ETV Bharat / bharat

మాట నిలబెట్టుకున్న రాహుల్​.. విద్యార్థులను హెలికాప్టర్​లో తిప్పి..

author img

By

Published : Dec 10, 2022, 12:49 PM IST

Updated : Dec 10, 2022, 1:13 PM IST

rahul-gandhi-fulfilled-his-promise
rahul-gandhi-fulfilled-his-promise

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఆయన చేసిన ఆ ఒక్క పనితో చిన్నారుల ముఖంలో చిరునవ్వులు విరిసాయి. ఇంతకీ ఆయన ఏం చేశారంటే?

ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. హెలికాప్టర్​లో తిప్పుతానని పిల్లలకు మాట ఇవ్వగా.. ఇప్పడు దానిని నిజం చేశారు రాహుల్​. అన్నట్లుగానే శనివారం ఆ విద్యార్థులను ఆకాశంలో తిప్పాడు.

ఇదీ జరిగింది: భారత్​ జోడో యాత్రలో భాగంగా నవంబర్​ 29న మధ్యప్రదేశ్​లోని ఉజ్జయినికి చేరిన రాహుల్​ అక్కడున్న ఓ ప్రభుత్వ పాఠశాల చిన్నారులతో ముచ్చటించారు. వారిలో కొంత మందిని తమ జీవిత లక్ష్యాలను అడగగా వారు పైలట్​ అవ్వాలనుకుంటున్నామని చెప్పారు. అయితే మీరెప్పుడైనా విమానంలో ప్రయాణించారా అని రాహుల్​ అడగగా.. వారు లేదని సమాధానం ఇచ్చారు. దీంతో మిమ్మల్ని త్వరలోనే హెలికాప్టర్​లో తిప్పుతానని మాట ఇచ్చారు రాహుల్​.

rahul-gandhi-fulfilled-his-promise
హెలికాప్టర్​లో విద్యార్థులు
rahul-gandhi-fulfilled-his-promise
హెలికాప్టర్​ వద్ద విద్యార్థులు

అలా బుధవారం 10,11వ తరగతి విద్యార్థులను పిలిపించిన రాహుల్​ వారితో పాటు ప్రిస్సిపల్​ను సైతం హెలికాప్టర్​లో తిప్పారు. దాదాపు 30 నిమిషాల పాటు వారందరిని తిప్పించారు.. ఆ సమయంలో హెలికాప్టర్​ గురించి చిన్నారులకు వివరించారు. బుధవారం జరిగిన ఈ హెలికాప్టర్​ ప్రయాణాన్ని తాము ఎన్నడు మరచిపోమని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హెలికాప్టర్​ రైడ్ ​నుంచి తిరిగి వచ్చాక చిన్నారులు రాహుల్​కు ఓ పేయింటింగ్​ను బహుకరించారు.

rahul-gandhi-fulfilled-his-promise
హెలికాప్టర్​ వద్ద విద్యార్థులతో రాహుల్​ గాంధీ
rahul-gandhi-fulfilled-his-promise
విద్యార్థులు బహుకరించిన చిత్రాలతో రాహుల్​
Last Updated :Dec 10, 2022, 1:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.