ETV Bharat / bharat

Nara Lokesh about CID Investigation: అవే ప్రశ్నలు.. తిప్పి తిప్పి మళ్లీ అడిగారు: లోకేశ్

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 11, 2023, 6:56 PM IST

Updated : Oct 12, 2023, 7:25 AM IST

Nara Lokesh about CID Investigation: అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో రెండోరోజు సీఐడీ విచారణకు హాజరైన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ను.. దాదాపు 3 గంటల సేపు ఎటువంటి ప్రశ్నలు అడగకుండా అధికారులు బయటకి వెళ్లిపోయారు. సీఐడీ అధికారుల ప్రజంటేషన్‌లో హెరిటేజ్‌ సంస్థ భూములు కోల్పోయి నష్టపోతున్న విషయం ఇప్పుడు కొత్తగా తెలిసిందని లోకేశ్ అన్నారు. సీఎం జగన్‌ వ్యవస్థలను మేనేజ్‌ చేసి చంద్రబాబును అక్రమంగా రిమాండ్‌లో పెట్టారని ఆయన పునరుద్ఘాటించారు.

Nara Lokesh about CID Investigation
Nara Lokesh about CID Investigation

Nara Lokesh about CID Investigation: అవే ప్రశ్నలు.. తిప్పి తిప్పి మళ్లీ అడిగారు: లోకేశ్

Nara Lokesh about CID Investigation: అమరావతి ఇన్నర్‌రింగ్‌ రోడ్డు కేసులో (Amaravati Inner Ring Road case) నారా లోకేశ్‌ వరుసగా రెండో రోజు సీఐడీ (CID) విచారణకు హాజరయ్యారు. బుధవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని సీఐడీ ఆర్థిక నేరాల విభాగం-2 కార్యాలయం లోపలికి వెళ్లిన లోకేశ్‌ సాయంత్రం 5 గంటలకు బయటకు వచ్చారు. మొత్తం 3 గంటలు పాటు ఆయన్ను సీఐడీ అధికారులు ప్రశ్నించారు.

2015లో అమెరికాకు ఏ హోదాలో వెళ్లారని.. లోకేశ్‌ను సీఐడీ అధికారులు ప్రశ్నించగా.. భారతదేశ పౌరుడి హోదాలో వెళ్లానని సమాధానమిచ్చారు. ఏ హోదాలో అమెరికాలో వివిధ కంపెనీల ప్రతినిధులను కలిసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు? అని అడగ్గా.. రాష్ట్రంపై ఉన్న ప్రేమ, యువతీ యువకులకు ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో పెట్టుబడులు పెట్టాలని కోరినట్లు లోకేశ్‌ వారికి సమాధానమిచ్చారు.

Lokesh CID Enquiry Questions: సీఐడీ విచారణకు లోకేశ్​.. ప్రశ్నలు అడిగేందుకు అధికారుల తర్జనభర్జనలు..

పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి విధుల గురించి ప్రశ్నించగా.. సవివరంగా లోకేశ్‌ వారికి జవాబిచ్చారు. సీఐడీ అధికారులు అడిగిన ప్రతి ప్రశ్న, అదే విధంగా వాటికి తాను చెప్పిన సమాధానాలను లోకేశ్‌ నోట్‌బుక్‌లో వివరంగా రాసుకున్నారు. అమరావతి ఇన్నర్‌రింగ్‌ రోడ్డు, అవుటర్‌ రింగ్‌ రోడ్డు వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా.. ఎందుకు విచారణకు పిలిచారని దర్యాప్తు అధికారిని లోకేశ్ అడిగారు. ‘‘జీవో నెంబర్‌ 282లో... IRR, ORR అనే పదాలున్నాయని, వాటికి సంబంధించిన మంత్రివర్గ ఉపసంఘంలో సభ్యులుగా ఉన్నందునే విచారణకు పిలిచామని సీఐడీ అధికారులు సమాధానమిచ్చారు.

అమరావతిలో రాజధాని పెట్టాలని 2014లో ఎవరు నిర్ణయించారు? రాజధాని మాస్టర్‌ డెవలపర్‌ ఎవరు? సీడ్‌ క్యాపిటల్‌ ప్రతిపాదన ఎవరిచ్చారు? ఏపీ సీఆర్‌డీఏ ఎవరు ఏర్పాటు చేశారు? ఇన్నర్‌రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్‌ ఎవరు నిర్ణయించారు? తదితర ప్రశ్నలను సీఐడి అధికారులు లోకేశ్​ను అడిగారు. ఇన్నర్‌రింగ్‌ రోడ్డుకు సంబంధించి కేవలం నాలుగైదు ప్రశ్నలు మాత్రమే అడిగినట్లు లోకేశ్‌ తెలిపారు.

Lokesh Comments After CID Enquiry: "ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధం లేని ప్రశ్నలు అడిగారు.. అన్ని గూగుల్​లో సమాధానాలు దొరికేవే"

నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసు, ఫైబర్‌ గ్రిడ్‌ కేసు, ఇన్నర్‌రింగ్‌ రోడ్డు కేసు వ్యవహారంలో ఒక్క రూపాయైనా తన ఖాతాలోకి కానీ, తన తల్లిదండ్రులు, బంధువుల ఖాతాల్లోకి వచ్చినట్లు చూపించగలరా అని లోకేశ్‌ సవాల్‌ విసిరారు. అమరావతి ఇన్నర్‌రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌లో హెరిటేజ్‌ సంస్థే భూములు కోల్పోయి నష్టపోతున్న విషయం సీఐడీ అధికారుల విచారణ వల్ల కొత్తగా తనకు తెలిసిందని లోకేశ్‌ చెప్పారు.

హెరిటేజ్‌ కొనుగోలు చేసిన 9 ఎకరాల భూమి.. గూగుల్‌ ఎర్త్‌లో ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌పై ఎలా ఉంటుందనేది బాహుబాలి సినిమా చూపించినట్లు అధికారులు ప్రజంటేషన్‌లో చూపించారని, దాని ప్రకారం ఇన్నర్‌ రింగ్‌ రోడ్డులో హెరిటేజ్‌ సంస్థే భూమి కోల్పోతున్నట్లు స్పష్టమవుతోందని తెలిపారు. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధమూ లేదు కనుకే.. తన ప్రమేయానికి సంబంధించి ఒక్క ఆధారాన్నీ సీఐడీ అధికారులు విచారణలో చూపించలేకపోయారన్నారు.

Lokesh Attended 2nd Day CID Enquiry: రెండో రోజూ సీఐడీ విచారణకు లోకేశ్​.. 5నిమిషాల ముందే హాజరు..

నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో అప్పటి నైపుణ్యాభివృద్ధి శాఖ కార్యదర్శి ప్రేమచంద్రారెడ్డి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజేయకల్లం రెడ్డిని ఎందుకు నిందితులుగా చేర్చలేదని లోకేశ్ ప్రశ్నించారు. సీమెన్స్‌ అండ్‌ డిజైన్‌ టెక్‌ సంస్థలు 90 శాతం వాటాను ‘‘గ్రాంట్‌ ఇన్‌ కైండ్‌’ రూపంలో చెల్లిస్తామనే విషయం ఒప్పందంలో స్పష్టంగా ఉందన్నారు. నారా భువనేశ్వరికి ఐటీ రిటర్న్స్‌కు సంబంధించిన డాక్యుమెంట్లను ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో అధికారులు తన ముందుంచడంపై లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమరావతి ఇన్నర్‌రింగ్‌ రోడ్డు కేసులో మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్‌ కూడా సీఐడీ విచారణకు హాజరయ్యారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలకు వరకూ తాడేపల్లిలోని సీఐడీ కార్యాలయంలో విచారణ కొనసాగింది. దాదాపు అయిదు గంటల పాటు వివిధ అంశాలపై ఆయన్ని ప్రశ్నించారు. ఇవాళ మరోసారి విచారణకు హాజరు కావాలని సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు.

CID Investigation Officer Change In Inner Ring Road Case: ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో దర్యాప్తు అధికారి మార్పు

Last Updated : Oct 12, 2023, 7:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.