ETV Bharat / bharat

రష్యా వ్యాక్సిన్​ అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి

author img

By

Published : Apr 13, 2021, 9:27 AM IST

Updated : Apr 13, 2021, 9:48 AM IST

sputnik vaccine update in india, స్పుత్నిక్​-వి
స్పుత్నిక్​-వి టీకా

09:23 April 13

రష్యా వ్యాక్సిన్​ అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి

రష్యా వ్యాక్సిన్​ స్పుత్నిక్​-వి అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) అనుమతి లభించింది. ఈ టీకాపై మనదేశంలో డాక్టర్​ రెడ్డీస్​ లేబొరేటరీస్​ క్లినికల్​ పరీక్షలు నిర్వహించింది. టీకాకు అనుమతుల విషయంపై సోమవారం భేటీ అయిన నిపుణుల కమిటీ డీసీజీఐకు సిఫార్సు చేసింది.  

ఇప్పటికే దేశంలో కొవిషీల్డ్​, కొవాగ్జిన్​ వ్యాక్సిన్​లు అందుబాటులో ఉండగా.. స్పుత్నిక్​ మూడో టీకా కానుంది. దేశంలో టీకాల కొరత నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్పుత్నిక్​-వి టీకాను ఇప్పటికే అనేక దేశాల్లో వినియోగిస్తున్నారు.  

దేశంలో ప్రస్తుతం సీరం ఇనిస్టిట్యూట్‌ తయారు చేస్తున్న కొవిషీల్డ్, భారత్ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకాలను వినియోగిస్తున్నారు.  

ఇదీ చదవండి : కరోనా విలయం: ఒక్క రోజులో 1,61,736 కేసులు

Last Updated : Apr 13, 2021, 9:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.