ETV Bharat / bharat

సాగు చట్టాలు, చమురు ధరలపై దద్దరిల్లిన పార్లమెంట్​

author img

By

Published : Mar 10, 2021, 3:10 PM IST

Parliament Budget sessions
సాగు చట్టాలు, చమురు ధరలపై దద్దరిల్లిన పార్లమెంట్​

పార్లమెంట్​ ఉభయ సభల్లో మూడో రోజూ వాయిదాల పర్వం కొనసాగింది. సాగు చట్టాలు, చమురు ధరలపై విపక్షాలు ఆందోళనకు దిగగా... గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఉభయ సభలు ఈనెల 15కు వాయిదా పడ్డాయి.

రెండో విడత బడ్జెట్​ సమావేశాల్లో భాగంగా మూడో రోజు సమావేశమైన పార్లమెంట్​.. విపక్షాల ఆందోళనలతో అట్టుడికింది. సాగు చట్టాలు, చమురు ధరల పెరుగుదలపై నిరసనలతో లోక్​సభ, రాజ్యసభల్లో వాయిదాల పర్వం కొనసాగింది.

లోక్​సభలో..

మూడో రోజు లోక్​సభ ప్రారంభమైన వెంటనే కాంగ్రెస్​ సహా విపక్ష సభ్యులు.. వివిధ సమస్యలపై చర్చించాలని నినాదాలు చేశారు. విపక్షాల ఆందోళన మధ్యే ప్రశ్నోత్తరాలను కొనసాగించారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్​ ఓం బిర్లా పలు మార్లు విజ్ఞప్తి చేసినా విపక్ష సభ్యులు వెనక్కి తగ్గలేదు. ఈ నేపథ్యంలో లోక్​సభను మధ్యాహ్నం 12:30 గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైనప్పటికీ ఆందోళనలు కొనసాగించారు విపక్ష నేతలు. దాంతో సభను మార్చి 15 వరకు వాయిదా వేశారు స్పీకర్​.

రాజ్యసభలోనూ..

రాజ్యసభలోనూ సాగు చట్టాలపై చర్చ చేపట్టాలను విపక్షాలు ఆందోళనకు దిగాయి. దాంతో తొలుత సభ 12 గంటల వరకు వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన కొద్ది సేపటికే 2 గంటల వరకు వాయిదా వేశారు. విపక్షాలు ఆందోళన విరమించకపోవటం వల్ల సభ ఈనెల 15 వరకు వాయిదా పడింది.

బిల్లుకు ఆమోదం

విపక్షాల ఆందోళనల మధ్యే 'మధ్యవర్తిత్వం, సయోధ్య (సవరణ) బిల్లు-2021'కు రాజ్యసభ ఆమోదం తెలిపింది.

ఇదీ చూడండి: కాంగ్రెస్​కు సీనియర్​ నేత చాకో రాజీనామా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.