ETV Bharat / bharat

'ప్రమాణస్వీకారం రాజ్​భవన్​లో కాదు.. భగత్​ సింగ్​ ఊరిలో..'

author img

By

Published : Mar 10, 2022, 3:33 PM IST

Punjab elections
భగవంత్ మాన్, కేజ్రీవాల్​

Punjab Election Results: పంజాబ్​ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో మాట్లాడిన ఆప్​ జాతీయ కన్వీనర్​ అరవింద్​ కేజ్రీవాల్​.. పంజాబ్​ ప్రజల విప్లవానికి అభినందనలు అని ట్వీట్​ చేశారు. మరోవైపు ప్రమాణాస్వీకారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్​ మాన్​.

Punjab Election Results: పంజాబ్​ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్​ ఆద్మీ పార్టీ(ఆప్​) భారీ విజయం సాధించింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆప్​ జాతీయ కన్వీనర్​ అరవింద్​ కేజ్రీవాల్​​.. రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పంజాబ్​ ప్రజల విప్లవానికి అభినందనలంటూ ట్వీట్ చేశారు.

  • इस इंक़लाब के लिए पंजाब के लोगों को बहुत-बहुत बधाई। pic.twitter.com/BIJqv8OnGa

    — Arvind Kejriwal (@ArvindKejriwal) March 10, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"పంజాబ్ ప్రజల విప్లవానికి మనస్ఫూర్తిగా అభినందనలు" అని దిల్లీ సీఎం కేజ్రీవాల్​ హిందీలో ట్వీట్​ చేశారు. ఈ ట్వీట్‌లో ఆప్​ సీఎం అభ్యర్థి ఎంపీ భగవంత్​ మాన్‌తో కలిసి ఉన్న చిత్రాన్ని కూడా కేజ్రీవాల్​ పోస్ట్ చేశారు. అందులో ఇద్దరు నేతలు విజయ చిహ్నంతో స్టిల్ ఇచ్చారు.

Kejriwal
హనుమాన్​ ఆలయంలో కేజ్రీవాల్​

పంజాబ్​లో తమ పార్టీ గెలిపొందిన నేపథ్యంలో దిల్లీలో హనుమాన్​ ఆలయాన్ని దర్శించుకున్నారు అరవింద్​ కేజ్రీవాల్​. ఈ సమయంలో మనీశ్​ సిసొడియా, సత్యేంద్ర జైన్​లు కేజ్రీవాల్​ వెంట ఉన్నారు.

'ప్రమాణ స్వీకారం రాజ్​భవన్​లో చేయను'

తమ పార్టీ గెలిచిన తరుణంలో ప్రమాస్వీకారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పంజాబ్​ ఆప్​ సీఎం అభ్యర్థి భగవంత్​ మాన్​. రాజ్‌భవన్‌లో కాకుండా భగత్​ సింగ్​ పూర్వీకుల గ్రామమైన ఖట్కర్‌కలన్‌లో పంజాబ్ సీఎంగా ప్రమాణం చేస్తానని పేర్కొన్నారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం.. పాఠశాలలు, వైద్య ఆరోగ్య, క్రీడా మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తుందన్నారు. పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.

Bhagwant Mann
భావోద్వేగానికి గురైన భగవంత్​ మాన్​, ఆయన తల్లి హర్పాన్​ కౌర్​

ధురిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన మాన్​.. ఇకపై ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం ఫొటోలకు బదులు భగత్​ సింగ్​, అంబేడ్కర్​ ఫొటోలు పెట్టుకోవచ్చన్నారు. పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులకు అభినందనలు తెలిపారు. ఆ సందర్భంలోనే మాన్​ తల్లి హర్పాల్​ కౌర్ భావోద్వేగానికి గురయ్యారు. ఆ క్షణంలో కుమారుడి ఒడిలో వాలిపోయారు హర్పాల్ కౌర్​.

Bhagwant Mann
భావోద్వేగానికి గురైన భగవంత్​ మాన్​, ఆయన తల్లి హర్పాన్​ కౌర్​

'ఇకపై పంజాబ్​ను ఆ పేరుతో పిలవరు'

మాదక ద్రవ్యాల ప్రభావం ఎక్కువగా ఉన్న పంజాబ్​ను 'ఉడ్తా పంజాబ్​గా' పిలిచే రోజులు పోతాయన్నారు పంజాబ్​ ఆప్​ పార్టీ ఇన్​ఛార్జి​ రాఘవ్​ చద్ధా. ఆ పేరు ఇకపై 'ఉఠ్​తా​ పంజాబ్​'గా (పంజాబ్​ ప్రజలు మేల్కొంటారు) మారుతుందన్నారు. కేజ్రీవాల్​ను కొందరు ఉగ్రవాదిగా పిలిచారని.. అయితే అది తప్పని ప్రజలు నిరూపించారని రాఘవ్​ వ్యాఖ్యానించారు.

'ప్రజల తీర్పును అంగీస్తున్నాం'

పంజాబ్​ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్​.. ఆప్​కు కనీస పోటీ ఇవ్వలేకపోయింది. ఈ నేపథ్యంలో ప్రజల తీర్పును కాంగ్రెస్​ సవినయంగా అంగీకరిస్తున్నట్లు తెలిపారు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్​ నవజ్యోత్ సిద్ధూ.

అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్​ ఆద్మీ పార్టీకి శుభాకాంక్షలు తెలిపారు. "ప్రజల తీర్పే భగవంతుని తీర్పు. పంజాబ్ ప్రజల తీర్పును వినయంగా అంగీకరిస్తాం. ఆప్‌కు అభినందనలు" అని సిద్ధూ ట్వీట్‌ చేశారు.

ఇదీ చూడండి: పాపం కాంగ్రెస్​.. యూపీలో 'సింగిల్​ సీటు' కోసం ఆపసోపాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.