చిట్టి చేతులతో పెద్ద బాధ్యత

author img

By

Published : Jul 30, 2021, 10:17 AM IST

childrens repair road

ఎవరికోసమో ఎదిరిచూడలేదు ఆ చిన్నారులు.. తమ గ్రామ సమస్యను తామే పరిష్కరించుకుందామనుకున్నారు. చేయి.. చేయి కలిపి తమ రోడ్డును బాగు చేసుకున్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.

రహదారిని మరమ్మతు చేసిన చిన్నారులు

మనకెందుకులే.. మనం ఏం చేస్తాం.. పెద్దవాళ్లున్నారుగా చేయడానికి.. అని ఊరుకోలేదు ఈ చిన్నారులు. తమ గ్రామ రోడ్డు సమస్యను తామే పరిష్కరించుకోవడానికి నడుం బిగించారు. చిట్టి చేతులతో రాళ్లను మోస్తూ రహదారిని బాగు చేసుకున్నారు.

ఒడిశాలోని భద్రక్​, బాగ్మారా గ్రామంలో రోడ్డు గుంతలమయమయ్యింది. అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా ప్రయోజనం లేకపోయింది. దీంతో రాళ్లను ఏరుతూ గుంతల్లో పోసి రోడ్డును బాగు చేసే పనిలో పడ్డారు ఆ ఊరి చిన్నారులు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.

చిన్నారుల వీడియోతో అధికారులు స్పందించారు. బాగ్మారాలో జరిగిన సంఘటన నిజమే అయితే.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని భద్రక్​ బీడీఓ మనోజ్​ బెహెరా అన్నారు. అసిస్టెంట్ ఇంజనీర్​ ఆ ప్రాంతాన్ని సందర్శించి రిపోర్ట్​ను సమర్పిస్తారని తెలిపారు. రోడ్డు మరమ్మతు పనులు చేపడతామని చెప్పారు.

ఇదీ చదవండి:ఐస్​క్రీమ్​ పుల్లలతో ఒలింపిక్స్ స్టేడియం.. చూసేయండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.