ETV Bharat / bharat

హైదరాబాద్​ మహిళకు రూ.1.20 కోట్లు టోకరా.. ఇద్దరు అరెస్ట్​!

author img

By

Published : Apr 4, 2021, 5:21 AM IST

ఆన్​లైన్​ వేదికగా.. హైదరాబాద్​ మహిళ వద్ద రూ.1.20 కోట్లు కాజేసిన ఇద్దరు నిందితులను మధ్యప్రదేశ్​ ఇందోర్​లో అరెస్ట్​ చేశారు తెలంగాణ సైబర్​ క్రైమ్​ పోలీసులు. రెండు రోజులు అక్కడే ఉండి కేటుగాళ్లను పట్టుకున్నారు.

online fraud in indore
ఆన్​లైన్​ మోసాలు

మధ్యప్రదేశ్​ ఇందోర్​ వేదికగా.. ఆన్​లైన్​ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు కేటుగాళ్లను అరెస్ట్​ చేశారు హైదరాబాద్​ సైబర్​ క్రైమ్​ పోలీసులు. నిందితుల్లో ఒకరిని రవి కిశోరియాగా గుర్తించారు. నిందితులు ఇద్దరిని హైదరాబాద్​కు తరలిస్తున్నారు.

ఇదీ జరిగింది..

ఇందోర్​లో శానిటైజేషన్​ ఆర్గనైజేషన్​ నడుపుతున్నాడు రవి కిశోరియా. తన స్నేహితుడితో కలిసి ఫేస్​బుక్​ ద్వారా ఆన్​లైన్​ మోసాలకు పాల్పడుతున్నాడు. ఇందులో భాగంగా హైదరాబాద్​కు చెందిన ఓ మహిళను ఆన్​లైన్​ ట్రేడింగ్​ పేరుతో బురిడీ కొట్టించారు. వారి మాయమాటలు నమ్మిన మహిళ.. రూ.5 లక్షలు పెట్టుబడి పెట్టింది.

కొద్ది రోజుల్లోనే ఇందోర్​ నుంచి హైదరాబాద్​ మహిళకు ఓ యువతి ఫోన్​ చేసింది. మీకు రూ.81 లక్షల బహుమతి వచ్చిందని తెలిపింది. ఈ స్కీంలో మరింత పెట్టుబడి పెడితే ఎక్కువ మొత్తంలో సంపాదించుకోవచ్చని నమ్మించింది.

"ఆన్​లైన్​ కేటుగాళ్ల మాటలు నమ్మి మొత్తం రూ.1.20 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశాను. డబ్బులు పెట్టాక.. వారికి ఫోన్​ చేస్తే సమాధానం లేదు"

- బాధిత మహిళ

తాను ఫోన్​చేస్తే సమాధానం లేకపోయేసరికి మోసపోయానని గ్రహించి.. హైదరాబాద్​ సైబర్​ క్రైమ్​ పోలీసులకు ఫిర్యాదు చేసింది మహిళ. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఇందోర్​ వేదికగా ఈ మోసం జరిగిందని గుర్తించి.. అక్కడికి వెళ్లారు. రెండు రోజుల పాటు అక్కడే ఉండి ఇద్దరని అరెస్ట్​ చేశారు.

ఇదీ చూడండి: కొట్టేసిన కార్డులతో రూ.2 కోట్ల ఆన్​లైన్​ షాపింగ్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.