ఒక్కరోజు హడావుడేనా?: వ్యాక్సినేషన్​ రికార్డ్​పై రాహుల్​ సెటైర్

author img

By

Published : Sep 19, 2021, 4:04 PM IST

rahul gandhi

రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్​ జరుగుతోందన్న కేంద్రం ప్రకటనపై మండిపడ్డారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi News). గత పది రోజులుగా వ్యాక్సినేషన్​ ప్రక్రియకు సంబంధించిన గ్రాఫ్​ను ట్విట్టర్​లో షేర్ చేశారు.

వ్యాక్సినేషన్ ప్రక్రియ రికార్డు స్థాయిలో జరుగుతోందన్న కేంద్రం ప్రకటనపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi News). 'ఈవెంట్ ముగిసింది' అని ట్వీట్(Rahul Gandhi Tweet) చేశారు.

శుక్రవారం.. ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో(Vaccination Record India) వ్యాక్సినేషన్​ జరిగింది. ఒక్కరోజే 2. 5 కోట్ల మందికి టీకాలిచ్చారు. ఈ నేపథ్యంలో రాహుల్(Rahul Gandhi News Today) వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.

గత 10 రోజులుగా వ్యాక్సినేషన్​ ప్రక్రియ ఎలా ఉందో తెలిపే కొవిన్​ వెబ్​సైట్​ గ్రాఫ్​ను ట్విట్టర్​లో షేర్​ చేశారు రాహుల్ గాంధీ. రికార్డు పంపిణీ అనంతరం వ్యాక్సినేషన్​ ప్రక్రియ అంతలా పడిపోవడమేంటని ప్రశ్నించారు.

శుక్రవారంతో పోల్చితే శనివారం వ్యాక్సినేషన్​ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తారని భావించినట్లు రాహుల్ ట్వీట్​లో పేర్కొన్నారు. 2.1 కోట్ల డోసులు మళ్లీ ఎప్పుడిస్తారో అని వేచిచూస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ స్థాయిలో టీకాల పంపిణీ జరగడం చాలా అవసరమని గుర్తుచేశారు.

ఇదీ చదవండి:

Rahul Gandhi news: 'భాజపా-ఆర్​ఎస్​ఎస్​ నేతలు హిందువులే కాదు'

Vaccination In India: దేశంలో 80 కోట్లు దాటిన టీకా డోసుల పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.