ETV Bharat / bharat

వంతెన విషాదం.. ఎంగేజ్​మెంట్ ​రోజే వధువు సహా ఆరుగురు మృతి.. కుటుంబాన్ని కోల్పోయిన మరో వ్యక్తి

author img

By

Published : Nov 1, 2022, 5:59 PM IST

morbi-tragedy
morbi-tragedy

గుజరాత్ మోర్బీ తీగల వంతెన కూలిన ఘటన అనేక కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఎంగేజ్​మెంట్ రోజే ఓ నవ వధువు.. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయింది. మరో ఐదుగురు కుటుంబ సభ్యులు సైతం ఈ దుర్ఘటనలో మరణించారు. మరోవైపు, భార్య, తల్లి సహా సంతానాన్ని కోల్పోయి మరో వ్యక్తి రోధిస్తున్నాడు.

అప్పటివరకు.. ఆదివారం ఆ కుటుంబానికి ఎంతో సంతోషకరంగా గడిచింది. కూతురి ఎంగేజ్​మెంట్​కు వచ్చిన బంధువులు, స్నేహితులతో ఇల్లంతా సందడి.. పెళ్లికి సిద్ధమవుతున్న యువతి మోములో వెలుగు.. అదే ఆనందంలో కొత్తగా ప్రారంభించిన వంతెనను చూసేందుకు వెళ్లారు. అంతే.. కుటుంబంలో ఆనందాలు ఆవిరయ్యాయి. వధువు సహా ఆరుగురు రెప్పపాటులో ప్రాణాలు కోల్పోయారు.

గుజరాత్​లోని మోర్బీ వంతెన కూలిన ఘటన.. మీరా కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ఈ కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు ప్రాణపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారమే మెహబూబాయి మీరా(19) ఎంగేజ్​మెంట్ జరిగింది. ఈ కార్యక్రమం జరిగిన తర్వాత మీరా, మరికొందరు కుటుంబ సభ్యులు వంతెన చూసేందుకు వెళ్లారు. బ్రిడ్జి కుప్పకూలగా.. కాబోయే వధువు సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులను మీరా(19), రుక్సానాబెన్ చౌహాన్(40), సానియాబెన్ చౌహాన్(18), రోషన్​బెన్ పఠాన్(32), మహియా పఠాన్(6), దానిష్ పఠాన్(3)గా గుర్తించారు. తమకు న్యాయం జరగాలని బాధిత కుటుంబానికి చెందిన ఇమ్రాన్ సయ్యద్ డిమాండ్ చేస్తున్నారు. 'దీనికి ఎవరు బాధ్యులో మాకు తెలియదు. ప్రభుత్వమే వారిని గుర్తించాలి. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలి' అని చెబుతున్నారు.

morbi-tragedy
ఇమ్రాన్ సయ్యద్, మీరా కుటుంబ సభ్యుడు

"వివాహం ఎప్పుడు పెట్టుకోవాలని మేమంతా చర్చించుకుంటున్నాం. అప్పుడే మాకు ఫోన్ వచ్చింది. ఆరుగురు చనిపోయారని మాకు చెప్పారు. మా కుటుంబం ఇప్పుడు ఓదార్చలేని స్థితిలో ఉంది. 100-150 సామర్థ్యం ఉన్న వంతెనపైకి 500 మందిని పంపించారు. ఇలా చేస్తే ప్రమాదాలు జరగకుండా ఉంటాయా? రిస్క్ గురించి తెలిసినా.. నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇప్పుడేం చేయాలి? చనిపోయినవారిని ఎలా తీసుకురావాలి?"
-ఇమ్రాన్ సయ్యద్, బాధిత కుటుంబ సభ్యుడు

కుటుంబం దూరం..
మరోవైపు, వంతెన కూలిన ఘటనతో ఆసిఫ్ అనే వ్యక్తికి కుటుంబం దూరమైంది. తన తల్లి, భార్య, సంతానాన్ని ఆసిఫ్ పోగొట్టుకున్నాడు. 'నా కుటుంబమంతా నాశనమమైంది. నాకు రెండున్నరేళ్ల కొడుకు ఒక్కడే మిగిలాడు. 'అమ్మ, నానమ్మ ఎక్కడ?' అని పదేపదే అడుగుతున్నాడు. నేను వాడికి ఏమని సర్దిచెప్పాలి?' అని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఆసిఫ్. "పదిహేనేళ్లపాటు వంతెనకు ఎలాంటి డోకా ఉండదని అడ్వర్టైజ్​మెంట్​లో చూశాను. కానీ 15 రోజులు కూడా వంతెన నిలవలేకపోయింది. రూ.15 టికెట్​తో నా కుటుంబం మొత్తం నాకు దూరమైంది" అని చెబుతున్నారు.

morbi-tragedymorbi-tragedy
ఆసిఫ్, వంతెన ప్రమాదంలో కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధితుడు

అవినీతి వల్లే
మరోవైపు, ఈ ఘటన వెనక అవినీతి దాగి ఉందని బాధితులు ఆరోపిస్తున్నారు. అధికారులు సరిగా వ్యవహరించి ఉంటే అనేక మంది ప్రాణాలతో ఉండేవారని అంటున్నారు. అసమర్థ కంపెనీకి వంతెన కాంట్రాక్టును అప్పగించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

"గడియారాలు తయారుచేసే ఒరేవా సంస్థతో మోర్బీ మున్సిపాలిటీ ఒప్పందం కుదుర్చుకుంది. వంతెనల నిర్మాణం విషయంలో ఆ కంపెనీకి ఎలాంటి నైపుణ్యం లేదు. దీనంతటికి వెనక డబ్బు, అవినీతి ఉంది. అసమర్థ కంపెనీతో కుమ్మక్కై కాంట్రాక్టు అప్పజెప్పారు. జరగబోయే పరిణామాలపై వారికి అవగాహన ఉన్నా.. ఇలాంటి పని చేశారు. బ్రిడ్జిని తెరిచారన్న విషయం కూడా తెలియదని చెబుతున్న ఈ యంత్రాంగాన్ని ఏమనాలి? మోర్బీ మున్సిపాలిటీ, రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనకు పూర్తి బాధ్యత వహించాలి" అని తన కూతురిని కోల్పోయిన ఓ వ్యక్తి పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.