ని విషయాల్లో రక్షణగా, అండగా నిలవాలని కోరుతూ.. సోదరుల మణికట్టు చుట్టూ రాఖీలను కడతారు. అయితే.. ఈ ఏడాది రాఖీ పండుగను ఏ రోజున జరుపుకోవాలనే విషయంపై కాస్త గందరగోళం నెలకొంది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెబుతున్నారు. మరి, ఏ రోజున రాఖీ పండుగ జరుపుకోవాలి..?, ఏ రోజున శుభ ముహూర్తం ఉంది..?, రాఖీ పండగ ప్రతి ఏడాది ఏ మాసంలో వస్తుంది..?, రాఖీ పండుగను ఎలా జరుపుకుంటారు..? అనే తదితర విషయాలను ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం.

రాఖీ పండుగ అంటే ఏమిటి..?
What is Rakhi Festival?: సాధారంగా ఈ పండుగను 'రాఖీ లేదా రక్షా బంధన్' అనే పేరుతో పిలుస్తారు. రక్షా బంధన్.. ప్రతి ఏడాది శ్రావణ మాసం పూర్ణిమ తిథి నాడు వస్తుంది. ఈ పండుగ రోజున సోదరీమణులు.. సోదరుల శ్రేయస్సు, దీర్ఘాయువు కోరుతూ.. వారి సోదరుల మణికట్టు చుట్టూ రాఖీలను కడతారు.

రాఖీ స్పెషల్ స్వీట్స్‌... తీయని వేడుక చేసుకుందాం!!
రాఖీ 2023 శుభ ముహూర్తం..
The Auspicious Moment Of Rakhi 2023: హిందూ పంచాంగం ప్రకారం.. ఈ ఏడాది రక్షా బంధన్ పండుగ ఆగస్టు 30న (బుధవారం) మొదలవుతోంది. అయితే.. ఆ రోజున భద్ర కాలం ఉంది. ఆగస్టు 30న రాత్రి 9:01 గంటలకు భద్రకాలం ముగుస్తుంది. అందువల్ల ఈ పండుగను ఆగస్ట్ 31న జరుపుకోవటం ఆమోదయోగ్యమైనదని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే శాస్త్రాల ప్రకారం.. భద్రకాలంలో సోదరీమణులు తమ సోదరుల చేతికి రాఖీ కట్టకూడదు. భద్ర కాలం ముగిసిన తర్వాతే రాఖీ కట్టాలి.

రక్షాబంధన్‌.. ఏ గిఫ్ట్‌ ఇవ్వాలో ఆలోచిస్తే.. ఇది మీకోసమే!!
రాఖీ ఇలా జరుపుకోవాలి..
Rakhi should be celebrated like this: రక్షా బంధన్ వేడుక పలు ఆచారాలను కలిగి ఉంటుంది. ఈ వేళ సోదరి తన సోదరుడికి ముందుగా హారతినిచ్చి.. అతని క్షేమం కోసం ప్రార్థనలు చేయాలి. ఆ తర్వాత సోదరి తన సోదరుడి మణికట్టుకు రాఖీని కట్టి, అతని నుదిటిపై తిలకం పెట్టాలి. ఆ తర్వాత అతనికి తీపి (స్వీట్లు) తినిపించాలి. ఆ తర్వాతే రాఖీ కట్టాలి. ఇందుకు ప్రతిగా.. సోదరులు తమ సోదరీమణుల నోరు తీపి చేస్తారు. దాంతోపాటు ఎవరి శక్తిమేరకు వారు.. బహుమతులు అందించి వారిపై ఉన్న ప్రేమను చాటుకుంటారు.

Rakshabandan: అన్నా చెల్లెలి అనుబంధం.. రక్షాబంధన్‌

Last Updated : Aug 26, 2023, 5:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.