ETV Bharat / bharat

Pawan Says his support to Chandrababu Naidu will Continue: చంద్రబాబుకు నా మద్దతు కొనసాగుతుంది: పవన్‌ కల్యాణ్‌

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 10, 2023, 8:44 PM IST

Updated : Sep 10, 2023, 9:32 PM IST

Pawan_Says_his_support to_Chandrababu_Naidu
Pawan_Says_his_support to_Chandrababu_Naidu

Pawan says his support to Chandrababu Naidu will continue టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. చంద్రబాబుకు తన మద్దతు కొనసాగుతుందని పవన్‌ కల్యాణ్ స్పష్టం చేశారు. మనం కోసం ఓ వ్యక్తి నిలబడినప్పుడు..తిరిగి ఆ వ్యక్తి కోసం నిలబడటం సంస్కారమన్నారు.

Pawan says his support to Chandrababu Naidu will continue స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు.. విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. చంద్రబాబుకు తన మద్దతు కొనసాగుతుందని పవన్‌ కల్యాణ్ స్పష్టం చేశారు. విశాఖపట్నంలో గొడవ జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి.. తనకు మద్దతు తెలిపారని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. మనం కోసం ఓ వ్యక్తి నిలబడినప్పుడు.. తిరిగి ఆ వ్యక్తి కోసం నిలబడటం సంస్కారమన్నారు. అందుకే చంద్రబాబు నాయుడికి తన మద్దతు ఉంటుందని పవన్ కల్యాణ్ ప్రకటించారు.

Pawan Kalyan Comments: గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం నాడు పవన్ కల్యాణ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ''కోనసీమ జిల్లాలో నా వారాహి యాత్రపై 2వేల మంది నేరగాళ్లను దింపారు. కోనసీమలో 50 మందిని చంపేయాలని పథకం పన్నారు. వైఎస్సార్సీపీ మూకల కుట్ర తెలిసి, కేంద్ర పెద్దలు దాన్ని నిలువరించారు. నాకు కేంద్ర ఇంటెలిజెన్స్‌ నుంచి ఈ సమాచారం వచ్చింది. శాంతిభద్రతల సమస్య సృష్టించేందుకు కుట్రలు పన్నారు. తణుకు, భీమవరంలో వారాహి యాత్రపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. ప్రజలను భయభ్రాంతులను చేసేందుకు ప్రయత్నించారు. మీరు చేసిన పనులకు ఎవరూ భయపడేవాళ్లు లేరని గుర్తించాలి. చట్టాలు సరిగా పనిచేస్తే బెయిల్‌పై వచ్చినవాళ్లు సీఎం కాలేరు. దివ్యాంగులను సైతం బెదిరిస్తున్నారు.'' అని ఆయన అన్నారు.

Pawan Kalyan on Chandrababu Arrest: మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకున్న పవన్​కల్యాణ్​

Pawan Kalyan Fire on YSRCP Leader: రాజకీయాలు ప్రశాంతంగా ఉంటాయని ఎప్పుడూ అనుకోవద్దని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ప్రశ్నించే వారిపై హత్య కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. అన్ని రకాలుగా అడ్డుకున్నారు కనుకే రోడ్డుపై పడుకుని నిరసన తెలిపానని పవన్ వివరించారు. ఈ ప్రభుత్వం.. రాజకీయాలను మరో స్థాయికి తీసుకెళ్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్య నిషేధం అన్నవారు.. దానిపైనే డబ్బు సంపాదిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలందరూ మేల్కోవాల్సిన సమయం ఇదేనని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.

Pawan Kalyan Sensational Comments : 'అన్నీ ఆలోచిస్తే.. టీడీపీ పాలనే బెటర్.. వైసీపీని గద్దె దించాల్సిందే'

వివేకా హత్యకు గురైతే ఆయన కుటుంబ సభ్యులే ఒక్కోలా మాట్లాడారు. రాత్రి నన్ను పోలీసులు అడ్డుకున్నారు. అప్పుడు నేనేం చేయాలి. వైఎస్సార్సీపీ నేతలు యుద్ధం కోరుకుంటున్నారు. జీ20 సమావేశాల నుంచి దృష్టి మళ్లించేందుకే చంద్రబాబును అరెస్టు చేశారు. జగన్ వైఖరి గురించి కేంద్ర నాయకత్వానికి చెప్పాలని అనుకుంటున్నా. కేంద్ర నాయకులు కూడా ఒక్కోసారి ఏమీ చేయలేరు. కొన్నిసార్లు కేంద్ర నాయకత్వం చేతులు కూడా కట్టేసి ఉంటాయి. కేంద్రం ఏపీకి అండగా నిలిచిందన్న గౌరవం కూడా జగన్‌కు లేదు. రాష్ట్ర పరిస్థితులను కూడా కేంద్రం లోతుగా అధ్యయనం చేయాలి.- పవన్ కల్యాణ్, జనసేన పార్టీ అధినేత

Skill Development Case Updates: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ఈనెల 22 వరకు చంద్రబాబుకు రిమాండ్‌

చంద్రబాబుకు నా మద్దతు కొనసాగుతుంది: పవన్‌ కల్యాణ్‌
Last Updated :Sep 10, 2023, 9:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.