ETV Bharat / bharat

Rahul Gandhi On Adani : 'కరెంట్​ బిల్లులు పెరగడానికి అదానీయే కారణం.. ఆయనకు ప్రభుత్వం మద్దతు ఉంది'

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 18, 2023, 12:47 PM IST

Rahul Gandhi On Adani
Rahul Gandhi On Adani

Rahul Gandhi On Adani : అదానీ గ్రూప్​పై కేంద్ర ప్రభుత్వం ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. దేశంలో విద్యుత్తు బిల్లుల పెరుగుదలకు అదానీయే కారణమని ఆరోపించారు.

Rahul Gandhi On Adani : దేశంలో విద్యుత్తు బిల్లుల పెరుగుదలకు అదానీయే కారణమని కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆరోపించారు. విద్యుత్తు బిల్లుల రూపంలో ఇప్పటివరకు రూ.12 వేల కోట్లు ప్రజల నుంచి దోచుకున్నారని విమర్శించారు. విదేశాల నుంచి కొనుగోలు చేసిన బొగ్గు ధరను రెట్టింపు చేయటం వల్ల.. విద్యుత్తు బిల్లులు పెరుగుతున్నాయని రాహుల్‌ పేర్కొన్నారు. దిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో మాట్లాడిన రాహుల్ గాంధీ.. బొగ్గు ధరల పెరుగుదలపై లండన్‌కు చెందిన ఫైనాన్సియల్‌ టైమ్స్‌లో వచ్చిన కథనాన్ని ప్రస్తావించారు.

  • #WATCH | When asked why he is not raising questions about Sharad Pawar's meeting with Adani despite INDIA alliance united on Adani issue, Congress MP Rahul Gandhi says, " I have not asked Sharad Pawar, he is not the Prime Minister of India. Sharad Pawar is not protecting Adani,… pic.twitter.com/Yak56drO0g

    — ANI (@ANI) October 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"అదానీ ఇండోనేషియాలో బొగ్గు కొనుగోలు చేస్తారు. ఆ బొగ్గు భారత్‌ చేరేసరికి ధర రెట్టింపు అవుతుంది. ఈ విధంగా దాదాపు రూ.12 వేల కోట్లు దేశ ప్రజల నుంచి అదానీ దోచుకున్నారు. బొగ్గు రేటు పెంచటం వల్ల విద్యుత్తు బిల్లులు పెరుగుతున్నాయి. దీనికి కారణం అదానీ అని తేలింది. దేశ ప్రజలు ఇది అర్థం చేసుకోవాలి. మీ విద్యుత్తు బిల్లులు పెరుగుతున్నాయంటే అందుకు కారణం అదానీ. రూ.12 వేల కోట్లు మీ నుంచి అదానీ తీసుకున్నారు. ఈ మాట నేను మాత్రమే కాదు లండన్‌కు చెందిన ఫైనాన్సియల్‌ టైమ్స్‌ చెబుతోంది. ఆశ్చర్యకరమైన విషయమేమంటే ఈ కథనంపై దేశంలోని ఒక్క మీడియా కూడా ప్రశ్నించదు."

--రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు

Rahul Gandhi On Modi : అదానీ గ్రూప్​పై ప్రభుత్వం ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అదానీ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వహిస్తూ.. ఆయనను కాపాడుతున్నారని ఆరోపించారు. అదానీకి.. ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు ఉందని.. ఆయన వెనుక ఉన్న శక్తి ఎవరనేది ప్రతి ఒక్కరికి తెలుసని చెప్పారు. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన వెంటనే.. అదానీ గ్రూపులపై విచారణకు ఆదేశించనున్నట్లు తెలిపారు. అదానీ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ.. తన స్పష్టమైన వైఖరిని చెప్పాలని డిమాండ్ చేశారు. దేశప్రజల అభివృద్ధికి కాంగ్రెస్ ఎప్పడు కట్టుబడి ఉంటుందని తెలిపారు. ఇప్పటికే కర్ణాటకలోని తమ ప్రభుత్వం విద్యుత్​ సబ్సిడీని ఇస్తుందని.. మధ్యప్రదేశ్​లో అధికారంలో వచ్చాక అక్కడ కూడా అమలు చేస్తామన్నారు.

  • #WATCH | Delhi: Congress MP Rahul Gandhi says, "...Adani buys coal in Indonesia and by the time the coal arrives in India, its price doubles...Our electricity prices are going up...He (Adani) takes money from the poorest people...This story would bring down any government. This… https://t.co/8cvBLWNdNc pic.twitter.com/ROuI1UvOk2

    — ANI (@ANI) October 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Rahul Gandhi Mizoram : 'మణిపుర్​ అల్లర్ల కంటే ఇజ్రాయెల్ యుద్ధంపైనే మోదీకి ఎక్కువ ఆసక్తి'

Rahul Gandhi On Caste Census : దేశవ్యాప్త కులగణనకు కాంగ్రెస్ డిమాండ్​.. ఎన్నికల్లో ఇదే ప్రధాన అస్త్రం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.