ETV Bharat / bharat

Draupadi Murmu liked Marathi dishes : షిర్డీ ఆలయంలో మరాఠా వంటకాలకు రాష్ట్రపతి ఫిదా.. చెఫ్​లకు దిల్లీ నుంచి ఆహ్వానం

author img

By

Published : Jul 28, 2023, 8:43 PM IST

Draupadi Murmu
Draupadi Murmu

Shirdi Sai Temple Prasadam Menu : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము షిర్డీ ఆలయంలోని సాయి ప్రసాదాలయంలో చేసే మరాఠా వంటకాలకు ఫిదా అయిపోయారు. ఈ నెల 7న షిర్డీ సాయినాథుని సందర్శించిన రాష్ట్రపతి.. అక్కడ ఏర్పాటు చేసిన వంటకాలను రుచి చూశారు. అనంతరం అవి అమితంగా నచ్చడంతో ఆ వంటకాలను తయారు చేసే ఇద్దరు చెఫ్​లకు దిల్లీ రాష్ట్రపతి కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. రాష్ట్రపతిని అంతగా ఫిదా చేసిన ఆ మరాఠా రుచులు ఏంటో ఇప్పుడు చూద్దాం.

President office invited Shirdi temple chefs : భారత రాష్టపతి.. అధికార హోదాలో దేశంలో పలు ప్రదేశాలను చుట్టి వస్తుంటారు. అలాగే విభిన్న ప్రాంతాలు, అక్కడ వాతావరణ పరిస్థితులు, సంస్కృతి సంప్రదాయలను గౌరవిస్తుంటారు. అలాగే ఆయా ప్రాంతాల్లో దర్శనీయా స్థలాలను సందర్శిస్తుంటారు. ఈ విధంగానే ఈ నెల 7న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మహారాష్ట్రలోని షిర్డీ సాయి మందిరానికి వెళ్లారు. సాయి దర్శనానంతరం.. అక్కడి ఆలయ అధికారులు సాయిబాబా సంస్థాన్‌లోని సాయి ప్రసాదాలయంలో రాష్ట్రపతి కోసం ప్రత్యేకంగా తయారు చేసిన మరాఠా వంటకాలను సిద్ధం చేశారు.

President favorite Marathi dishes : అనంతరం వాటిని రుచి చూసిన ద్రౌపది ముర్ము.. ఆ వంటకాలకు ఫిదా అయ్యారు. భోజనాంతరం ఆ వంటలు తయారు చేసిన చెఫ్​లతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ మరాఠా రుచులు చాలా బాగున్నాయని అభినందించారు. ముఖ్యంగా వేరుశనగతో తయారు చేసిన చట్నీ గురించి ఆ వంటవాళ్లను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రపతి వారితో నేరుగా మాట్లాడటంతో అక్కడి వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

చెఫ్​లకు రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఆహ్వానం: షిర్డీ దర్శనం అనంతరం ప్రత్యేక విమానంలో ఆమె దిల్లీ వెళ్లిపోయారు. ఆ తరువాత దిల్లీ రాష్ట్రపతి కార్యాలయం నుంచి సాయి ప్రసాదాలయంలో వంటలు తయారు చేసే ఇద్దరు వంటగాళ్లకు పిలుపు వచ్చింది. రాష్ట్రపతి భవన్‌లో ఆ మరాఠా రుచులను సిద్ధం చేయాలని రాష్ట్రపతి కార్యాలయానికి చెందిన ఓ అధికారి నేరుగా ఫోన్​ చేసి మరీ ఆహ్వానించారు.

దీనిపై స్పందించిన ఇరువురు వంటగాళ్లు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. వారి ఆహ్వానాన్ని గౌరవించి సాయి ప్రసాదాలయానికి చెందిన రవీంద్ర వాహదానే, ప్రహ్లాద్ కర్డేలే రేపు దిల్లీ వెళ్లనున్నారు. ఈ మేరకు వారికి రాష్ట్రపతి కార్యాలయం విమాన టికెట్లను సిద్ధం చేసింది. ఈ ఇద్దరు అక్కడ కొన్ని రోజులు ఉండి రాష్ట్రపతి కార్యాలయంలో పని చేసే వంటగాళ్లకు ఈ మరాఠా వంటలు నేర్పించనున్నారు.

Shirdi Sai Temple Prasadam Menu : షిర్డీ సాయి మందిరంలోని ప్రసాదం తయారు చేసే సాయి ప్రసాదాలయం.. ఆసియాలోనే ఎక్కువ మొత్తంలో భోజనం తయారు చేసే ప్రదేశాల్లో ఒకటి. ఇక్కడ నిత్యం వేళ సంఖ్యలో భక్తులు భోజనం చేస్తుంటారు. వందలాది మంది వంటగాళ్లు నిరంతరం శ్రమించి వంటకాలను తయారు చేస్తుంటారు. భక్తులతో పాటు పేద వారికీ ఇక్కడ ఉచితంగానే భోజనం అందిస్తారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అమింతగా ఇష్టపడిన ఆ వంటకాలు ఇవే..

  • మత్కీ హుసల్
  • మెంతి కూరగాయ
  • ఆలూ జీలకర్ర పొడి
  • సాధారణ పప్పు
  • బియ్యం
  • సిరా లడ్డూ
  • చపాతీ
  • పాపడ్
  • శనగ చట్నీ
  • పెరుగు
  • సలాడ్
  • వడా పావ్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.