ETV Bharat / bharat

'భారత- చైనా సరిహద్దుల్లో ఉక్రెయిన్​ లాంటి పరిస్థితులు'

author img

By

Published : May 21, 2022, 2:52 PM IST

congress gandhi
రాహుల్ గాంధీ

Rahul gandhi uk trip: ఉక్రెయిన్​లో నెలకొన్న పరిస్థితుల్లాగే డోక్లాం మొదలైన భారత్​- చైనా సరిహద్దు ప్రాంతాలు కనిపిస్తున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కేంద్రం.. ఈ సమస్యపై చర్చించేందుకు అనుతిచించకపోవడమే కాక మాట్లాడే వారి గొంతు నొక్కుతోందని విమర్శించారు.

Rahul gandhi uk trip: భారత్​లోని ప్రజాస్వామ్యం ప్రపంచ ప్రజల మేలు కోసం ఉందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అన్నారు. స్వచ్ఛంద సంస్థ బ్రిడ్జ్‌ ఇండియా.. లండన్‌లో నిర్వహించిన ఐడియాస్‌ ఫర్‌ ఇండియా అనే ముఖాముఖి సదస్సులో రాహుల్‌ పాల్గొన్నారు. భారత్‌లో రెండు భిన్నమైన సిద్ధాంతాలు కొనసాగుతున్నాయని తెలిపారు. భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ అభివృద్ధి ఫలాలు కొందరికే అందాలని భావిస్తుండగా, అందరికీ సమాన అవకాశాలు ఉండాలని తాము కోరుకుంటున్నామని అన్నారు. భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పోరాటం చేస్తోందని తెలిపారు.

తూర్పు లద్దాఖ్‌లో చైనాతో ఘర్షణ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని రాహుల్‌ తప్పుపట్టారు. ఎల్​ఏసీ వద్ద భారత్‌-చైనా ఘర్షణలను రాహుల్‌ ఉక్రెయిన్‌-రష్యా విభేదాలతో పోల్చారు. ప్రాదేశిక సమగ్రతను రష్యా గుర్తించడం లేదనడం సహా అమెరికాతో స్నేహం పట్ల కోపంతో ఉక్రెయిన్‌పై రష్యా దాడులు చేస్తోందన్న రాహుల్‌.. చైనా కూడా భారత్‌ పట్ల ఈ రెండు అంశాల ఆధారంగానే కయ్యానికి దిగుతోందని అన్నారు. ఇంత జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై చర్చించడానికి అనుమతించకుండా మాట్లాడే వారి గొంతు నొక్కుతోందని రాహుల్‌ విమర్శించారు.

"ఉక్రెయిన్‌ ప్రాదేశిక సమగ్రతను అంగీకరించబోమని రష్యా ఆ దేశంతో అంటోంది. నాటో, అమెరికాలతో సంబంధాలను తెంచుకునేలా చేసేందుకు దాడి చేస్తున్నాం అని చెబుతోంది. ఉక్రెయిన్‌లో జరుగుతున్న దానికి, లద్దాఖ్‌, డోక్లాంలో జరుగుతున్న దానికి పోలికలను గమనించాలి. లద్దాఖ్‌, డోక్లాంలో చైనా దళాలు తిష్ఠ వేశాయి. భారతదేశ ప్రాదేశిక సమగ్రతను గుర్తించబోమని చైనా అంటోంది. అమెరికాతో భారత్‌ స్నేహాన్ని అంగీకరించబోమని పేర్కొంటోంది. దీనిపై చర్చకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించకపోవడమే సమస్య. భారత్‌లో చైనా దళాలు తిష్ఠ వేశాయి. తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్‌ సరస్సుపై చైనా పెద్ద వంతెనను నిర్మిస్తోంది. అక్కడ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తోంది. కాని దీనిపై కేంద్ర ప్రభుత్వం మాట్లాడరాడదని భావిస్తోంది. దీనిపై చర్చను అణచివేయాలని భావిస్తోంది."

-రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ నేత

ఇదీ చూడండి : అసోం గోస: నీటమునిగిన ఇళ్లు.. రైల్వే ట్రాక్​లే నివాసాలు.. రోజుకు ఒక్కపూటే భోజనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.