ETV Bharat / bharat

'ఆ రాష్ట్రాల నుంచి కూడా మద్దతు కోరతాం'

author img

By

Published : Feb 19, 2021, 2:57 PM IST

Updated : Feb 19, 2021, 3:03 PM IST

ఉద్యమానికి కర్ణాటక, మహారాష్ట్ర రైతుల మద్దతు కూడా కోరతామని బీకేయూ నేత రాకేశ్ టికాయిత్​ తెలిపారు. ఈనెల 20న ఆ రాష్ట్రాల్లో పర్యటిస్తానని వెల్లడించారు. రైతులు పంట త్యాగానికి సిద్ధం అని పునరుద్ఘాటించారు.

rakesh
'ఆ రాష్ట్రాల నుంచి కూడా మద్దతు కోరతాం'

భారతీయ కిసాన్ యూనియన్ ప్రతినిధి రాకేశ్ టికాయిత్​ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు ఉద్యమం విస్తరణలో భాగంగా కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్ర రైతుల మద్దతు కూడగడతానని ప్రకటించారు. ఇందుకోసం ఈనెల 20న ఆ రాష్ట్రాల్లో పర్యటిస్తానని వెల్లడించారు. ప్రస్తుతం పంజాబ్​, హరియాణా, గుజరాత్, రాజస్థాన్ రైతులు నిరసనలో పాల్గొంటున్నారని పేర్కొన్నారు. హరియాణాలోని హిసార్​లో పర్యటిస్తున్న సందర్భంగా.. టికాయిత్​ శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేశారు.

"గత 70 ఏళ్లుగా రైతులు వ్యవసాయంలో నష్టపోతూనే ఉన్నారు. ఇప్పుడు ఓ పంటను త్యాగం చేయాలి. అందుకు వారు సిద్ధంగా ఉన్నారు. పంటకోతకు కూలీలను నియమించుకుంటారే కానీ ఉద్యమం నుంచి నిష్క్రమించరు."

-రాకేశ్​ టికాయిత్, బీకేయూ నేత

ఆ ఎన్నికలతో సంబంధం లేదు..

బంగాల్​ ఎన్నికల గురించి తమకు ఎలాంటి ఆలోచన లేదని టికాయిత్ స్పష్టం చేశారు. ఖాప్స్ సంఘంతో కేంద్ర మంత్రి అమిత్​ షా భేటీపై విమర్శలు చేశారు. ఆ వర్గానికి చెందిన ఎందరో రైతులు తమ ఉద్యమంలో పాల్గొంటున్నారని అన్నారు. హరియాణాలోని స్థానిక ఎన్నికలపై స్పందిస్తూ ఎలక్షన్లు క్రమబద్ధంగా జరగాలని పేర్కొన్నారు. నాయకులను ఎన్నుకోవడం ప్రజల ఇష్టం అని అన్నారు.

ఇదీ చదవండి : 'వ్యవసాయమూ చేస్తాం.. ఆందోళనలూ కొనసాగిస్తాం'

Last Updated : Feb 19, 2021, 3:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.