ETV Bharat / bharat

Rahul Gandhi news: 'భాజపా-ఆర్​ఎస్​ఎస్​ నేతలు హిందువులే కాదు'

author img

By

Published : Sep 15, 2021, 6:13 PM IST

Congress leader rahul gandhi
'భాజపా-ఆర్​ఎస్​ఎస్​ నేతలు హిందువులే కాదు'

భాజపా-ఆర్​ఎస్​ఎస్​లపై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ(rahul gandhi news). వారు అసలు హిందువులే కాదని ఆరోపించారు. భాజపా-ఆర్​ఎస్​ఎస్​లు హిందూ పార్టీలుగా ప్రకటించుకున్నా.. గత 100-200 ఏళ్లలో హిందూ మతాన్ని సరిగ్గా అర్థం చేసుకుని దానిని పాటించింది ఒక్క మహాత్మ గాంధీనే అని అన్నారు.

భాజపా-ఆర్​ఎస్​ఎస్​ నేతలు నిజమైన హిందువులు కాదన్నారు (rahul gandhi news) కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. కేవలం స్వలాభాల కోసమే వారు హిందూ మతాన్ని ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. అఖిల భారత మహిళా కాంగ్రెస్​ను ప్రారంభించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

Congress leader rahul gandhi
మహిళా కాంగ్రెస్ ప్రారంభోత్సవంలో రాహుల్​ గాంధీ
Congress leader rahul gandhi
మహిళా కాంగ్రెస్​ లోగోను ఆవిష్కరిస్తున్న రాహుల్​
Congress leader rahul gandhi
మహిళా కాంగ్రెస్ ప్రారంభ​ కార్యక్రమంలో రాహుల్​ గాంధీ

"వీళ్లు ఏరకంగా హిందువులు? వీళ్లు నిజమైన హిందూవులు కారు. స్వలాభం కోసం హిందూ మతాన్ని ఉపయోగించుకునే దళారీలు. భాజపా, కాంగ్రెస్​ సిద్ధాంతాలు రెండు భిన్నమైనవి. ఏదో ఒక సిద్ధాంతం మాత్రమే దేశాన్ని పాలించగలదు. భాజపా-ఆర్​ఎస్​ఎస్​లు హిందూ పార్టీలుగా ప్రకటించుకున్నాయి. కానీ గత 100-200 ఏళ్లలో హిందూ మతాన్ని సరిగ్గా అర్థం చేసుకుని దానిని పాటించింది ఒక్క మహాత్మ గాంధీనే."

-కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ

ఒకరి లక్ష్యాలను చేరుకునేందుకు సాయపడే శక్తిని లక్ష్మీదేవిగా.. ప్రజలకు రక్షణగా నిలిచే శక్తిని దుర్గాదేవిగా రాహుల్​ అభివర్ణించారు. ఈ రెండు శక్తులను కాంగ్రెస్​ బలపరిస్తే.. భాజపా వీటిని నాశనం చేసిందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి : జైలులో ఆ పాట వినాలని ఖైదీ కోరిక.. చివరకు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.