ETV Bharat / bharat

తల్లి హీరాబెన్​కు ప్రధాని మోదీ పాదాభివందనం

author img

By

Published : Mar 12, 2022, 7:31 AM IST

PM Meets His Mother: ప్రధాని నరేంద్ర మోదీ తన స్వరాష్ట్రమైన గుజరాత్‌ పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా తన తల్లి హీరాబెన్‌ను కలిశారు.

PM Meets His Mother
మోదీ

PM Meets His Mother: ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు చోట్ల భాజపా అఖండ విజయం సాధించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ తన స్వరాష్ట్రమైన గుజరాత్‌ పర్యటన చేపట్టారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా అహ్మదాబాద్‌కు చేరుకున్న మోదీ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తన తల్లి హీరాబెన్‌ను కలిశారు. శుక్రవారం రాత్రి 9 గంటలకు గాంధీనగర్‌ శివారులోని రైసిన్‌లో తన సోదరుడు పంకజ్‌ మోదీ నివాసానికి వెళ్లారు. అక్కడ ఉన్న తన మాతృమూర్తికి పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం తల్లితో కలిసి భోజనం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను భాజపా విడుదల చేసింది.

PM Meets His Mother
అమ్మ యోగక్షేమాల గురించి తెలుసుకున్న మోదీ
PM Meets His Mother
అమ్మతో భోజనం చేస్తూ..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.