ETV Bharat / bharat

'పదవి ఉన్నా, లేకున్నా గాంధీ కుటుంబం వెంటే!'

author img

By

Published : Oct 2, 2021, 4:53 PM IST

పంజాబ్​ కాంగ్రెస్​ నేత (Punjab news) నవజ్యోత్​ సింగ్​ సిద్ధూ(Sidhu news).. కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు పదవి ఉన్నా, లేకపోయినా గాంధీల వెంటే ఉంటానని ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు.

Post or no post will stand by Rahul, Priyanka: Sidhu
పదవి ఉన్నా లేకున్నా గాంధీ కుటుంబం వెంటే.., పంజాబ్​ న్యూస్​, సిద్ధూ

తనకు పదవి ఉన్నా, లేకున్నా.. రాహుల్​ గాంధీ, ప్రియాంక గాంధీ వెంటే ఉంటానని స్పష్టం చేశారు కాంగ్రెస్​ నేత నవజ్యోత్​ సింగ్​ సిద్ధూ(Punjab news). జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్​ బహదూర్​ శాస్త్రిల జయంతి సందర్భంగా.. ట్వీట్​ చేశారు సిద్ధూ. వారి సిద్ధాంతాలను పాటిస్తానని, అదే విధంగా గాంధీల వెంట నిలబడతానన్నారు.

  • Will uphold principles of Gandhi Ji & Shastri Ji … Post or No Post will stand by @RahulGandhi & @priyankagandhi ! Let all negative forces try to defeat me, but with every ounce of positive energy will make Punjab win, Punjabiyat (Universal Brotherhood) win & every punjabi win !! pic.twitter.com/6r4pYte06E

    — Navjot Singh Sidhu (@sherryontopp) October 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

''గాంధీ, శాస్త్రి సిద్ధాంతాలను పాటిస్తా. పదవి ఉన్నా, లేకున్నా.. రాహుల్​ గాంధీ, ప్రియాంక గాంధీ వెంట నిలబడతా. అన్ని వ్యతిరేక శక్తులు నన్ను ఓడించేందుకు ప్రయత్నించనివ్వండి. కానీ సానుకూల శక్తితో .. పంజాబ్​ గెలుపును, సోదరభావాన్ని, ప్రతి పంజాబీనీ గెలిపించేందుకు కృషి చేస్తా.''

- నవజ్యోత్​ సింగ్​ సిద్ధూ

సిద్ధూతో విభేదాల నేపథ్యంలో.. పంజాబ్​(Punjab news) ముఖ్యమంత్రి పదవి నుంచి కెప్టెన్​ అమరీందర్​ సింగ్​ను(Sidhu Amarinder singh) తప్పించి చరణ్​జిత్​ సింగ్​ ఛన్నీని నియమించింది కాంగ్రెస్​ అధిష్ఠానం.

ఆ తర్వాత సిద్ధూపై(Sidhu news) విమర్శలు గుప్పించారు అమరీందర్​ సింగ్​. ఒకవేళ ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తే... కచ్చితంగా ఓడిస్తానని శపథం పూనారు. రాహుల్​, ప్రియాంకకు అనుభవం లేదని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత.. పార్టీ నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించారు.

కొత్త సీఎంగా చరణ్​జిత్​ సింగ్​ ఛన్నీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. కొన్ని పదవుల నియామకంపై అసహనం వ్యక్తం చేశారు సిద్ధూ. కొందరు కేబినెట్​ మంత్రులు సహా తాత్కాలిక డీజీపీ, ఏజీ నియామకాల్ని ప్రశ్నించారు. ఇదే కారణంతో... పీసీసీ చీఫ్​ పదవి నుంచి తప్పుకున్నారు.

పార్టీలో సంక్షోభాన్ని తొలగించేందుకు స్వయంగా రంగంలోకి దిగిన సీఎం.. సిద్ధూను చర్చలకు ఆహ్వానించారు. చండీగఢ్​లోని పంజాబ్​(Punjab news) భవన్​లో సెప్టెంబర్​ 30న భేటీ అయ్యారు. కానీ.. సిద్ధూ రాజీనామాను కాంగ్రెస్​ ఆమోదించిందా లేదా అనేది స్పష్టత లేదు.

ఇవీ చూడండి: 'అందుకే ఎన్ని అవమానాలకు గురిచేసినా భరించా'

మహాత్మా గాంధీకి ప్రముఖుల నివాళులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.