ETV Bharat / bharat

Rahul Gandhi Mizoram : 'మణిపుర్​ అల్లర్ల కంటే ఇజ్రాయెల్ యుద్ధంపైనే మోదీకి ఎక్కువ ఆసక్తి'

author img

By PTI

Published : Oct 16, 2023, 2:26 PM IST

Updated : Oct 16, 2023, 3:14 PM IST

Rahul Gandhi Mizoram
Rahul Gandhi Mizoram

Rahul Gandhi Mizoram : ఇటీవల మణిపుర్​లో చెలరేగిన జాతి హింస అల్లర్ల కంటే ఇజ్రాయెల్​లో జరుగుతున్న యుద్ధంపైనే ప్రధాని మోదీ ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారని కాంగ్రెస్​ ఎంపీ రాహుల గాంధీ మండిపడ్డారు. త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్న మిజోరాంలో ఆయన సోమవారం పాదయాత్ర చేశారు.

Rahul Gandhi Mizoram : ప్రధాని నరేంద్ర మోదీ మణిపుర్​లో జరిగిన అల్లర్ల కంటే ఇజ్రాయెల్​లో జరుగుతున్న యుద్ధంపైనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారని కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ అన్నారు. త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్న మిజోరాం రాజధాని ఐజ్వాల్​లో సోమవారం పాదయాత్ర నిర్వహించిన ఆయన.. ఈ వ్యాఖ్యలు చేశారు.

  • #WATCH | Congress MP Rahul Gandhi in Mizoram's Aizawal

    "Some months ago, I went to Manipur. The idea of Manipur has been destroyed by the BJP. It is no longer a state, but two states. People have been murdered, women have been molested and babies have been killed but the PM… pic.twitter.com/ngImqPaEap

    — ANI (@ANI) October 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'మణిపుర్​ ఒక్క రాష్ట్రం కాదు..'
రెండు రోజుల మిజోరాం పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం రాజధాని ఐజ్వాల్​కు చేరుకున్నారు రాహుల్​ గాంధీ. ఈ సందర్భంగా పాదయాత్ర నిర్వహించిన ఆయన కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ పర్యటనలో భాగంగా ఐజ్వాల్​లోని చన్మారి జంక్షన్ నుంచి రాహుల్​ పాదయాత్ర చేపట్టారు. ఈ యాత్రలో రాహుల్​కు ప్రజలు పెద్దఎత్తున వచ్చి, స్వాగతం పలికారు. రాజ్‌భవన్‌ వరకు దాదాపు 2 కిలోమీటర్లు సాగిన ఈ పాదయాత్రలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రజలు రాహుల్​కు షేక్​ హ్యాండ్​ ఇస్తూ సెల్ఫీలు దిగారు. పాదయాత్ర ముగిసిన అనంతరం రాజ్‌భవన్‌ సమీపంలో ఏర్పాటు చేసిన సభలో రాహుల్​ మాట్లాడారు. ఈ సందర్భంగా 'ఒక్క రాష్ట్రంగా ఉన్న పక్క రాష్ట్రం మణిపుర్​ను రెండు రాష్ట్రాలుగా విభజించారు' అని ఆయన మండిపడ్డారు.

'బీజేపీ భారత్​లోని వివిధ వర్గాలు, మతాలు, భాషలపై దాడి చేస్తోంది. వారు దేశంలో ద్వేషం, హింసను ప్రేరేపిస్తున్నారు. అహంకారం, అవగాహన లేమితో పాలనను కొనసాగిస్తున్నారు. ఇది భారతదేశ ఆలోచనలకు పూర్తి విరుద్ధం' అని కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

"1986లో శాంతి ఒప్పందంపై సంతకం చేయడం వల్లే తిరుగుబావుట నినాదం ఎత్తుకున్న ఈశాన్య రాష్ట్రమైన మిజోరాంలో కాంగ్రెస్ శాంతిని నెలకొల్పింది. రాష్ట్రంలో శాంతిభద్రతలను గాడిన పెట్టగలిగాము."

- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ ఎంపీ

39 మందితో కాంగ్రెస్​ జాబితా..
Mizoram Congress Candidate List 2023 : అధికార మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్ఎఫ్), ప్రధాన ప్రతిపక్ష పార్టీ జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్(జెడ్​పీఎం) ఇప్పటికే మొత్తం 40 స్థానాలకు తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించాయి. అయితే అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని రాహుల్​ గాంధీ ప్రకటించిన నేపథ్యంలోనే సోమవారం 39 మంది పేర్లతో కూడిన కాంగ్రెస్​ అభ్యర్థుల తుది జాబితాను ఆయన విడుదల చేశారు. మరో రెండు మూడు రోజుల్లో బీజేపీ కూడా తమ అభ్యర్థులను ప్రకటించనుంది.

ఓట్ల లెక్కింపు​ తేదీ మార్చండి..
2011 జనాభా లెక్కల ప్రకారం మిజోరాంలో దాదాపు 87 శాతం వరకు క్రైస్తవులు ఉన్నారు. అయితే ఓట్ల లెక్కింపు తేదీ అయిన డిసెంబర్​ 7 ఆదివారం తమకు పవిత్రమైన రోజని.. దీంతో కౌంటింగ్​ తేదీని రీషెడ్యూల్​ చేయాలంటూ రాష్ట్రంలోని పలు రాజకీయ పార్టీలు, చర్చిలు, పౌర సమాజ సంస్థలు, విద్యార్థి సంఘాలు భారత ఎన్నికల సంఘాన్ని కోరాయి. కాగా, 40 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న మిజోరాంలో నవంబర్​ 7న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్​ 3న ఫలితాలు వెలువడనున్నాయి.

Karnataka IT Raid Today : ఆ కాంట్రాక్టర్‌ ఫ్యామిలీ ఇళ్లల్లో ఐటీ సోదాలు.. రూ.50కోట్లు సీజ్‌!

UCIL Apprentice Jobs 2023 : ఐటీఐ అర్హతతో.. UCILలో 243 అప్రెంటీస్ పోస్టులు​.. అప్లై చేసుకోండిలా!

Last Updated :Oct 16, 2023, 3:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.