ETV Bharat / bharat

సంప్రదాయానికే జై- రాజస్థాన్ అధికారం పీఠం బీజేపీదే- గహ్లోత్​ షాక్​ రాజీనామా!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 3, 2023, 8:00 AM IST

Updated : Dec 3, 2023, 5:23 PM IST

Rajasthan Assembly Election Result 2023 in Telugu : మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయానికే రాజస్థాన్ ఓటర్లు మరోసారి జై కొట్టారు. వరుసగా రెండోసారి ఒకే పార్టీకి అధికారం కట్టబెట్టేది లేదని తేల్చిచెప్పారు. హోరాహోరీగా సాగిన అసెంబ్లీ పోరులో చివరకు కాషాయ పార్టీనే విజయం వరించింది.

rajasthan assembly election result 2023
rajasthan assembly election result 2023

  • 05.22 PM
    "ప్రధాని మోదీ ఇచ్చిన హామీలపై రాజస్థాన్ ప్రజలు తమ విశ్వాసాన్ని చూపించారు. బీజేపీకి సంపూర్ణ విజయం ఇచ్చినందుకు మేము ప్రజలకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాం" అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీపీజోషి చెప్పారు.
  • 05.03 PM
    రాజస్థాన్​లో బీజేపీ విజయంపై ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​ స్పందించారు. "ప్రజల అభిప్రాయాన్ని అంగీకరిస్తున్నా. కొత్త ప్రభుత్వానికి నా శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తారని ఆశిస్తున్నా. ఏదేమైనా ఎన్నికల ఫలితాలు షాకింగ్​గా ఉన్నాయి" అని చెప్పారు.
  • 04.28 PM
    రాజస్థాన్​లో భారతీయ జనతా పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంది. మ్యాజిక్​ ఫిగర్​ 101ను సొంతం చేసుకుంది. మరో 15 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. కాంగ్రెస్​ 61 స్థానాల్లో గెలిచింది. మరోవైపు, జయపురలో మంగళవారం శాసనసభా పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నామని కాంగ్రెస్​ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్​ సింగ్​ దోతస్రా తెలిపారు.
  • 04.02 PM
    రాజస్థాన్ సీఎం అశోక్​ గహ్లోత్​.. ఆదివారం సాయంత్రం గవర్నర్‌కు తన రాజీనామాను అందజేయనున్నారు.
  • 02.47 PM
    రాజస్థాన్​లో బీజేపీ భారీ ఆధిక్యం కనబరుస్తున్న వేళ ఆ పార్టీ అగ్ర నాయకురాలు వసుంధర రాజే స్పందించారు. "ఈ విజయం వెనుక ప్రధాని మోదీ ఇచ్చిన 'సబ్కా సాథ్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్' మంత్రం ఉంది. అమిత్ షా వ్యూహం, నడ్డా సమర్థవంతమైన నాయకత్వం కూడా తోడైంది. ఇది ముఖ్యంగా పార్టీ కార్యకర్తల విజయం" అని తెలిపారు. వసుంధర రాజే 50వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
  • 02.27 PM
    రాజస్థాన్‌లో (మొత్తం 199 స్థానాలు) బీజేపీ 29 స్థానాల్లో విజయం కైవసం చేసుకుంది. మరో 84 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక, కాంగ్రెస్‌ 17 చోట్ల గెలిచి.. మరో 54 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇతరులు రెండు స్థానాల్లో గెలిచి.. మరో 13 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. మరోవైపు, కాంగ్రెస్​ అగ్రనేతలు అశోక్​ గహ్లోత్​, సచిన్​ పైలట్​ విజయం సాధించారు. బీజేపీ నేతలు వసుంధర రాజే, దియా కుమారి కూడా గెలుపొందారు.
  • 01.23 PM
    రాజస్థాన్​ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే 40వేల ఓట్లకుపైగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇప్పటికి బీజేపీ 7 స్థానాల్లో గెలవగా కాంగ్రెస్​ మూడు సీట్లు గెలుచుకుంది.
  • 12.38 PM
    రాజస్థాన్​లో బీజేపీ తన హవా కనబరుస్తోంది. మెజార్టీ మార్క్‌ను దాటి ఆధిక్యంలో దూసుకెళ్తోంది. రెండు సీట్లలో బీజేపీ విజయం సాధించింది.
  • 11.45 AM
    పుంజుకున్న సచిన్​ పైలట్​
    టోంక్ స్థానం నుంచి తొలుత వెనకబడ్డ కాంగ్రెస్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ క్రమంగా పుంజుకున్నారు. తన సమీప అభ్యర్థి, బీజేపీ నేత అజిత్ సింగ్ మెహతాపై ఆధిక్యంతో కొనసాగుతున్నారు.
  • 10.40AM
    వసుంధర, గహ్లోత్ ఆధిక్యం
    రాజస్థాన్​లో బీజేపీ దూసుకెళ్తోంది. ఝాల్​రాపాటన్ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న రాజస్థాన్ బీజేపీ అగ్రనేత వసుంధర రాజె ఆధిక్యం కనబరుస్తున్నారు. ప్రస్తుత సీఎం అశోక్ గహ్లోత్ సర్దార్​పుర్ స్థానం నుంచి లీడింగ్​లో ఉన్నారు. సచిన్ పైలట్ మాత్రం వెనుకంజలో ఉన్నారు.
  • 9.50AM
    రాజస్థాన్​లో బీజేపీ అధికారం చేజిక్కించుకునే దిశగా సాగుతోంది. లీడింగ్​లో ఉన్న స్థానాల సంఖ్య వంద దాటింది. కాంగ్రెస్ 60కి పైగా స్థానాలతో కొనసాగుతోంది. ఇతరులు సుమారు 20 చోట్ల ఆధిక్యం కనబరుస్తున్నారు.
  • 9.40AM
    రాజస్థాన్​లో హోరాహోరీ పోరు కొనసాగుతోంది. బీజేపీ మెజారిటీ స్థానాల్లో ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. కాంగ్రెస్ కాస్త వెనకంజలో ఉంది. 10కి పైగా స్థానాల్లో ఇతరులు ఆధిక్యంలో ఉన్నారు. టోంక్​లో కాంగ్రెస్ అభ్యర్థి, ఆ పార్టీ కీలక నేత సచిన్ పైలట్ వెనకంజలో ఉన్నారు. 4 వేలకు పైగా ఓట్లతో ఆయన వెనకబడ్డారు.
  • 9.00AM
    రాజస్థాన్​లో బీజేపీ 41 సీట్లలో ముందంజలో ఉంది. 32 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యం కనబరుస్తోంది. ఇతరులు నాలుగు చోట్ల లీడింగ్​లో ఉన్నారు.
  • 8.30AM
    రాజస్థాన్​లో బీజేపీ ఆధిక్యంలో దూసుకుపోతోంది. 13 స్థానాల్లో బీజేపీ, 9 సీట్లలో కాంగ్రెస్ లీడింగ్​లో ఉన్నాయి.
  • 8.00 AM

Rajasthan Assembly Election Result 2023 in Telugu : రాజస్థాన్‌లో బీజేపీకి అధికారమన్న ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు, ఐదేళ్లకోసారి అధికారం మార్పిడి సంప్రదాయాన్ని తిరగరాస్తామన్న కాంగ్రెస్‌ ధీమా మధ్య అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. గతనెల 25వ తేదీన ఓటింగ్ జరిగిన 199 స్థానాలకు ఉదయం 8 గంటలకు కౌంటింగ్​ మొదలైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కేంద్రం ఎన్నికల సంఘం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది.

ఓట్ల లెక్కింపు కేంద్రాలతోపాటు పరిసర ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్తును అధికారులు ఏర్పాటు చేశారు. ఓటింగ్‌ కేంద్రం వద్దకు ఇతరులు ఎవరూ రాకుండా, అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. 40 కంపెనీల కేంద్ర పారా మిలిటరీ బలగాలు, 36 కంపెనీల రాజస్థాన్‌ ఆర్మ్‌డ్‌ పోలీసులను మోహరించారు.

రాజస్థాన్‌లో ఐదేళ్లకోసారి అధికారం మారే సంప్రదాయం ఈసారి కూడా కొనసాగుతుందని ఎగ్జిట్‌ పోల్స్‌ చెప్పాయి. కానీ కాంగ్రెస్‌ మాత్రం గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తోంది. ఐదేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమను విజయతీరాలకు చేరుస్తాయని చెబుతోంది. మరోవైపు, ఈసారి తమదే అధికారమని బీజేపీ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు, ప్రభుత్వ వ్యతిరేకత, మోదీ ఛరిష్మా, అధికారం మారే సంప్రదాయం తమకు అనుకూలించే అంశాలని బీజేపీ నేతలు చెబుతున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
Last Updated : Dec 3, 2023, 5:23 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.