ETV Bharat / bharat

Nagaland firing incident: నాగాలాండ్​ కాల్పుల ఘటనపై ఆర్మీ దర్యాప్తు ముమ్మరం

author img

By

Published : Dec 29, 2021, 10:24 PM IST

Nagaland firing incident
నాగాలాండ్ కాల్పుల ఘటన

Nagaland firing incident: నాగాలాండ్​లో పౌరులపై బలగాలు కాల్పులు జరిపిన ఘటనపై దర్యాప్తును ముమ్మరం చేసింది భారత ఆర్మీ. ఘటన జరిగిన ప్రాంతంలో పర్యటించి సమాచారం సేకరించింది.

Nagaland firing incident: నాగాలాండ్​లో కాల్పుల ఘటనపై దర్యాప్తును ముమ్మరం చేసింది ఆర్మీ. ఈ మేరకు కాల్పులు జరిగిన మోన్​ జిల్లాలోని ఓటింగ్ గ్రామంలో పర్యటించింది ప్రత్యేక దర్యాప్తు బృందం.

కాల్పుల సమయంలో ఉన్న ప్రత్యక్ష సాక్షులను విచారించినట్లు ఓ ఆర్మీ అధికారి తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం కోసం.. మోన్ జిల్లాలోని టిజిట్ పోలీస్ స్టేషన్​ను సంప్రదించి.. వివరాలు తెలుసుకున్నామని వివరించారు. ఈ ప్రత్యేక దర్యాప్తు బృందానికి సీనియర్ ర్యాంక్ అధికారి జనరల్ మనోజ్ అధ్యక్షుడిగా ఉన్నారు.

ఎవరికైనా ఈ ఘటనకు సంబంధించి ఏదైనా సమాచారం తెలిస్తే.. తమకు షేర్​ చేయాలని ఇప్పటికే రెండుసార్లు పబ్లిక్ నోటీస్​ ద్వారా ప్రజలను కోరినట్లు ఆర్మీబృందం తెలిపింది. వీలైనంత త్వరగా ఈ కేసును ఛేదించేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించింది.

Nagaland Army killings: నాగాలాండ్​లో మిలిటెంట్లుగా భావించి డిసెంబర్​ 4న పౌరులపై కాల్పులు జరిపాయి భద్రతా బలగాలు. ఈ కాల్పుల్లో 14 మంది మృతి చెందారు. మరో 11 మంది పౌరులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనలో ఓ జవాను సైతం ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.

సామాన్య కూలీలపై..

బొగ్గు గనిలో విధులు ముగించుకుని కార్మికులు వెళ్తుండగా మోన్​ జిల్లాలోని ఓటింగ్ వద్ద ఈ కాల్పులు జరిగాయి. కార్మికులు తిరు గ్రామం నుంచి ట్రక్కులో ఇంటికి వెళ్తున్నారు. అయితే, మిలిటెంట్ల కదలికలున్నట్లు సైన్యానికి సమాచారం అందింది. ఈ మేరకు ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టిన బలగాలు.. కాల్పులు జరిపాయి. అయితే, కాల్పుల్లో పౌరులే ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.

ఈ పరిణామంతో జిల్లాలోని ఓటింగ్​ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. స్థానికులు భద్రతా బలగాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బలగాల వాహనాలను తగలబెట్టారు.

ఇదీ చూడండి: ప్రధాని న్యూ ఇయర్​ గిఫ్ట్​.. ప్రతి రైతు ఖాతాలో డబ్బులు జమ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.