ETV Bharat / bharat

పెళ్లైన మూడో రోజే.. ఉరేసుకుని వధువు ఆత్మహత్య!

author img

By

Published : Feb 21, 2021, 1:20 PM IST

పెళ్లైన మూడు రోజులకే ఓ వివాహత ఆత్మహత్య చేసుకుంది. అత్తారింట్లోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడిన దారుణ ఘటన.. ఒడిశాలో వెలుగు చూసింది.

Three days after marriage, bride hangs self in Odisha
పెళ్లైన మూడు రోజులకే.. ఉరేసుకుని ఆత్మహత్య!

ఒడిశాలోని ఢెంకానాల్​లో.. పెళ్లైన మూడు రోజులకే ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లోని ఓ గదిలో ఫ్యాన్​కు వేలాడుతున్న ఆ వివాహితను చూసి.. కుటుంబసభ్యులు కన్నీరుపెట్టుకున్నారు. అయితే మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని తెలుస్తోంది.

ఏం జరిగిందంటే?

ఢెంకనాల్​ జిల్లా హిందోల్​ పరిధిలోని కలందా గ్రామానికి చెందిన హరిహర నాయక్​ కుమార్తెకు.. బిదబంఢ వాసి అయిన మదన్​ మోహన్​ నాయక్​తో ఈ నెల 17న వివాహమైంది. అయితే.. ఆమె పదో తరగతి చదువుతున్నప్పటి నుంచే మానసిక స్థితి సరిగ్గా ఉండేది కాదు. ఆమె తరచూ వైద్యులను సంప్రదించి, మందులు వాడేది. ఈ విషయాన్ని దాచి పెట్టి.. ఆమెకు వివాహం చేశారు తల్లిదండ్రులు. ఇలా మానసిక వ్యాధితోనే అత్తారింట్లో కాలుమోపిందా నవ వధువు. ఇంతలో ఆమె వ్యాధి తీవ్రమై.. తట్టుకోలేక శనివారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయాలన్నీ ఆమె తల్లిదండ్రులు పోలీసులకు వివరించారు.

Three days after marriage, bride hangs self in Odisha
ఆత్మహత్యకు పాల్పడిన నవ వధువు

ఈ పూర్తి వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి: బామ్మ ఘనత: 80 ఏళ్ల వయసులో పీహెచ్​డీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.