ETV Bharat / bharat

odisha covid news: రెసిడెన్షియల్​ కాలేజ్​లో 33మంది బాలికలకు కరోనా

author img

By

Published : Dec 2, 2021, 10:36 AM IST

odisha covid news: ఒడిశా దెంకనల్​లోని ఓ రెసిడెన్షియల్​ కళాశాలలో కొవిడ్​ కలకలం సృష్టించింది. 33మంది బాలికలకు కరోనా సోకింది. ఫలితంగా ఆ కళాశాలను మూసివేశారు.

odisha covid cases, రెసిడెన్షియల్​ కళాశాలలో కొవిడ్​ కలకలం
రెసిడెన్షియల్​ కళాశాలలో కొవిడ్​ కలకలం.. ఆ 33మందికి..

odisha student covid: ఒడిశాలో కరోనా కలవరపాటుకు గురిచేస్తోంది. తాజాగా.. దెంకనల్​లోని కుంజకంట ప్రాంతంలో ఉన్న రెసిడెన్షియల్​ కాలేజీలో 33మంది బాలికలకు కొవిడ్​ సోకినట్టు తేలింది.

తొలుత.. కాలేజీలోని నలుగురికి కరోనా సోకింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది.. మిగిలిన వారికి పరీక్షలు నిర్వహించారు. ఇందులోనే కొవిడ్​ కేసులు బయటపడ్డాయి.

కరోనా విజృంభణ నేపథ్యంలో కాలేజీని పూర్తిగా మూసివేశారు. కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు రంగంలోకి దిగిన అధికారులు.. కాలేజీని పూర్తిగా శానిటైజ్​ చేశారు.

odisha covid news
రెసిడెన్షియల్​ కళాశాల

గత వారం..

ఒడిశా రాయ్‌రంగ్‌పుర్‌ జిల్లాలో 26మంది విద్యార్థినులు కరోనా బారిన పడ్డారు. మయూర్‌భంజ్‌లోని ప్రభుత్వ రెసిడెన్షియల్‌ బాలికల పాఠశాలలో ఈ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. 259 విద్యార్థులు, 20 మంది సిబ్బంది ఉన్న ఈ పాఠశాలలో పెద్దఎత్తున కేసులు బయటపడటం వల్ల అధికారులు అప్రమత్తం అయ్యారు. పాఠశాల వద్ద అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచారు. అత్యవసర పరిస్థితే తలెత్తితే వెంటనే బాధితులను తరలించేందుకు అంబులెన్స్‌ ఉపయోగపడుతుందని తెలిపారు. పాఠశాలకు వస్తున్న బాలికలు స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నట్లు ఉపాధ్యాయులు గమనించారు. బాధిత విద్యార్థులకు గత గురువారం కరోనా పరీక్షలు నిర్వహించగా 26మందికి కొవిడ్‌ నిర్ధరణ అయినట్లు తాజా నివేదికల్లో వెల్లడైంది. ప్రస్తుతం బాధితులందరినీ పాఠశాల ప్రాంగణంలో ఉంచి వైద్యసేవలు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఇవీ చూడండి:- మరో మెడికల్​ కాలేజీలో కరోనా కలకలం.. ఆ ఏడుగురికి..

కర్ణాటకలో...

corona cases in colleges: కర్ణాటక ధార్వాడ్​లోని ఎస్​డీఎమ్ వైద్య కళాశాలలోనూ కొవిడ్​-19 కలకలం సృష్టించింది. ఇప్పటివరకు వైరస్​ బారిన పడిన విద్యార్థుల సంఖ్య 281కు చేరినట్లు ధార్వాడ్ జిల్లా కలెక్టర్ నితీశ్​ పాటిల్ తెలిపారు. కొత్తగా 99 మందికి వైరస్ నిర్ధరణ కాగా.. ఇంకా 1,822 శాంపిల్స్​ ఫలితాలు రావాల్సి ఉందన్నారు. కరోనా నిర్ధరణ అయిన 281 మందిలో కేవలం ఆరుగురిలో మాత్రమే కొవిడ్​ లక్షణాలు కనిపించాయని, మిగతా వారికి ఎలాంటి లక్షణాలు లేవన్నారు. అయితే వీరందరూ పూర్తిగా టీకాలు వేసుకున్న వారేనని వివరించారు. విద్యార్థులందరినీ క్వారంటైన్​కు తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు.

కాలేజీలో నవంబరు 17న జరిగిన ఫ్రెషర్స్​ పార్టీనే కరోనా విజృంభణకు కారణమని వైద్యాధికారి నితేశ్​ కె. పాటిల్ ఇదివరకే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు సైతం పాల్గొన్నారు.

విద్యార్థుల శాంపిల్స్​ను జీనోమ్ సీక్వెన్​సింగ్ కోసం పంపించారు. ఇప్పటికే క్యాంపస్​లోని రెండు హాస్టళ్లను శానిటైజ్ చేశారు అధికారులు.

ఇవీ చూడండి:-

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.