ETV Bharat / bharat

'పార్లమెంట్ నూతన భవనం ప్రజల ఆకాంక్షలకు ప్రతీక'

author img

By

Published : Dec 10, 2020, 12:17 PM IST

Updated : Dec 10, 2020, 2:58 PM IST

Prime Minister Narendra Modi is scheduled to lay the foundation stone of the new Parliament building on Thursday. The proposed four-storeyed new Parliament building would sprawl in an area of 64,500 square metres.

PM to lay foundation stone of the new Parliament building on Thursday
పార్లమెంట్ కొత్త భవనానికి మోదీ భూమిపూజ

14:51 December 10

'130 కోట్ల మంది భారతీయులు గర్వించదగ్గ సుదినం'

దేశంలో ప్రజాస్వామ్యం విఫలం అవుతుందని వచ్చిన వాదనలను భారత్‌ పటాపంచలు చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అంతా చూస్తుండగానే దేశ ప్రజాస్వామ్యం అద్భుతంగా పురోగమిస్తూ ముందుకు సాగుతోందని పార్లమెంటు భవన శంకుస్థాపన కార్యక్రమంలో గుర్తు చేశారు.

ఈ రోజు భారతీయులకు చరిత్రాత్మక దినం అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. నూతన పార్లమెంట్‌ భవనానికి శంకుస్థాపన అనంతరం మోదీ ప్రసంగించారు. 'భారతదేశ ప్రజాస్వామ్య ప్రస్థానంలో ఈ రోజు ఎంతో ప్రత్యేకం. 130 కోట్ల మంది భారతీయులు గర్వించదగ్గ సుదినం ఇది. దేశ ప్రజలందరూ కలిసి నిర్మించుకుంటున్న భవనం ఇది. స్వాతంత్ర్యం వచ్చిన 75ఏళ్ల సందర్భానికి గుర్తుగా ఈ భవనం నిలవనుంది. ప్రస్తుత పార్లమెంట్‌ భవనంలోనే భారత రాజ్యాంగ రచన జరిగింది' అని మోదీ తెలిపారు.

14:41 December 10

దేశమే ప్రథమం..

  • వాదాలు, సంవాదాలన్నీ దేశ ప్రయోజనం కోసం మాత్రమే: ప్రధాని
  • సభ లోపలైనా, వెలుపలైనా సంవాదాలు దేశం కోసమే: ప్రధాని
  • మన ప్రతి నిర్ణయంలో 'దేశం ప్రథమం' అన్న భావనే ఉండాలి: ప్రధాని
  • ప్రతి అడుగులో 'దేశమే ప్రథమం' అన్న మాటను గమనంలో పెట్టుకోవాలి: ప్రధాని
  • పార్లమెంట్ నూతన భవనం కూడా ఒక దేవాలయమే: ప్రధాని మోదీ
  • ఈ దేవాలయంలో ప్రాణప్రతిష్ట చేయాల్సింది రానున్న ప్రజాప్రతినిధులే: ప్రధాని

14:41 December 10

  • మాగ్నాకార్టా కంటే ముందే భారత్‌లో హక్కుల కోసం ప్రయత్నాలు: ప్రధాని
  • మాగ్నాకార్టా కంటే ముందే బసవేశ్వరుడు ప్రజాస్వామ్య సూత్రాలు చెప్పారు: మోదీ
  • దేశంలో ప్రజాస్వామ్యానికి అంతకు ముందు నుంచే ఎన్నో ప్రయత్నాలు: ప్రధాని
  • 10వ శతాబ్దంలోనే తమిళనాడులో పంచాయతీ వ్యవస్థ గురించి సవివరంగా చెప్పారు: ప్రధాని
  • భారతదేశ ప్రజాస్వామ్య ప్రస్థానానికి దాదాపు వెయ్యేళ్ల చరిత్ర ఉంది: ప్రధాని
  • వెయ్యేళ్ల క్రితమే ప్రజాస్వామ్య ప్రయాణానికి బాటలు వేశారు: ప్రధాని
  • రుగ్వేదంలో కూడా ప్రజాస్వామ్యం గురించి ప్రస్తావన ఉంది: ప్రధాని
  • భారతదేశం సమాజ మూలాల్లోనే ప్రజాస్వామ్యం విధానాలు ఉన్నాయి: ప్రధాని
  • భారతదేశ తత్వచింతన అంతా ప్రజాస్వామ్య ఆధారంగానే సాగింది: ప్రధాని
  • ప్రపంచ ప్రజాస్వామ్య వ్యవస్థలకు పురిటిగడ్డ భారతదేశం: ప్రధాని
  • ప్రజాస్వామ్యానికి భారతదేశం తల్లిలాంటిది: ప్రధాని మోదీ
  • దేశ ప్రజాస్వామ్య ప్రయాణం ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా సాగుతోంది: ప్రధాని
  • దేశంలో ప్రతి ఎన్నికకు ఓటింగ్‌శాతం పెరుగుతూ వస్తోంది: ప్రధాని
  • ప్రజాస్వామ్య వ్యవస్థపై దేశ ప్రజలకు అపారనమ్మకం: ప్రధాని
  • ప్రజలకు ఉన్న నమ్మకానికి పెరుగుతున్న ఓటింగ్‌ శాతమే నిదర్శనం: ప్రధాని
  • భిన్నమైన అభిప్రాయాలు ఉండవచ్చు: ప్రధాని మోదీ
  • ప్రజాస్వామ్యంపై మాత్రం ఎవరికీ వ్యతిరేకత లేదు: ప్రధాని

14:27 December 10

ఆత్మనిర్భర్​ భారత్​కు దిశానిర్దేశం..

  • ప్రస్తుత భవనం స్వాతంత్ర్యం తర్వాత దేశానికి దశదిశ నిర్దేశించింది: ప్రధాని
  • నూతన భవనం ఆత్మనిర్భర్‌ భారత్‌కు దిశానిర్దేశం చేయనుంది: ప్రధాని
  • నూతన పార్లమెంట్ భవనం దేశ ప్రజలందరికీ గర్వకారణం: ప్రధాని
  • నూతన భవనం స్వాతంత్ర్య భారతంలో రూపుదిద్దుకుంటోంది: ప్రధాని
  • భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఇదో కీలక మైలురాయి: ప్రధాని
  • స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో ప్రజాస్వామ్యం ఓ విఫలప్రయత్నం అన్నారు: ప్రధాని
  • ఇప్పుడు వాళ్లందరూ చూస్తూ ఉండగానే ప్రజాస్వామ్య భారతం అద్భుతంగా పురోగమిస్తోంది: ప్రధాని మోదీ

14:15 December 10

  • ఈరోజు భారతీయులకు చరిత్రాత్మక దినం: ప్రధాని మోదీ
  • భారతదేశ ప్రజాస్వామ్య ప్రస్థానంలో ఈరోజు ఎంతో ప్రత్యేకం: ప్రధాని
  • 130 కోట్ల మంది భారతీయులు గర్వించదగ్గ సుదినం: ప్రధాని
  • దేశ ప్రజలందరూ కలిసి నిర్మించుకుంటున్న భవనం ఇది: ప్రధాని
  • స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్ల సందర్భానికి గుర్తుగా ఈ భవనం నిలవనుంది: ప్రధాని
  • ప్రస్తుత పార్లమెంట్‌ భవనంలోనే భారత రాజ్యాంగ రచన జరిగింది: ప్రధాని
  • పార్లమెంట్ నూతన భవనం భారతీయుల ఆకాంక్షలకు ప్రతీక: ప్రధాని
  • ప్రస్తుత భవనం భారత ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేసింది: ప్రధాని
  • అంబేడ్కర్‌ వంటి మహనీయులు సెంట్రల్‌ హాల్‌లో రాజ్యాంగ రచన పూర్తిచేశారు: ప్రధాని
  • చరిత్రను గౌరవిస్తూనే వాస్తవ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి: ప్రధాని
  • దశాబ్దాల తరబడి సేవలు అందించిన ప్రస్తుత భవనం విశ్రాంతి కోరుతోంది: ప్రధాని

14:07 December 10

ప్రజాస్వామ్య ఆకాంక్షలు..

  • నూతన భవన శంకుస్థాపన సందర్భంగా శుభాభినందనలు: లోక్‌సభ స్పీకర్
  • పార్లమెంట్‌ నూతన భవనం 2022లో అందుబాటులోకి వస్తుంది: ఓం బిర్లా
  • భారత ప్రజాస్వామ్య ఆకాంక్షలను కొత్త భవనం నెరవేరుస్తుంది: ఓం బిర్లా
  • మనది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా
  • ప్రస్తుత పార్లమెంట్‌ భవనం ఎన్నో ఘట్టాలకు వేదికగా నిలిచింది: ఓం బిర్లా
  • దేశ స్వాతంత్ర్యం, రాజ్యాంగ రచన వంటి చారిత్రక ఘట్టాలకు వేదికగా నిలిచింది: ఓం బిర్లా
  • భవిష్యత్‌ అవసరాల రీత్యా నూతన భవన నిర్మాణం: ఓం బిర్లా

14:05 December 10

ఇదే నాంది..

  • నేటి శంకుస్థాపన కార్యక్రమం ఆత్మనిర్భర్‌ భారత్‌కు కూడా నాంది: హర్‌దీప్‌సింగ్
  • దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 2022కు 75 ఏళ్లు: హర్‌దీప్‌సింగ్
  • నూతన పార్లమెంట్‌ భవనంలోనే 75వ స్వతంత్ర భారత సమావేశాలు: హర్‌దీప్‌సింగ్

13:38 December 10

సర్వ ధర్మ ప్రార్థన..

వివిధ మతాలకు చెందిన పెద్దలు.. నూతన పార్లమెంట్​ ప్రాంగణంలో సర్వ ధర్మ ప్రార్థనను నిర్వహించారు.

13:22 December 10

శంకుస్థాపన...

నూతన పార్లమెంట్​ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇందుకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్రమంత్రులతో పాటు వివిధ దేశాలు ప్రతినిధులు పాల్గొన్నారు.

13:11 December 10

  • Delhi: Foundation stone laying ceremony of the new Parliament building is underway.

    Tata Trusts' Chairman Ratan Tata, Union Minister HS Puri, Dy Chairman of Rajya Sabha Harivansh & various religious leaders also present

    Tata Projects Ltd has been given contract for the project pic.twitter.com/geeGWik99N

    — ANI (@ANI) December 10, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

టాటా హాజరు..

పార్లమెంట్​ భవనం శంకుస్థాపన కార్యక్రమంలో టాటా ట్రస్ట్​ ఛైర్మన్​ రతన్​ టాటా పాల్గొన్నారు. భవన నిర్మాణానికి టాటా ప్రాజెక్ట్స్​ కాంట్రాక్ట్​ దక్కించుకున్న సంగతి తెలిసిందే.

కేంద్రమంత్రి పూరి, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్​ హరివంశ్​తో పాటు ఇతర నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

12:58 December 10

నూతన పార్లమెంట్​ భవనానికి ప్రధాని మోదీ భూమిపూజను నిర్వహిస్తున్నారు.

12:19 December 10

నూతన భవనం విశేషాలు..

  • మొత్తంగా 64 వేల 500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మాణం
  • అధిక తీవ్రతతో వచ్చే భూకంపాలను సైతం తట్టుకునే సామర్థ్యం
  • నాలుగు అంతస్తుల్లో నూతన పార్లమెంట్ భవనం
  • భూగర్భంలోని లోయర్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌లో 20 మంత్రుల కార్యాలయాలు, గ్రౌండ్‌ ఫ్లోర్‌లో 18 కార్యాలయాలు
  • మొదటి అంతస్థులో 26, రెండో అంతస్థులో 28 కార్యాలయాల నిర్మాణం
  • లోక్‌సభకు ఆనుకొనే ఉండే విధంగా ప్రధాన మంత్రి కార్యాయం

నూతన పార్లమెంట్​ భవనంపై మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి

12:06 December 10

శంకుస్థాపన మహోత్సవానికి సర్వం సిద్ధం

పార్లమెంట్ నూతన​ భవన శంకుస్థాపన మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. మధ్యాహ్నం 12 గంటల 55 నిమిషాలకు ప్రధాని భూమి పూజతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఒంటి గంటకు భవనానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం సర్వ ధర్మ ప్రార్థన నిర్వహిస్తారు.

ప్రస్తుత పార్లమెంట్ భవనం వందేళ్లు పూర్తి చేసుకుంటున్నందున.. కొత్త భవన నిర్మాణం తలపెట్టినట్లు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఇటీవల చెప్పారు. దేశ విభిన్నతను చాటిచెప్పేలా నిర్మించే ఈ నిర్మాణాన్ని 2022 కల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Last Updated : Dec 10, 2020, 2:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.