ETV Bharat / bharat

మోదీ పాలనకు కొత్త అర్థం చెప్పిన రాహుల్

author img

By

Published : Dec 30, 2020, 11:28 AM IST

దేశంలో పెరుగుతోన్న నిరుద్యోగానికి కారణం మోదీ ప్రభుత్వమేమని కాంగ్రెస్​ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. రైతులనూ కేంద్రం మోసం చేస్తోందని ఆరోపించారు.

Rahul Gandhi slams Centre for rising unemployment
'ఇదేనా మోదీ ప్రభుత్వం అంటే!'

దేశంలో నిరుద్యోగం పెరగడానికి కారణం ఎన్డీఏ ప్రభుత్వమేనంటూ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. నవంబర్​లో వేల మంది ఉద్యోగాలు కోల్పోయారన్న వార్తను జతచేస్తూ ఈమేరకు ట్వీట్ చేశారు. కొందరు మిత్రుల కోసం రైతులకూ మోసం చేస్తున్నారని ఆరోపించారు.

  • युवा पर बेरोज़गारी की मार,
    जनता पर महंगाई का अत्याचार,
    किसान पर ‘मित्रों’ वाले क़ानूनों का वार,
    यही है मोदी सरकार। pic.twitter.com/WbmI30Ru0B

    — Rahul Gandhi (@RahulGandhi) December 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"యువత ఉద్యోగాలు కోల్పోతోంది. ప్రజలకు అర్థిక ఇబ్బందులు తలెత్తాయి. 'మిత్ర చట్టం' ద్వారా రైతులకూ ఒరిగిందేమీలేదు. మోదీ ప్రభుత్వం అంటే ఇదే."

- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత.

సాగు చట్టాలను రద్దు చేయాలని కాంగ్రెస్​ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. రైతులకు ఆసరాగా నిలవకపోతే ఆత్మ నిర్భర్​ భారత్​ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు.

ఇదీ చదవండి:రామాలయ నిర్మాణానికి ఐఐటీల సహకారం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.