ETV Bharat / bharat

'అప్పుడు 24 గంటల్లోనే రాహుల్​పై అనర్హత.. ఇప్పుడు సభ్యత్వం పునరుద్ధరణకు ఎంత సమయం?'

author img

By

Published : Aug 4, 2023, 7:31 PM IST

Rahul Gandhi Press Conference Today : నేరపూరిత పరువు నష్టం కేసులో తనను దోషిగా తేల్చడంపై సుప్రీంకోర్టు స్టే విధించిన నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎప్పటికైనా సత్యానిదే విజయమని పేర్కొన్నారు. మరోవైపు, రాహుల్​కు శిక్ష పడిన 24 గంటల్లోపే అనర్హత వేశారని.. ఇప్పుడు లోక్​సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించేందుకు ఎంత సమయం తీసుకుంటారో చూస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖఅయానించారు.

rahul-gandhi-press-conference-today
rahul-gandhi-press-conference-today

Rahul Gandhi Press Conference Today : నిజం ఈ రోజు కాకపోయినా ఎప్పటికైనా విజయం సాధిస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. నేరపూరిత పరువు నష్టం కేసులో తనను దోషిగా తేల్చడంపై సుప్రీంకోర్టు స్టే విధించిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్​లో మాట్లాడిన ఆయన.. తనకు అండగా ఉన్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తానేం చేయాలో, తాను ఏ దారిలో వెళ్లాలో అనే విషయాలపై స్పష్టత ఉందని చెప్పారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో రాహుల్​తో కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్​లో పాల్గొన్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. సుప్రీం నిర్ణయంతో తాను సంతోషంగా ఉన్నానని చెప్పారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం గెలిచిందని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీకి శిక్షపడ్డ 24 గంటల్లోపే అనర్హత వేటు వేశారని.. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో దాన్ని తొలగించేందుకు ఎంత సమయం పడుతుందో చూస్తామని వ్యాఖ్యానించారు.

"రాజ్యాంగం ఇంకా బతికే ఉందనేందుకు ఈ నిర్ణయం ఉదాహరణ. ఇది సాధారణ ప్రజల విజయం. ఇది రాహుల్ గాంధీ ఒక్కరి గెలుపు కాదు. దేశ ప్రజలు, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువల గెలుపు ఇది. సత్యం కోసం, దేశ ప్రయోజనాల కోసం, యువత కోసం, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పోరాడుతున్న వ్యక్తికి.. ప్రజల ప్రార్థనల ఫలితం లభించింది. అందుకే ఇది ప్రజా విజయం. రాహుల్​ను అనర్హుడిగా తేల్చే ప్రక్రియ 24 గంటల్లోపే పూర్తైంది. ఇప్పుడు ఎన్ని గంటల్లో ఆయన లోక్​సభ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తారో చూద్దాం."
-మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు

INDIA Alliance on Rahul Gandhi Supreme Court Order : రాహుల్‌ గాంధీకి విధించిన జైలుశిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించటం పట్ల కాంగ్రెస్‌, విపక్ష కూటమి ఇండియా హర్షం వ్యక్తం చేసింది. ఈ తీర్పు బీజేపీకి, ఆ పార్టీ నేతలకు గుణపాఠం కావాలని హస్తం పార్టీ పేర్కొంది. ద్వేషంపై ప్రేమ సాధించిన విజయమిది అని హస్తం పార్టీ అభివర్ణించింది.

  • #WATCH | Kerala | Congress workers in Wayanad carry out a march in support after the Supreme Court stayed the conviction of Congress leader Rahul Gandhi in 'Modi' surname defamation case today.

    He was elected as an MP from the Wayanad Parliamentary constituency in the 2019… pic.twitter.com/W5oTW6WE15

    — ANI (@ANI) August 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
రాహుల్‌గాంధీ లోక్‌సభ సభ్యత్వ పునరుద్ధరణకు మార్గం ఏర్పడిందని బంగాల్‌ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఈ వార్త తనకు ఎంతో సంతోషం కలిగించిందని మమత ట్వీట్‌ చేశారు. మాతృభూమి కోసం పోరాడి గెలవాలన్న ప్రతిపక్ష కూటమి ఇండియా సంకల్పాన్ని ఈ తీర్పు మరింత బలోపేతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది న్యాయవ్యవస్థ విజయంగా మమత బెనర్జీ అభివర్ణించారు.

రాహుల్​కు కేజ్రీ అభినందన
సుప్రీంకోర్టు తీర్పు ప్రజాస్వామ్యంపై, న్యాయవ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని బలోపేతం చేస్తుందని దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. అసంబద్ధమైన పరువునష్టం కేసులో సుప్రీంకోర్టు ఈ నిర్ణయం ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. రాహుల్​కు, వయనాడ్ నియోజకవర్గ ప్రజలకు అభినందనలు తెలియజేశారు.

ఆర్డర్ కాపీ వస్తేనే..
కాగా, రాహుల్​ సభ్యత్వాన్ని పునరుద్ధరించాలంటే సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీని లోక్​సభ సెక్రెటేరియట్​కు సమర్పించాల్సి ఉంటుందని మాజీ లోక్​సభ కార్యదర్శి జనరల్ పీడీటీ ఆచారి పేర్కొన్నారు. ఆర్డర్ కాపీని పరిశీలించిన తర్వాత.. అనర్హతను వెనక్కి తీసుకునే ప్రక్రియను లోక్​సభ సెక్రెటేరియట్ ప్రారంభిస్తుందని చెప్పారు.

'రాహుల్​కు పెళ్లి చేద్దాం.. మంచి అమ్మాయిని చూడండి'.. మహిళా రైతులతో సోనియా గాంధీ

2024 ఎన్నికలే టార్గెట్​.. 'భారత్ జోడో యాత్ర-2.0'కు రాహుల్ రెడీ.. ఆ తేదీ నుంచే స్టార్ట్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.