ETV Bharat / bharat

ఇండిగో విమానంలో ప్యాసింజర్​ హల్​చల్​.. బ్యాగ్​లో బాంబు ఉందంటూ..

author img

By

Published : Jul 22, 2022, 12:21 AM IST

airport bomb
airport bomb

పట్నా నుంచి దిల్లీ వెళ్లాల్సిన ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు.. తన బ్యాగులో బాంబు ఉందని చెప్పి హల్​చల్​ సృష్టించాడు. దీంతో విమానాన్ని అత్యవసరంగా నిలిపివేశారు అధికారులు. ఎయిర్​పోర్ట్​కు చేరుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు.

బిహార్​లోని పట్నా ఎయిర్​పోర్ట్​ నుంచి దిల్లీ వెళ్లే ఇండిగో విమానంలో(6e 2126) ఓ ప్రయాణికుడు హల్​చల్​ సృష్టించాడు. తన బ్యాగులో బాంబు ఉందని అందర్నీ భయభ్రాంతులకు గురిచేశాడు. దీంతో వెంటనే అధికారులు.. విమానాన్ని అత్యవసరంగా పట్నా విమానాశ్రయంలోనే నిలిపివేశారు.

వెంటనే ప్రయాణికులను సురక్షితంగా దించేశారు అధికారులు. హుటాహుటిన బాంబు స్క్వాడ్​, డాగ్​ స్క్వాడ్​ నిపుణులు, పోలీసులు విమానం వద్దకు చేరుకున్నారు. ప్రయాణికుడ్ని అదుపులోకి తీసుకుని తనిఖీలు చేపట్టారు. అయితే ప్రయాణికుడి బ్యాగులో ఎటువంటి బాంబు లేదని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: డిప్యూటీ కలెక్టర్​కు చేదు అనుభవం.. నడిరోడ్డుపై చితకబాదిన భార్యాభర్తలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.