ETV Bharat / bharat

రూ.100 లక్షల కోట్లతో యువత కోసం ఉపాధి యజ్ఞం!

author img

By

Published : Aug 15, 2021, 9:39 AM IST

Updated : Aug 15, 2021, 11:53 AM IST

వచ్చే 25 ఏళ్లలో సమగ్ర దేశాభివృద్ధి జరిగి భారత్​ ప్రపంచ శక్తిగా ఎదగాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. యువతకు ఉద్యోగ కల్పన కోసం రూ. 100 లక్షల కోట్లతో ఓ పథకం అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. 2047 కల్లా భారత్​ ఇంధన ఉత్పత్తిలోను సామర్థ్యం సంపాదించాలని అన్నారు.

modi,, PM image
మోదీ, ప్రధాని మోదీ

75వ స్వాతంత్ర్య దినోత్సవం నుంచి శతాబ్ది ఉత్సవాల మధ్య ఉన్న 25 ఏళ్ల కాలాన్ని అమృత ఘడియలుగా అభివర్ణించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ 25 ఏళ్లను సద్వినియోగం చేసుకుని బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించారు మోదీ.

యువతకు ఉద్యోగ కల్పన..

ప్రధానమంత్రి గతిశక్తి పథకంతో యువతకు ఉద్యోగావకాశాలు మెండుగా లభిస్తాయని ప్రధాని మోదీ నరేంద్ర మోదీ చెప్పారు. దేశంలో సమగ్ర మౌలిక వసతలు అభివృద్ధి కోసం 100 లక్షల కోట్లతో గతిశక్తి పథకాన్ని ప్రకటించారు.

త్వరలోనే గతి శక్తి ప్రాజెక్టు గురించి పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు తెలిపారు మోదీ.

దేశం నలుమూలలా...

'ఆజాదీ కా అమృత్​ మహోత్సవ్​' వేడుకల్లో భాగంగా.. 75 వందే భారత్​ రైళ్లు దేశంలోని వివిధ ప్రాంతాల్లో 75 వారాలపాటు తిరగనున్నాయని మోదీ అన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాలను కలుపుతూ ఈ రైళ్లు ప్రయాణించే ఏర్పాట్లు చేసే పనిలో ఉన్నట్లు తెలిపారు.

ఈశాన్య రాష్ట్రాల రాజధానుల మధ్య రైలు మార్గాలకు త్వరలోనే ప్రణాళిక చేయనున్నట్లు మోదీ పేర్కొన్నారు. ప్రస్తుతం సిక్కింలో మినహా అన్ని ఈశాన్య రాష్ట్రాల్లో రైలు మార్గాలున్నాయి. అయితే.. 2024 కల్లా ఈ రాష్ట్రాలను రైలు మర్గాల ద్వారా అనుసంధానం చేయనున్నట్లు మోదీ తెలిపారు.

ఉడాన్ పథకం ద్వారా దేశంలోని సుదూర ప్రాంతాలను కలిపినట్లు అయిందని మోదీ అన్నారు. ఈ పథకంలో భాగంగానే కొత్త విమానాశ్రయాల నిర్మాణం శరవేగంగా జరుగుతుందని పేర్కొన్నారు.

వారి కోసం ఈ-కామర్స్​ వేదిక

గ్రామాల్లో మహిళా స్వయం సహాయక బృందాలు తయారు చేసిన వస్తువుల కోసం ఈ-కామర్స్​ ప్లాట్​ఫార్మ్​ను అభివృద్ధి చేయనున్నట్లు మోదీ తెలిపారు.

"దాదాపు 110 జిల్లాల్లో.. రోడ్లు, ఆరోగ్యం, విద్య, ఉపాధి, పౌష్టికాహారం మొదలైన కనీస అవసరాలు కల్పించేందుకు ప్రభుత్వం విశేష కృషి చేసింది. గిరిజన ప్రాంతాల్లోని ఈ వెనకబడిన జిల్లాలను దేశంలోని మిగతా జిల్లాలతో సమంగా అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది."

--మోదీ, ప్రధాని.

దాదాపు 8 కోట్లకుపైగా మహిళలు స్వయం సహాయక సంఘాల్లో ఉండడం మెచ్చుకోదగ్గ విషయమని మోదీ అన్నారు. గత కొన్నేళ్లలో గ్రామాల్లో చాలా మార్పులు వచ్చాయని తెలిపారు. ఆప్టికల్ ఫైబర్​ నెటవర్క్, ఇంటర్నెట్​ సదుపాయాలు ఇప్పుడు గ్రామాల్లోను పూర్తి స్థాయిలో ఉన్నాయని పేర్కొన్నారు.

2047 కల్లా..

2047 కల్లా భారత్ ఇంధన ఉత్పత్తిలో ప్రపంచ శక్తిగా ఎదగాలని మోదీ అన్నారు. గ్రీన్​ హైడ్రోజన్ ఉత్పత్తికి హబ్​గా మారాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి ఏడాది భారత్..​ ఇంధన వనరుల దిగుమతి కోసం రూ. 12 లక్షల కోట్లు ఖర్చు చేస్తుందని స్పష్టం చేశారు.

సీఎన్‌జీ, ఎల్‌ఎన్‌జీ నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు మోదీ తెలిపారు.

ఇదీ చదవండి:శతాబ్ది ఉత్సవాల నాటికి ప్రబలశక్తిగా భారత్: మోదీ

Last Updated : Aug 15, 2021, 11:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.