ETV Bharat / bharat

'భారత్​లోకి సింగిల్​ డోసు స్పుత్నిక్ టీకా' ​

author img

By

Published : May 16, 2021, 10:22 AM IST

రష్యా అభివృద్ధి చేసిన సింగిల్​ డోసు టీకా 'స్పుత్నిక్​ లైట్'​ను త్వరలోనే భారత్​లో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుపుతున్నామని ఆ దేశ రాయబారి తెలిపారు. భారత్​లో తమ స్పుత్నిక్​ వీ టీకాను ఏడాదికి 850 మిలియన్ల డోసుల చొప్పున ఉత్పత్తి చేస్తామని తెలిపారు.

Sputnik
స్పుత్నిక్​ టీకా

భారత్​లో ఏడాదికి 850 మిలియన్ల స్పుత్నిక్​- వీ కొవిడ్​ టీకా డోసులను ఉత్పత్తి చేస్తామని రష్యా రాయబారి ఎన్​ కుదేశవ్​ తెలిపారు. సింగిల్​ డోసు టీకా 'స్పుత్నిక్​ లైట్'​ను త్వరలోనే భారత్​లోకి తీసుకువచ్చే ప్రణాళికలు చేస్తున్నట్లు చెప్పారు.

"ప్రపంచవ్యాప్తంగా స్పుత్నిక్​- వీ టీకా సామర్థ్యం అందరికీ తెలుసు. రష్యాలో 2020 అర్ధభాగం నుంచే దీన్ని వినియోగించటం ప్రారంభించాం. కొవిడ్​ స్ట్రెయిన్​లపై ఈ టీకా సమర్థంగా పని చేస్తుందని రష్యా శాస్త్రవేత్తలు ఇదివరకే స్పష్టం చేశారు."

-ఎన్​ కుదేశ​వ్​, రష్యా రాయబారి

స్పుత్నిక్- వీ టీకా ధరపై డాక్టర్​ రెడ్డీస్​ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ రూపొందించిన ఈ టీకా ఒక్క డోసు ధర 995.40 రూపాయలని వెల్లడించింది. స్థానికంగా పంపిణీ ప్రారంభం అయ్యాక టీకా ధర తగ్గే అవకాశం ఉందని పేర్కొంది.

ఇదీ చూడండి: భారత్‌లో తొలి సింగిల్ డోస్​ టీకా అదేనా?

ఇదీ చూడండి: స్పుత్నిక్-వీ టీకాల కోసం డాక్టర్ రెడ్డీస్​కు కేజ్రీ లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.